Redmi Note 14 Series : రెడ్మీ మొబైల్ కు మార్కెట్లో ఉండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈ మొబైల్స్ అతి తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్స్ అందిస్తాయనే టాక్ ఉంది. దీంట్లో భాగంగానే ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను లాంఛ్ చేస్తూ వస్తుంది రెడ్మీ. అయితే తాజాగా తన లైనప్ లో మరో కొత్త మోడల్ ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తుంది ఈ సంస్థ. గతేడాది లాంచ్ అయిన Redmi Note 13 స్మార్ట్‌ఫోన్‌కి సక్సెసర్‌గా త్వరలో Redmi Note 14 సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.
Redmi Note 14 సిరీస్ లైనప్ లో Redmi Note 14, Redmi Note 14 Pro, Redmi Note 14 Pro + వంటి మోడల్స్ ఉండనున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ స్మార్ట్‌ఫోన్ లైనప్ లాంచ్‌కు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని కంపెనీ అందించలేదు. కానీ తాజాగా ఫీచర్స్ ను అఫీషియల్ గా లాంఛ్ చేసింది. రాబోయే ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు మంచి మన్నిక, వాటర్ అండ్ డస్ట్ నిరోధకత కోసం IP రేటింగ్, మెరుగైన బ్యాటరీ లైఫ్‌ని కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది.
రాబోయే రెడ్‌మి నోట్ సిరీస్ ఫోన్‌లు మునుపటి మోడళ్లతో పోలిస్తే పెద్ద అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటాయని తెలిపారు. Redmi Note 14 సిరీస్.. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్‌ను కలిగి ఉంటుంది. అదే సమయంలో గత సంవత్సరం Redmi Note 13 Pro+ ఫోన్ IP68 రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది.
కొత్త నోట్ సిరీస్ ఫోన్‌లు కొత్తగా ప్రారంభించిన iPhone 16 సిరీస్ మాదిరిగా అత్యాధునిక బలమైన డ్రాప్ రెసిస్టెన్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటాయని తెలిపారు. Redmi Note 13 Pro స్మార్ట్‌ఫోన్ 67W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5100mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. అయితే Redmi Note 13 Pro+ ఫోన్ 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని చెప్పబడింది. దీనిబట్టి ప్రో మోడల్‌లో పెద్ద బ్యాటరీని కలిగి ఉంటాయని తెలుస్తోంది. Redmi Note 14 సిరీస్ ఇటీవల IMEI డేటాబేస్‌లో కనిపించింది. దీంతో ఇది ఈ సెప్టెంబర్ నెలలో లాంచ్ అవుతుందని సమాచారం. Redmi Note 14 Pro స్మార్ట్‌ఫోన్ Snapdragon 7s Gen 3 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని చెప్పబడింది.
ఇది 1.5K రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని కూడా చెప్పబడుతోంది. ఇది 24094RAD4 మోడల్ నంబర్‌తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో కూడా దర్శనమిచ్చింది. దీని బట్టి ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ త్వరలో మార్కెట్‌లోకి రాబోతుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
Redmi Note 14 Price –
భారత్ లో ఈ Redmi Note 14 ధర రూ. 21,999 నుండి ప్రారంభమవుతుంది. కాన్ఫిగరేషన్ 8GB/128GB ఉన్న మిడ్ వేరియంట్ ధర రూ. 22,999 అయితే టాప్ ఎండ్ 8GB/256GB ధర రూ. 24,999 కావచ్చని తెలుస్తుంది. 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో పాటు 6 AI ఫీచర్స్ సైతం ఉండనున్నట్లు తెలుస్తుంది.
Redmi Note 14 Pro –
రెడ్‌మి నోట్ 14 ప్రో ధర బేస్ ట్రిమ్ ధర రూ. 28,999 నుండి ప్రారంభమవుతుంది. 8GB/256GB వేరియంట్ ధర రూ. 30,999. రెడ్‌మి నోట్ 14 ప్రో IP69 నుండి IP68 రేటింగ్ ఉండనుంది. ఇందులో 12 AI ఫీచర్లు ఉండవచ్చు.
Redmi Note 14 Pro Plus –
టాప్-ఎండ్ నోట్ 14 ప్రో ప్లస్ ధర బేస్ 8GB/128GB కోసం రూ. 34,999 నుండి ప్రారంభమవుతుంది. ఇక 8GB/256GB వేరియంట్ ధర రూ. 36,999, 12GB/512GB ధర రూ. 39,999 గా ఉండనుంది.