BigTV English

Shubman Gill : గిల్ ఔట్ పై వివాదం…నాటౌట్ అంటూ వివాదం

Shubman Gill : గిల్ ఔట్ పై వివాదం…నాటౌట్ అంటూ వివాదం

Shubman Gill : ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ చేసింది. అయితే ఓపెనర్ సాయి సుదర్శన్ 48 పరుగులు చేసి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కెప్టెన్ శుబ్ మన్ గిల్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. గిల్ 38 బంతుల్లో 76 పరుగులు చేసి రన్ ఔట్ అయ్యాడు. అయితే గిల్ అసలు రన్ ఔట్ అయ్యాడా..? కాలేదా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Also Read : RCB Fans Cricket: పిచ్‌పై ఎవరైనా బౌలింగ్ చేస్తారు.. మరి నీటిపై? ఇతడి టాలెంట్‌కు దిమ్మతిరుగుద్ది

శుబ్ మన్ గిల్ రన్ ఔట్ పై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ క్లాసెన్ గ్లౌవ్స్ మాత్రమే స్టంప్స్ తగిలాయని.. బంతితో కాంటాక్ట్ లేదని పోస్టులు చేస్తున్నారు. మరోవైపు గిల్ కూడా ఈ నిర్ణయం పై అసహనం వ్యక్తం చేస్తూ.. మైదానాన్ని వీడారు. ఇక ఆఫై ఫోర్త్ అంపైర్ తో కూడా వాగ్వాదానికి దిగారు గిల్. మరీ అసలు గిల్ ఔటా..? నాటౌటా..? చర్చ జరగడం విశేషం. గుజరాత్ బ్యాటర్లలో బట్లర్ 37 బంతుల్లో 64 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక వాషింగ్టన్ సుందర్ 15 బంతుల్లో 21 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక  ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి గుజరాత్ టైటాన్స్ భారీ టార్గెట్ ఇచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమ్మిన్స్ 1, అన్సారీ 1 వికెట్ తీశారు. కెప్టెన్ గిల్ రనౌట్ కావడం గమనార్హం.


ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 224 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 225 పరుగుల తేడాతో బరిలోకి దిగింది. 49 పరుగుల వద్ద కీలక బ్యాట్స్ మెన్ ట్రావిస్ హెడ్ ఔట్ అయ్యాడు. ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో రషీద్ ఖాన్ చాలా అద్భుతమైన క్యాచ్ పట్టి హెడ్ ని ఔట్ చేశాడు. సిక్స్ పోయిందనుకున్న హెడ్.. రషీద్ ఖాన్ క్యాచ్ పట్టగానే ఆశ్చర్యానికి గురయ్యాడు. 16 బంతుల్లో 20 పరుగులు చేశాడు హెడ్.  ట్రావిస్ హెడ్ ఔట్ అయిన తరువాత వచ్చిన ఇషాన్ కిషన్ 13 పరుగులు మాత్రమే చేశాడు. గత మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్.. ఈసారి తేలిపోయాడు. ఈదశలో అభిషేక్ కి క్లాసెన్ తోడవ్వడంతో స్కోరు బోర్డు మళ్లీ పరుగులు పెట్టింది. కానీ క్లాసెన్ 23 పరుగులు మాత్రమే చేసి ఔట్ అవ్వడంతో సన్ రైజర్స్ కి కష్టంగా మారింది. అభిషేక్, క్లాసెన్ వరుస ఓవర్లలో ఔట్ కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఛేజ్ చేయలేకపోయింది. నితీశ్ 10 బంతుల్లో 21, కమిన్స్ 19 నాటౌట్ గా నిలిచారు. కానీ లక్ష్యాన్ని మాత్రం ఛేదించలేకపోయారు. దీంతో హైదరాబాద్ జట్టుకి మరో ఓటమి తప్పలేదు. దీంతో గుజరాత్ ప్లే ఆప్స్ దగ్గరకావడం.. హైదరాబాద్ మాత్రం ఏడో ఓటమిని తన ఖాతాలో వేసుకొని ప్లే ఆప్స్ అవకాశాలను కోల్పోయిందనే చెప్పవచ్చు. 

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×