Redmi Note 15 SE| షావోమీ కంపెనీ సబ్ బ్రాండ్ రెడ్మి.. భారత్‌లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ కొత్త ఫోన్ పేరు రెడ్మి నోట్ 15 SE 5G. ఇది నోట్ 15 సిరీస్‌లో స్పెషల్ ఎడిషన్‌గా వస్తుంది. ఈ ఫోన్ మంచి డిజైన్‌తో, ఆకర్షణీయమైన ఫీచర్లతో బడ్జెట్ కస్టమర్లను టార్గెట్ చేస్తూ రూపొందించబడింది.
రెడ్మి కంపెనీ ఈ ఫోన్ లాంచ్ తేదీని తన ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్ ద్వారా ధృవీకరించింది. Redmi Note 15 SE 5G భారత్‌లో ఏప్రిల్ 2న లాంచ్ అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే అధికారిక మైక్రోసైట్ లైవ్ అయింది. దీంతో ఈ ఫోన్ ఆన్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేయవచ్చు.
విడుదలైన టీజర్‌ల ప్రకారం.. ఈ ఫోన్ స్టైలిష్, ప్రీమియం డిజైన్‌తో వస్తుంది. వెనుక భాగంలో స్క్విర్కిల్ ఆకారంలో కెమెరా మాడ్యూల్ ఉండవచ్చు. యూనిక్ రెడ్ కలర్‌తో గోల్డెన్ ఫ్రేమ్ ఉంటుందని కనిపిస్తోంది. వెనుక ప్యానెల్ మధ్యలో స్పష్టంగా రెడ్మి లోగో కనిపిస్తుంది. ఈ ఫోన్ చైనాలో వచ్చిన చెర్రీ రెడ్ ఎడిషన్.. రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చని టెక్ రిపోర్ట్స్ ద్వారా తెలిసింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో పెద్ద, కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుందని అంచనా. ఇందులో 6.77 ఇంచుల క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ ఉండవచ్చు. ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. పీక్ బ్రైట్‌నెస్ 3,200 నిట్స్ వరకు ఉండవచ్చు. అంటే ఎండలో కూడా స్పష్టమైన ఫొటోలు ఇస్తుంది.
ఈ ఫోన్ మిడ్-రేంజ్‌లో శక్తివంతమైన ప్రాసెసర్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ ఉపయోగించవచ్చు. దీంతో మల్టీటాస్కింగ్, గేమింగ్‌లో స్థిరమైన పర్‌ఫామెన్స్ ఇస్తుంది. యాప్‌లు త్వరగా తెరుచుకుంటాయి. వీడియో గేమ్స్ సాఫీగా ఆడవచ్చు.
రెడ్మి నోట్ 15 SE 5G డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది. 108మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ద్వారా వివరాలతో కూడిన ఫోటోలు తీయవచ్చు. 8MP అల్ట్రా-వైడ్ కెమెరా వైడ్ షాట్స్ కోసం ఉపయోగపడుతుంది. ఫ్రంట్ కెమెరా 20MP సెన్సార్‌తో సెల్ఫీలు, వీడియో కాల్స్ చాలా బాగుంటాయి.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. HyperOS 2 ఇంటర్‌ఫేస్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. 5,520mAh బ్యాటరీ ఉండటం వల్ల ఒక్కసారి చార్జ్ చేస్తే ఎక్కువ సేపు ఉపయోగించవచ్చు. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ భద్రత, సౌకర్యం పెంచుతుంది.
రెడ్మి నోట్ 15 SE 5G తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు అందించి చాలా మంది కొనుగోలుదారులను ఆకర్షించవచ్చు. దాని డిజైన్, డిస్‌ప్లే కెమెరా ఫీచర్లు ఆకట్టుకుంటాయి. రెడ్మి మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లలో తన స్థానాన్ని మరింత బలపరుస్తోంది.
భారత్‌లో త్వరలో రెడ్మి 15a 5G కూడా లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ మార్చి 27న ప్రవేశపెట్టబడుతుంది. షావోమీ అధికారిక స్టోర్‌లో మైక్రోసైట్‌లో ఈ ఫోన్ లైవ్ అయింది. ఇందులో 120Hz డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ ఉండవచ్చు. బ్లూ, పింక్, బ్లాక్ కలర్లలో లభ్యమవుతుంది. 6,300mAh పెద్ద బ్యాటరీ, ఆక్టా-కోర్ 5G చిప్‌సెట్ ఉంటాయి. మెమరీని 2TB వరకు మైక్రోఎస్‌డి కార్డ్‌తో పెంచుకోవచ్చు.