OTT Movie : థ్రిల్లర్ సినిమాలు ఇచ్చే కిక్ కి దాసోహం అవుతుంటారు మూవీ లవర్స్. అందులోనూ సైకో కిల్లర్ సినిమాలు, నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఈ సినిమాలు నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఇంటెన్స్ ని క్రియేట్ చేస్తూ, ఆడియన్స్ ని టెన్షన్ పెడుతుంటాయి. మేకర్స్ కూడా ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే థ్రిల్లర్ సినిమా, ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి టార్చర్ చేసే సైకో బ్రదర్స్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ సైకోలు యాసిడ్ ని ఇంజెక్ట్ చేసి దారుణంగా మనుషుల్ని చంపుతుంటారు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే
‘క్యాప్టివిటీ’ (Captivity) ఒక అమెరికన్ హారర్ థ్రిల్లర్ సినిమా. రోలాండ్ జాఫె దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో జెన్నిఫర్ ట్రీ (ఏలిషా కుథ్‌బర్ట్), ఇంకా గ్యారీ (డానియల్ గిల్లీస్), బెన్ (ప్రూట్ టేలర్ విన్స్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 25 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 4.6/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2007 జూలై 13న థియేటర్లలో వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
జెన్నిఫర్ ఒక ఫేమస్ ఫ్యాషన్ మోడల్. ఆమె మ్యాగజైన్ కవర్లు, హోర్డింగ్ లపై కనిపిస్తుంటుంది. పార్టీలు, ఫోటోషూట్స్, ఫ్యాన్స్ తో ఆమె లైఫ్ ఫుల్ గ్లామరస్‌గా ఉంటుంది. ఒక రోజు న్యూయార్క్‌లో ఆమె ఒక చారిటీ ఈవెంట్‌కు వెళ్తుంది. అక్కడ ఆమె డ్రింక్‌లో డ్రగ్ కలిపి, కిడ్నాప్ చేస్తారు. జెన్నిఫర్ కళ్లు తెరిచేసరికి, ఒక చిన్న చీకటి గదిలో లాక్ చేయబడి ఉంటుంది. గదిలో కెమెరాలు, స్పీకర్లు పెట్టి, కిడ్నాపర్ ఆమెను ఎప్పుడూ వాచ్ చేస్తుంటాడు. కిడ్నాపర్ ఆమెను బాగా మెంటల్‌గా టార్చర్ చేస్తాడు. జెన్నిఫర్ బాగా భయపడి, ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ గది నుంచి బయటపడలేకపోతుంది.
కొన్ని రోజులు గడిచాక, జెన్నిఫర్ కి టార్చర్ ఇంకా ఎక్కువ అవుతుంది. కిడ్నాపర్ ఆమెకు గడ్డితో పాటు, ఇది వరకే యాసిడ్ ఇంజెక్ట్ చేసి చంపిన వాళ్ళ బాడిలోని పార్ట్శ్ ని ఫుడ్ గా ఇస్తాడు. దీంతో ఆమె వాటిని చూస్తూనే వామిట్ చేస్తుంది. ఇక ఆమె ఒంటరిగా, హోప్ లేకుండా ఫీల్ అవుతుంది. అప్పుడు ఆమెకు పక్క గదిలో గ్యారీ అనే మరో బంధీ ఉన్నాడని తెలుస్తుంది. వాళ్లు కలసి ఎస్కేప్ ప్లాన్ వేస్తారు. ఇద్దరూ కలిసి కిడ్నాపర్ తో ఫైట్ చేస్తారు. వాళ్లు ఒక టనెల్ ద్వారా బయటకు వెళ్లి, గ్యారేజ్‌లో కారు కనుక్కుంటారు. కానీ కార్ స్టార్ట్ చేస్తే, స్లీపింగ్ గ్యాస్ వల్ల మళ్లీ స్పృహ కోల్పోతారు.
ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. గ్యారీ, అతని బ్రదర్ బెన్ ఇద్దరూ కిడ్నాపర్స్. వాళ్లు జెన్నిఫర్‌ను ట్రాప్ చేశారు. జెన్నిఫర్ ఈ ట్విస్ట్ తెలుసుకుని, గ్యారీ, బెన్‌లతో గట్టిగా ఫైట్ చేస్తుంది. క్లైమాక్స్‌లో కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆమె ఆ హౌస్ నుంచి ఎస్కేప్ అవుతుందా ? కిడ్నాపర్స్ చేతిలో బలవుతుందా ? కిడ్నాపర్స్ ఎందుకు హత్యలు చేస్తుంటారు ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : పెళ్లి కాకుండానే టీనేజ్ అమ్మాయి ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన వయసులో ఇవేం పిచ్చి పనులు పాపా ?