Realme C75 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ మరోసారి టెక్ ప్రపంచంలో తన హవాను చూపించేందుకు రంగంలోకి దిగింది. తాజాగా రియల్‌మీ C75 5Gని భారత మార్కెట్లోకి నిశ్శబ్దంగా విడుదల చేసింది. ఇప్పటికే 2024లో వచ్చిన రియల్‌మీ C65 5Gకి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో, ఈ కొత్త మోడల్ మరింత స్టైలిష్ లుక్, ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. 5G సపోర్ట్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, అల్యూమినియం ఫ్రేమ్ 2 మీటర్ల ఎత్తు నుంచి పడినా పగులకుండే ఉండే ప్రొటెక్షన్ వంటి సౌకర్యాలతో వచ్చింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఇది ఆప్షన్ కాదు, అద్భుతమైన అవకాశమని చెప్పవచ్చు.
డిస్‌ప్లే
రియల్‌మీ C75 5Gలో 6.67-అంగుళాల LCD HD+ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది, దీనివల్ల స్క్రోలింగ్, యానిమేషన్‌లు స్మూత్‌గా కనిపిస్తాయి. ఇది 625 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది, అంటే ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. గేమింగ్, వీడియోలు చూడటం, రోజువారీ ఉపయోగం కోసం ఈ డిస్‌ప్లే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
ప్రాసెసర్, పనితీరు
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్ సిటి 6300 చిప్‌సెట్‌తో శక్తిని పొందుతుంది. ఈ చిప్‌సెట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు అనువైన పనితీరును అందిస్తుంది. ఇది రెండు RAM ఆప్షన్లలో లభిస్తుంది. 4GB లేదా 6GB, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రోSD కార్డ్ స్లాట్ ఉండటం వల్ల స్టోరేజ్‌ను మరింత విస్తరించవచ్చు. రోజువారీ పనులు, సోషల్ మీడియా, లైట్ గేమింగ్ కోసం ఈ ప్రాసెసర్ సమర్థవంతంగా పనిచేస్తుంది.
Read Also: Sony 65 Inch TV: సోనీ టీవీపై రూ.65 వేల తగ్గింపు ఆఫర్..బిగ్ డీల్..
కెమెరా
రియల్‌మీ C75 5Gలో బ్యాక్ కెమెరా 32MP సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లలో అద్భుతమైన ఫొటోలను తీయగలదు. మంచి లైటింగ్ పరిస్థితులలో, ఈ కెమెరా స్పష్టమైన రంగురంగుల పోటోలను తీయగలదు. ముందువైపు 8MP సెల్ఫీ కెమెరా ఉంది, ఇది సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం అనుకూలంగా ఉంటుంది.
బ్యాటరీ, ఛార్జింగ్
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది ఒక రోజు పాటు ఉపయోగించడానికి తగినంత శక్తిని అందిస్తుంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, లేదా అనేక యాప్‌లను ఉపయోగించినా, ఈ బ్యాటరీ మీకు సరిపోతుంది. అంతేకాకుండా 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల బ్యాటరీ త్వరగా ఛార్జ్ అవుతుంది.
సాఫ్ట్‌వేర్
రియల్‌మీ C75 5G ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మీ UI 6తో వస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ కొత్త ఫీచర్లు, స్మూత్ యూజర్ ఇంటర్‌ఫేస్ ద్వారా లభిస్తుంది. రియల్‌మీ UI సులభంగా ఉపయోగించడానికి, ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించబడింది.
కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్ WiFi 5, బ్లూటూత్ 5.3, 5G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. అదనంగా సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, మోనో స్పీకర్, మైక్రోSD స్లాట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 5G సపోర్ట్ ఉండటం వల్ల హై స్పీడ్ ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు.
దీని ధర ఎలా ఉందంటే
Realme C75 5G రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
-4GB RAM + 128GB స్టోరేజ్: రూ. 12,999
-6GB RAM + 128GB స్టోరేజ్: రూ. 13,999
ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రంగులలో వస్తుంది. లిల్లీ వైట్, మిడ్‌నైట్ లిల్లీ, బ్లాసమ్ పర్పుల్. దీనిని realme.in వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.