Jio Free YouTube Premium Subscription : ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థ జియో ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం బెస్ట్ ప్లాన్స్ ను తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు జియో ప్రారంభంలో దాదాపు రెండేళ్ల పాటు ఉచిత డేటాను అందించింది. ఈ సేవలతోనే 4G రంగంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. అప్పటినుంచే ఇండియాలో 4G సేవలు మరింత విస్తృతమయ్యాయి. ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఫైబర్ బోర్డ్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పేసింది జియో.
టాప్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. జియో ఫైబర్ బోర్డ్ వినియోగదారులకు 24 నెలల పాటు ఉచిత యూట్యూబ్ ప్రీమియమ్ సబ్స్క్రిప్షన్‌ను ప్రకటించింది. ఈ కొత్త ఆఫర్ ద్వారా జియో ఫైబర్ వినియోగదారులు యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ కిడ్స్ వంటి అన్ని ప్రీమియమ్ సేవలను వినియోగించేందుకు అవకాశం పొందుతారు.
ఈ ఆఫర్ జియో వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ ప్రీమియమ్ సబ్స్క్రిప్షన్ యూజర్లకు అడ్స్ఫ్రీ వీడియోలు, వెబ్‌సైట్‌ల నుండి వీడియోలను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అధిక నాణ్యతలో వీడియోలు వీక్షించడం, యూట్యూబ్ మ్యూజిక్ ను ఆఫ్‌లైన్ లో వినడం వంటి అనేక అదనపు ఫీచర్లను సైతం అందిస్తుంది.
ఈ 24 నెలల ఉచిత సబ్స్క్రిప్షన్ ఆఫర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జియో ఫైబర్ వినియోగదారుల కోసం అందుబాటులో ఉంది. అయితే, ఈ ఆఫర్ ఎప్పటికీ వర్తిస్తుందని చెప్పలేం. మళ్లీ ఏదైనా చట్టపరమైన షరతులు లేదా పర్మిషన్స్ ఆధారంగా మారవచ్చు. అయితే జియో ఫైబర్ సేవలను ఉపయోగించేందుకు జియో కస్టమర్లు ప్రాథమికంగా ఫైబర్ ప్లాన్‌తోనే చెల్లింపులు జరపాలి.
రిలయన్స్ జియో తీసుకువచ్చిన ఈ ప్రకటనతో తన ఫైబర్ వినియోగదారులందరికీ మరింత విలువైన సేవలను అందిస్తుందనే చెప్పాలి. ఇది జియో ప్లాన్‌ల ద్వారా ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించేందుకు కూడా ఉపయోగపడుతుంది. JioAirFiber, JioFiber పోస్ట్‌పెయిడ్ సబ్‌స్క్రైబర్‌లు ఈ ప్లాన్ ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
ఉచిత యూట్యూబ్ ప్రీమియమ్ సబ్స్క్రిప్షన్ తో లాభాలు ఎన్నో –
యాడ్ ఫ్రీ కటెంట్ –
జియో తీసుకొచ్చిన ఈ ఆఫర్ తో వినియోగదారులు కంటెంట్ ను యాడ్స్ లేకుండా చూసే అవకాశం ఉంటుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా కావాల్సిన కంటెంట్ ను ఆస్వాదించవచ్చు.
ఎలిజిబుల్ ప్లాన్స్ –
JioAirFiber, JioFiber పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు రూ. 888, రూ. 1199, రూ. 1499, రూ. 2499, రూ. 3499 ధరలతో అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్స్ ఎలాంటి ఆటంకాలు లేని స్ట్రీమింగ్, ఎంటర్టైన్మెంట్ ను అందిస్తాయి.
ఎలా పొందాలంటే –
MyJio యాప్ ద్వారా అకౌంట్ లాగిన్ అవ్వాలి
డాష్‌బోర్డ్‌లో ప్రదర్శించబడే YouTube ప్రీమియం బ్యానర్‌ను గుర్తించాలి
ప్రస్తుత YouTube ఖాతాకు సైన్ ఇన్ అవ్వాలి లేదా కొత్త ఖాతాను సృష్టించాలి
ప్రీమియం, యాడ్ ఫ్రీ కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి JioFiber లేదా JioAirFiber సెట్ టాప్ బాక్స్‌లో లాగిన్ అవ్వాలి
అయితే ఈ లాగిన్ సమయంలో ముందు ఇచ్చిన డీటెయిల్స్ ను మాత్రమే ఎంటర్ చెయ్యాలి