BigTV English

Vikram Rathour: రోహిత్ శర్మ ఒక గజని.. మాజీ బ్యాటింగ్ కోచ్

Vikram Rathour: రోహిత్ శర్మ ఒక గజని.. మాజీ బ్యాటింగ్ కోచ్

Rohit Might Forget His Choice At The Toss, But Never His strategies Vikram Rathour: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుతో ఎలా ఉంటాడు? తన బలాలేమిటి? బలహీనతలేమిటి? బయటకు కనిపించే ఇలాంటివన్నీ చాలామంది ఠకఠకా చెప్పేస్తారు. కానీ డ్రెస్సింగ్ రూమ్ రహస్యాలు ఎవరికి తెలీవు. అలాంటి వాటిలో కొన్ని భారత తాజా మాజీ కోచ్ విక్రమ్ రాథోడ్ తెలిపాడు.


ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రోహిత్ శర్మ వ్యూహాలు ఒక పట్టానా ఎవరికి అర్థం కావని అన్నాడు. నిజానికి తనకి మెమరీ లాస్ ఉంది. బస్సుల్లో మొబైల్ ఫోన్లు, గాడ్జెట్లు ఎప్పుడూ మరిచిపోతుంటాడు. మనవాళ్లే ఎవరో ఒకరు చూసి తెచ్చి ఇస్తుంటారు. అలాగే గ్రౌండులోకి వెళ్లేటప్పుడు టాస్ గెలిస్తే, బ్యాటింగ్ తీసుకోవాలా? బౌలింగు తీసుకోవాలా? అనేది కూడా గుర్తుండదు. అప్పుడు కన్ ఫ్యూజ్ అవుతుంటాడు.

అదంతా ఒక ఫేజ్.. అదే గ్రౌండులోకి వెళ్లిన తర్వాత ఆటలో పడిపోతాడు. అప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ వెళ్లిపోతాడు. నిజానికి టీ 20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో అక్షర్ పటేల్ ఓవర్ అయ్యాక, మాకెవరకీ నమ్మకాల్లేవు. కానీ రోహిత్ శర్మ మాత్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు.


బుమ్రా ఓవర్ ను ముందు వేయించాడు. ఎందుకంటే చివరి ఓవర్ వచ్చేసరికి ఎక్కువ రన్స్ ఉంటే ప్రత్యర్థుల్లో టెన్షన్ మొదలవుతుందనేది వ్యూహం. అది మాకెవరికి అర్థం కాలేదు. బుమ్రా కోటా అయిపోయేసరికి, మాకు సౌండ్ లేదు. అదే సమయంలో బుమ్రా, అర్షదీప్ ఇద్దరూ అద్భుతంగా బౌలింగు చేశారు. చివరి ఓవర్ కి 16 పరుగులతో హార్దిక్ పాండ్యాకి బౌలింగు ఇచ్చాడు.

Also Read: కళ్లు తిరిగి పడిపోయిన వినేశ్ ఫోగట్

ఇక పాండ్యా తన శక్తినంతా ధారపోసి, అనుభవాన్నంతా రంగరించి బౌలింగు చేసి, టీ 20 ప్రపంచకప్ అందించాడు. ఆ సమయంలో రోహిత్ అలాంటి  వ్యూహాలు రచించకపోతే ప్రపంచకప్ అందేది కాదని అన్నాడు. రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్ గా ఉన్నాడు. కానీ గౌతంగంభీర్ వచ్చిన తర్వాత సహాయక సిబ్బందిని మార్చుకున్నాడు. దీంతో విక్రమ్ రాథోడ్ కి వేరే బాధ్యతలను అప్పగించే పనిలో బీసీసీఐ ఉంది.

ఎన్సీఏ హెడ్ గా వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నాడు. తన పదవీకాలం తర్వాత.. ఆ బాధ్యతలను విక్రమ్ రాథోడ్ కి ఇస్తారని అనుకున్నారు. కానీ మళ్లీ లక్ష్మణ్ కి మరో ఏడాది పొడిగించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ సమయంలో రాథోడ్ కి అక్కడే ఎన్సీఏలో మరో బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×