BigTV English

Psoriasis: సోరియాసిస్ అంటు వ్యాధా? అది ఒకరి నుంచి మరొకరికి సోకుతుందా?

Psoriasis: సోరియాసిస్ అంటు వ్యాధా? అది ఒకరి నుంచి మరొకరికి సోకుతుందా?

దీర్ఘకాలికంగా వదిలిపెట్టని చర్మ సంబంధ వ్యాధి సోరియాసిస్. రోగనిరోధక శక్తిలో తీవ్ర మార్పుల వల్ల ఇది సంభవిస్తుంది. ఎప్పుడు ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? అనేది చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి దీని లక్షణాలు. సోరియాసిస్ ఉన్న వారితో స్నేహం చేసినా, కలిసి జీవించినా అది తమకు వస్తుందేమోనని ఎంతోమంది భయపడుతూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.


సోరియాసిస్ లక్షణాలు

సొరియాసిస్ సోకితే జుట్టు పైనా, చర్మం పైనా తెల్లటి పొలుసుల్లాంటివి ఏర్పడతాయి. అలాగే లేత గులాబీ రంగు లేదా ఎర్రటి రంగులో మచ్చలు కూడా రావచ్చు. అవి విపరీతమైన మంట, దురద పెట్టవచ్చు. పెట్టకపోనూ వచ్చు. ఈ వ్యాధిలో చర్మం విపరీతంగా ప్రభావితం అవుతుంది. వాపు, దురద, పొట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంది. ఎక్కువగా మోకాలు, తల, వీపు, ముఖము, చేతులు, పాదాలు వంటి చోట్ల ఈ సొరియాసిస్ కనిపిస్తూ ఉంటుంది.


అక్కడ వస్తే చాలా ఇబ్బంది

చేతులు కాళ్లపై సొరియాసిస్ కనిపిస్తూ ఉంటే బయట తిరగడం ఇబ్బందిగా అనిపిస్తుంది అలాగే పిరుదుల పైన గజ్జల్లో కూడా సొరియాసిస్ వస్తే కూర్చోవడం టాయిలెట్ కు పోవడం వంటి పనులు కూడా కష్టంగా మారిపోతాయి. సోరియాసిస్ ఒకరి నుంచి ఒకరికి సోకుతుందో లేదో అన్న అనుమానం మాత్రం ఎక్కువ మందిలో ఉంది.

సొరియాసిస్ అంటు వ్యాధా?

సొరియాసిస్ చుట్టూ ఎన్నో అపోహలు ఉన్నాయి. సోరియాసిస్ అంటూ వ్యాధి కాదు. ఇది ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది ప్రాణానికీ ఎలాంటి హాని చేయదు. కాకపోతే దీర్ఘకాలంగా వేధిస్తూ ఉంటుంది. ఇది వ్యక్తుల నుండి మరో వ్యక్తికి వ్యాపించదు. కాబట్టి సోరియాసిస్ ఉన్న వ్యక్తులతో మీరు కలిసి జీవించవచ్చు. ఇది శారీరక స్రావాలు లేదా గాలి, నోటి తుంపరాల ద్వారా వ్యాపించే వైరస్ కాదు, ఇది ఒక రోగ నిరోధక శక్తి ప్రభావం వల్ల కలిగేది.

ఎవరికైనా రావచ్చు

సోరియాసిస్ ఏ చర్మం కలవారికైనా రావచ్చు. పొడి చర్మమే కాదు జిడ్డు చర్మం కలవారు కూడా సొరియాసిస్ బారిన పడే అవకాశం ఉంది. సోరియాసిస్ తీవ్రంగా మారితే చర్మం పగుళ్లు ఏర్పడి రక్తస్రావం కూడా అవుతుంది. సొరియాసిస్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. లక్షణాన్ని బట్టి ఏ వ్యాధి సోకిందో వైద్యులు నిర్ధారిస్తారు

ఇలా అదుపులో ఉంచుకోవచ్చు

సోరియాసిస్ సోకిన వ్యక్తులు నిరంతరం మందులు వాడాల్సిందే. సొరియాసిస్‌కు ఇప్పటివరకు చికిత్స కనిపెట్టలేదు. కానీ దాన్ని అదుపులో ఉంచవచ్చు. వైద్యులు సూచించే జెల్స్, క్రీములు వంటి వాటి ద్వారా సోరియాసిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. కాబట్టి సోరియాసిస్ సోకిన వ్యక్తుల్ని దూరంగా పెట్టాల్సిన అవసరం లేదు. సొరియాసిస్ ఎక్కువగా యుక్త వయసులో ప్రారంభం అవుతుంది. అది జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది. సొరియాసిస్ కున్న వ్యక్తులు బరువును అదుపులో ఉంచుకోవాలి. ఆల్కహాల్, ధూమపానం వంటి అలవాట్లను వదిలివేయాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.

Tags

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×