BigTV English
Advertisement

Realme C63 5G First Sale: రూ.9,999లకే కొత్త 5జీ ఫోన్.. ఇవాళే సేల్ స్టార్ట్.. ఈ ఆఫర్లు పొందొచ్చు..!

Realme C63 5G First Sale: రూ.9,999లకే కొత్త 5జీ ఫోన్.. ఇవాళే సేల్ స్టార్ట్.. ఈ ఆఫర్లు పొందొచ్చు..!

Realme C63 5G First Sale: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ Realme ఇటీవల తన లైనప్‌లో ఉన్న అతి చౌకైన 5G స్మార్ట్‌ఫోన్ Realme C63 5Gని భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. లుక్, డిజైన్, ఫీచర్లు పరంగా మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ ఫోన్ సేల్ ఇవాళ స్టార్ట్ కాబోతుంది. ఈ రోజు నుండి ఇ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులోకి రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది 120hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimension 6300 ప్రాసెసర్ ఉంది. అలాగే 8GB ర్యామ్‌తో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh బ్యాటరీని అమర్చారు. ఇప్పుడు దీని ధర, స్పెసిఫికేషన్లతో పాటు ఆఫర్ల వివరాలు తెలుసుకుందాం.


Realme C63 5G Specifications

Realme C63 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. 1604 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 625 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimension 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 8GB LPDDR4x RAM + 128GB వరకు ఇంబిల్ట్ స్టోరేజ్ కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు.


Also Read: వి 40 సేల్ స్టార్ట్.. ఆఫర్లు ఇవే.. మొత్తం ఎన్ని వేరియంట్లు ఉన్నాయంటే?

ఈ Realme స్మార్ట్‌ఫోన్‌ 10W ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే ఇది Android 14 ఆధారిత Realme UI 5.0 పై పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 32-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అందించబడింది. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. సేఫ్టీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించబడింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్‌తో అమర్చబడింది. అంటే వాటర్ అండ్ డస్ట్‌ నుంచి ఇది ఫోన్‌ను కాపాడుతుంది.

Realme C63 5G Price

Realme C63 5G స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా నిర్ణయించబడింది. అయితే ఫస్ట్ సేల్‌లో రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో అప్పుడు దీని ధర రూ. 9,999 తగ్గుతుంది. అలాగే 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999గా, 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ  రెండు వేరియంట్లపై కూడా రూ. 1,000 బ్యాంక్ తగ్గింపు పొందొచ్చు. ఈరోజు (ఆగస్ట్ 20)న మొదటి సేల్ Realme అధికారిక వెబ్‌సైట్, ఇ-కామర్స్ సైట్ Flipkartలో మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది.

Related News

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Big Stories

×