OTT Movie : ప్రతి మనిషిలో ఒక సైకో ఇజం ఉంటుంది. కాక పోతే కొంతమంది వాటిని మంచి దారిలో పెడితే, మరి కొంత మంది చెడుకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. ఒక్కో సారి సమాజం కూడా వీళ్ళని మానసికంగా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్ నుంచి వచ్చిన ‘జోకర్’ సినిమా అద్భుతాలే సృష్టించింది. 1980లో మొదలయ్యే ఈ కథ, మానసిక రోగంతో బాధపడే ఒక సాధారణ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతని ఇన్నర్ ఫీలింగ్స్ ని ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. ఒక జోకర్ గా నవ్వించే పని చేస్తూ, ఒక సైకో కిల్లర్ గా మరే అతని ప్రయాణానికి ఆస్కార్ అవార్డ్ కూడా వరించింది. అంతే కాకుండా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 7,500 కోట్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాలను, తెలుసుకుందాం పదండి.
‘జోకర్’ (Joker) 2019లో విడుదలైన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. టాడ్ ఫిలిప్స్ దీనికి దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రలో ఆర్థర్ ఫ్లెక్ (జోకర్)గా జోక్విన్ ఫీనిక్స్, రాబర్ట్ డి నీరో, జాజీ బీట్స్ నటించారు. దాదాపు 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమా, 2019 అక్టోబర్ 4న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. IMDbలో 8.4/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా JioHotstar, Airtel Xstream Play, Amazon Prime Video లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆర్థర్ ఫ్లెక్ గోతం సిటీలో పార్ట్ టైమ్ క్లౌన్‌గా, కామెడియన్‌గా పని చేస్తుంటాడు. అతని జీవితం పెదరికంలో గడ్డు పరిస్థితిలో ఉంటుంది. దీనికి తోడు అతనికి మానసిక సమస్య కూడా ఉంటుంది. అతను ఉన్నట్టుండి ఒక్కోసారి నవ్వుతూ ఉంటాడు. అది అతన్ని ఇబ్బంది పెడుతుంది. చూసే వాళ్ళు కూడా అతనితో మాట్లాడటానికి అంతగా ఇష్టపడరు. అతను తన అమ్మ పెన్నీ తో కలిసి ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో ఉంటాడు. ఆర్థర్‌కు కామెడియన్ అవ్వాలనే కల, మరీ ముఖ్యంగా మర్రే ఫ్రాంక్లిన్ అనే టీవీ షో హోస్ట్‌లా పాపులర్ కావాలని కూడా ఉంటుంది. కానీ సమాజంలో అతను ఎప్పుడూ ఫైల్ అవుతూనే ఉంటాడు. పనిలో బాస్ తో సమస్యలు వస్తాయి. స్ట్రీట్‌లో అతన్ని గుండాలు కొడతారు. అతని మానసిక సమస్య వల్ల అందరూ దూరం అవుతారు. ఈ సమయంలో ఆర్థర్ తన పొరుగింటి అమ్మాయి సోఫీని ఇష్టపడతాడు. ఆమెతో సంబంధంలో ఉన్నట్లు ఊహించుకుంటాడు. కానీ అతని లైఫ్ డార్క్‌గా మారుతుంది. చేసే ఉద్యోగం కూడా పోతుంది. తన తల్లికి మెడిసిన్ కూడా కొనలేక పోతాడు. అతను మరింత ఒంటరిగా ఫీల్ అవుతాడు.
ఇది ఇలా ఉంటే స్టోరీ ఒక రోజు ఊహించని మలుపు తీసుకుంటుంది. సబ్‌వేలో ముగ్గురు రిచ్ గైస్ ఆర్థర్ ని బాగా ఇబ్బంది పెడతారు. కోపంతో ఆర్థర్ వాళ్లను గన్‌తో కాల్చి చంపేస్తాడు. ఈ ఇన్సిడెంట్ గోతం సిటీలో పెద్ద సంచలనం అవుతుంది. పేదవాళ్లు ఆర్థర్‌ను హీరోలా చూస్తారు. రిచ్ వాళ్లకు వ్యతిరేకంగా రివొల్యూషన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆర్థర్ ఈ హీరో స్టాటస్ గురించి పట్టించుకోడు. అతను తన లైఫ్‌లో ఇంకా స్ట్రగుల్ అవుతుంటాడు. ఇప్పుడు అతని అమ్మ ఒక సీక్రెట్ చెబుతుంది. ఆమె గతంలో థామస్ అనే ఒక రిచ్ బిజినెస్‌మ్యాన్ తో వర్క్ చేసిందని, ఆర్థర్ అతని కొడుకు అని ఒక షాకింగ్ ట్విస్ట్ ఇస్తుంది. ఆర్థర్ ఈ నిజం తెలుసుకోవడానికి థామస్ వేన్‌ను కలవడానికి ట్రై చేస్తాడు. కానీ అతను ఆర్థర్‌ను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఈ ఘటనతో ఆర్థర్ మరింత మెంటల్ డిప్రెషన్ లో పడతాడు. అతని నవ్వు సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ సమయంలో అతను సోఫీతో టైమ్ స్పెండ్ చేస్తున్నట్లు ఊహించుకుంటాడు. కానీ అది అతని మైండ్‌లోని ఫాంటసీ అని తెలుస్తుంది. మరో వైపు గోతం సిటీలో అల్లర్లు పెరుగుతాయి. క్లౌన్ మాస్క్‌లు వేసుకుని ప్రజలు రిచ్ వాళ్లపై ఫైట్ చేస్తారు.
అయితే ఇక్కడే ఆర్థర్ తన అమ్మ గురించి మరో షాకింగ్ నిజం తెలుసుకుంటాడు. నిజానికి ఆమె అతన్ని అడాప్ట్ చేసుకుంది. థామస్ వేన్‌తో లింక్ పూర్తిగా అబద్ధం. ఆమె కూడా అతన్ని చిన్నప్పుడు అబ్యూస్ చేసింది. ఈ ట్రూత్ ఆర్థర్‌ను పూర్తిగా క్రేజీ చేస్తుంది. అతను తన అమ్మను హాస్పిటల్‌లోనే చంపేస్తాడు. ఆ తరువాత అతను క్లౌన్ మేకప్ వేసుకుని, తనని తాను “జోకర్”గా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటాడు. మర్రే ఫ్రాంక్లిన్ షోని విజిట్ చేసి, అక్కడ అతను తన కోపాన్ని, సమాజంపై ఫ్రస్ట్రేషన్‌ను బయటపెడతాడు. అతను మర్రేని లైవ్ టీవీలో చంపేస్తాడు. ఇది గోతం సిటీలో అల్లర్లను మరింత పెంచుతుంది. ఆర్థర్ జోకర్‌గా అల్లరి మూకలకు ఒక హీరోలా మారుతాడు. చివరికి అతన్ని పోలీసులు పట్టుకుంటారా ? మరిన్ని హత్యలు చేస్తడా ? అతని మానసిక స్థితి మారుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : భర్తపోయి బాధపడుతున్న అమ్మాయితో ఇదెక్కడి దిక్కుమాలిన పని ? సైకోకు అమ్మాయి ఇచ్చే షాక్ హైలెట్ భయ్యా