మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో 11 మంది చిన్నారుల మరణానికి కారణమైన కోల్డ్ రీఫ్ దగ్గుమందులో విషపూరితమైన డై ఇథలీన్ గ్లైకాల్(DEG), ఇథలీన్ గ్లైకాల్(EG) ఉన్నట్టు నిర్థారణ అయింది. దీనివల్లే 11మంది చిన్నారులు మరణించాలని తేలింది. దీంతో ఆ కంపెనీపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ కంపెనీ తయారు చేసే ఇతర మందుల అమ్మకాలను కూడా నిషేధించింది.
డై ఇథలీన్ గ్లైకాల్..
వాస్తవానికి మధ్యప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. ఈ దగ్గుమందు తమిళనాడులో తయారైంది. జైపూర్ కి చెందిన శేసన్స్ అనే సంస్థ తమిళనాడులోని యూనిట్ లో ఈ దగ్గుమందు తయారు చేసింది. పిల్లల మరణాల తర్వాత కోల్డ్ రీఫ్ దగ్గుమందుని స్థానికంగా పరీక్షించారు. అయితే అందులో DEG వంటి విష రసాయనాలేవీ లేవని తేల్చారు. కానీ ఆ తర్వాత మరింత విస్తృతంగా పరిశోధన సాగింది. తమిళనాడులోని తయారీ యూనిట్ నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేశారు. దీనిలో DEG ఉన్నట్లు తేలింది. దీనివల్లే చిన్నారుల కిడ్నీలు దెబ్బతిని వారు చనిపోయారు. తమిళనాడులోని డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి పంపిన నివేదికలో ఈ విషయాలు తేటతెల్లం అయ్యాయి.
ఆ విషపదార్థం ఎలా వచ్చింది..?
కోల్డ్‌రీఫ్ సిరప్ (బ్యాచ్ నం. SR-13, 2025-మేలో తయారైన బాటిల్స్ లో ఈ విషపదార్థం ఉంది. వీటి ఎక్స్ పయిరీ డేట్ 2027-ఏప్రిల్) ఈ బాటిళ్లలో 48.6 శాతం డై ఇథలీన్ గ్లైకాల్(DEG) ఉంది. ఇది పూర్తిగా విషపదార్థం. దీన్ని మందుల తయారీలో వాడరు. కానీ ఇది ఆ దగ్గుమందులో ఎందుకు కలిసిందనేది ప్రశ్నార్థకంగా మారింది.సహజంగా ఈ డై ఇథలీన్ గ్లైకాల్(DEG) ని యాంటీఫ్రీజింగ్ మెటీరియల్ గా వాడతారు. అంటే త్వరగా గడ్డకట్టనీయకుండా చేసే పదార్థం ఇది. బ్రేక్ ఫ్లూయిడ్‌లలో దీన్ని ఉపయోగిస్తారు. మనుషులు దీన్ని తీసుకుంటే మూత్రపిండాలు దెబ్బతిని చనిపోతారు. అందులోనూ పసి పిల్లలు దీన్ని తీసుకోవడం వల్ల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. అయితే ఈ శ్రేసన్స్ అనే మందుల కంపెనీ బయటనుంచి తెప్పించే ముడి పదార్థాల్లో కల్తీ వల్ల డై ఇథలీన్ గ్లైకాల్(DEG) అనేది ఆ మందులోకి వచ్చి చేరింది. సరైన నాణ్యతా పరీక్షలు లేకపోవడం, దీనికి రుచి, రంగు లేకపోవడం వల్ల తయారీదారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఇది దగ్గుమందులో కలసిపోయింది. చివరకు పసి పిల్లల ప్రాణాలు తీసింది.
Also Read: Tomato virus: పిల్లల్లో టమాటా వైరస్.. ఇది ఎలా వ్యాప్తి చెందుతోంది? లక్షణాలేమిటీ?
ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) వారు ఇప్పటికే మార్కెట్లోకి వెళ్లిన స్టాక్ అంతా స్వాధీనం చేసుకోవాలని డ్రగ్ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. అమ్మకాలను ఆపివేయాలని, ఆ సంస్థ తయారు చేసే ఇతర మందులను కూడా నిషేధించాలని ఆదేశాలిచ్చారు. శ్రేసన్ కంపెనీ తయారు చేసిన అన్ని ఉత్పత్తుల అమ్మకాలను ఆపివేసి, ల్యాబొరేటరీలో పరీక్షలకు పంపించాలని సూచించారు. ప్రస్తుతం ఈ మందుల సరఫరా ఆగిపోయింది. అయితే దేశంలోనే ఇది పెద్ద సంచలనంగా మారింది. ఈ దగ్గుమందు తాగి పసిపిల్లలు చనిపోవడంతో అసలు ఏ దగ్గుమందు కూడా వాడొద్దని ఆదేశాలు వెలువడ్డాయి. రెండేళ్లలోపు పసిపిల్లలకు అసలు దగ్గుమందులు సిఫారసు చేయొద్దని డాక్టర్లకు ఆదేశాలిచ్చారు అధికారులు.
Also Read: దగ్గు మందు మరణాలు.. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు