OTT Movies: ఈరోజుల్లో థియేటర్లలో మిస్ అయిన సినిమాలు వెంటనే ఓటీటీలో వచ్చేస్తున్నాయి. అలా కాకుండా నేరుగా ఓటీటీనే రిలీజ్ కోసం ఎంచుకుంటున్న సినిమాలు కూడా ఉన్నాయి. అలా తాజాగా రెండు సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలుపెట్టాయి. అందులో ఒకటి ఎక్స్‌క్లూజివ్‌గా ఆహాలో విడుదల కాగా మరొకటి మలయాళ డబ్బింగ్ చిత్రం కావడం విశేషం. ఇప్పటికే ఆహాలో ఎన్నో డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. అందులో మరొక మలయాళ మూవీ యాడ్ అయ్యింది. ఈ వీకెండ్ థియేటర్లలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఆహాలో ఉన్న ఈ రెండు సినిమాలు చూసి మూవీ లవర్స్ ఎంజాయ్ చేయవచ్చు. అవేంటో మీరే చూసేయండి.
క్రైమ్ థ్రిల్లర్
కామెడియన్ నుండి యాక్టర్‌గా మారాడు ప్రియదర్శి (Priyadarshi). తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఒకవైపు కామెడీ పాత్రల్లో నటిస్తూనే మరోవైపు తనే హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అలా తను హీరోగా నటించిన మూవీ ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ (Thappinchuku Thiruguvadu Dhanyudu Sumathi) థియేటర్లలో విడుదలయ్యి ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవ్వకుండా కనుమరుగు అయిపోయింది. అందుకే ఇప్పుడు ఓటీటీలో గ్రాండ్‌గా విడుదలయ్యింది. ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 28న ఆహా (Aha)లో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు ప్రియదర్శి.
Also Read: తక్కువ ధర అని ఇల్లుతో పాటు చావును కొని తెచ్చుకునే ఫ్యామిలీ… గుండెల్లో గుబులు పుట్టించే హారర్ స్టోరీ
అప్పట్లో రీచ్ అవ్వలేదు
నారాయణ చెన్నా దర్శకత్వంలో తెరకెక్కిన ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ సినిమాలో శ్రిందా, నిరంజనా అనూప్ హీరోయిన్లుగా నటించారు. గోపాల్ శ్యామ్ మరొక కీలక పాత్రలో కనిపించాడు. ఈ ఏడాది ఫిబ్రవరీలో ఈ మూవీ థియేటర్లలో విడుదలయినా అప్పుడు ప్రేక్షకులకు అంతగా రీచ్ అవ్వలేదు. ఇప్పుడు ఆహాలో విడుదలయిన తర్వాత దీనిపై ఆడియన్స్ ఫోకస్ పడింది. దీంతో పాటు ఆహాలో స్ట్రీమ్ అయిన మరొక సినిమా టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళ చిత్రం ‘నారదన్’. ఈ మూవీ చాలాకాలం క్రితమే మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకోగా ఇప్పుడు తెలుగులో డబ్ అయ్యి ఆహాలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది.
నైతిక జర్నలిజంపై సినిమా
‘నారదన్’లో అన్నా బెన్, షరాఫుద్దీన్, ఇంద్రన్స్, జాఫర్ ఇడుక్కి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఇన్‌స్పైర్ అయ్యి తెరకెక్కించారు. ఇందులో న్యూస్ యాంకర్ చంద్రప్రకాష్ పాత్రలో టోవినో థామస్ యాక్టింగ్ గుర్తుండిపోయేలా ఉంటుంది. నేటి TRP-బేస్డ్ మీడియా ల్యాండ్ స్కేప్‌లో నైతిక జర్నలిజం పాత్రపై ‘నారదన్’ (Naradan) తెరకెక్కింది. ఈ సినిమాలో జర్నలిస్టులు ఎదుర్కునే సవాళ్లు, కథల కోసం కనికరం లేని అన్వేషణ గురించి చాలా చక్కగా చూపించారు. ఇప్పటికే మలయాళంలో కాంట్రవర్సీల మధ్య సూపర్ డూపర్ హిట్ అయిన ‘నారదన్’ తెలుగు డబ్బింగ్ వర్షన్.. నవంబర్ 29 నుండి ఆహాలో స్ట్రీమ్ కానుంది.