SRH VS GT Match : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. 51 వ మ్యాచ్ లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో… ఖచ్చితంగా గెలవాల్సిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యంత దారుణంగా ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది గుజరాత్ టైటాన్స్. ఈ దెబ్బకు ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దాదాపు ఎలిమినేట్ అయిందని చెప్పవచ్చు. 225 పరుగులు చేసే క్రమంలో కేవలం 186 పరుగులు మాత్రమే చేసింది హైదరాబాద్. ఈ నేపథ్యంలో ఏకంగా ఆరు వికెట్లు నష్టపోయింది. దింతో 38 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓడింది.
Also Read: Nitish Kumar Reddy : హార్దిక్ పాండ్యా అవుతాడనుకుంటే.. విజయ్ శంకర్ అవుతున్నాడు.. నితీష్ ఫై ట్రోలింగ్
మొదటి ఇన్నింగ్స్ లో దుమ్ము లేపిన గుజరాత్ టైటాన్స్
మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ దుమ్ములేపిందని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్ వికెట్లు నష్టపోయి 224 పరుగులు చేసింది గుజరాత్ టైటాన్స్. ఈ సందర్భంగా.. గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్ అలాగే శుబ్ మన్ గిల్ ఇద్దరు రాణించారు. ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ 23 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఇందులో మొత్తం 9 బౌండరీలు ఉన్నాయి. 208 స్ట్రైక్ రేట్ తో రఫ్పాడించాడు సాయి సుదర్శన్. అటు గిల్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ మ్యాచ్ లో… 38 బంతుల్లోనే 76 పరుగులు చేశాడు గిల్. కానీ చివరికి సెంచరీ మిస్ చేసుకున్న గిల్ రన్ అవుట్ అయ్యాడు. ఇక తన ఇన్నింగ్స్ లో పది బౌండరీలు కొట్టిన గిల్ ఏకంగా రెండు సిక్సర్లు బాదాడు. 200 స్ట్రైక్ రేటుతో రఫ్ఫాడించాడు. ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ జోష్ బట్లర్ కూడా మరోసారి తన బ్యాట్ జులిపించాడు. తన బ్యాటింగ్ లో 37 బంతులలోనే 64 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ కూడా 16 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలోనే మూడు బౌండరీ లతో పాటు నాలుగు సిక్సర్లు కొట్టాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 21 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్ ను ఆదుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు మహమ్మద్ షమీ అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. మూడు ఓవర్లు వేసిన మహమ్మద్ షమీ 48 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు.
Also Read: Virat Kohli: ఆ హాట్ బ్యూటీని.. ఫాలో అవుతున్న విరాట్ కోహ్లీ… అనుష్క కొంప మునిగినట్టే
ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్‌పై రేప్ కేసు
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు సంబంధించిన మాజీ ప్లేయర్ పై రేప్ కేసు నమోదు అయింది. ముంబై ఇండియన్స్ కు సంబంధించిన శివలిక్ శర్మ పై ( Shivalik Sharma ) రే**ప్ కేస్ బుక్ అయింది. జోధాపూర్ కు చెందిన ఓ యువతిని శివలిక్ ప్రేమించి మోసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో… ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి… ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు ఆ యువతీ ఆరోపణలు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా కేసు బుక్ చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. SRH VS GT Match