Realme GT 6T Mobile Price Leaked: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ మేకర్ రియల్‌మీ త్వరలో భారతదేశంలో రియల్‌మీ GT 6Tని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. మూడు స్టోరేజ్ వేరింయట్‌లలో ఫోన్ రానుంది. ఫోన్‌లో 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంటుంది. అయితే కంపెనీ విడుదల తేదీని కూడా వెల్లడించనప్పటికీ ఒక టిప్‌స్టర్ ఫోన్ అంచనా ధరను Xలో లీక్ చేశాడు. అభిషేక్ యాదవ్ అధికారికంగా కనిపించే పోస్టర్‌ను షేర్ చేసారు. ఇది Realme GT 6T ధరను సూచిస్తుంది. ఫోన్ పూర్తి సమాచారం తెలుసుకోండి.
సమాచారం ఆధారంగా హ్యాండ్‌సెట్ రూ. 35,000 ధరతో ఉంటుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్. స్క్రీన్ చుట్టూ మంచి లుక్‌తో బోర్డర్ ఉంటుంది. పోస్టర్‌లో కనిపించిన స్మార్ట్‌ఫోన్ ధర రూ.31,999. ఇది GT 6T స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్, మిడ్ లేదా టాప్ వేరియంట్ కాదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Also Read: Top 5 Smartphones: సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలనుకుంటున్నారా.. అయితే ఈ ఫోన్లు బెస్ట్..?
Realme GT 6T 💰 Price ₹31,999 pic.twitter.com/tia3kO3Dmf
— Abhishek Yadav (@yabhishekhd) May 11, 2024
మరొక పోస్ట్‌లో ఒక X వినియోగదారు మోడల్‌ను రూ. 29,999 (8GB + 128GB) నుండి ప్రారంభించవచ్చని వెల్లిడించారు. ఇది మరో మూడు వేరియంట్‌లలో రావచ్చు. 8GB + 256GB, 12GB + 256GB, 12GB + 512GB, దీని ధర రూ. 31,999, రూ. 33,999, రూ. 35,999గా ఉంది. అయితే ఇవి అధికారిక ధరలు కాదని గమనించాలి.
Also Read: రూ.15 వేల లోపు బెస్ట్ 5G ఫోన్లు ఇవే.. ఛాన్స్ మిస్ చేసుకోకండి!
ఇది రీబ్రాండెడ్ Realme GT Neo 6 SE అని తర్వాత జనరేషన్ ఫోన్ అని తెలుస్తోంది. దాని ప్రకారం అయితే Realme GT 6T స్పెసిఫికేషన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Realme UI 5.0పై రన్ అయ్యే అవకాశం ఉంది. ఫోన్ 100W వైర్డు ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీని పొందవచ్చు. ఆప్టిక్స్ విషయానికొస్తే స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్, 32MP సెల్ఫీ షూటర్‌ను అందించగలదు. కనెక్టివిటీకి కోసం ఫోన్‌లో Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC, IR బ్లాస్టర్ మరియు USB-C ఛార్జింగ్ పోర్ట్ ఉండవచ్చు.