BigTV English

Pooja Hegde: పూజా పాప ఆశలన్నీ దేవాపైనే.. ముంచుతాడో.. తేలుస్తాడో..?

Pooja Hegde: పూజా పాప ఆశలన్నీ దేవాపైనే.. ముంచుతాడో.. తేలుస్తాడో..?

Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డేకు కష్టకాలం తీరిపోయిందా.. ? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి.  గత కొన్నేళ్లుగా పూజా పాప ఏది ముట్టుకున్నా వినాశనమే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ చిన్నది.. ఆ తరువాత అంతటి విజయాన్ని అందుకున్నదే లేదు. గోల్డెన్ లెగ్ అనిపించుకున్న పూజా.. వరుసగా స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ లు కొట్టేసింది. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్  సరసన లక్కీ ఛాన్స్ పట్టేసింది. ఈ సినిమా హిట్ అయితే ఎంత స్టార్ హీరోయిన్ అయ్యేదో.. కానీ, ఆ లక్ మాత్రం పూజకు కలిసిరాలేదు. రాధేశ్యామ్ ఘోరమైన పరాజయాన్ని అందుకుంది.


ఇక ఈ సినిమా తరువాత పూజా కోలీవుడ్ లో బీస్ట్, టాలీవుడ్ లో ఆచార్య, బాలీవుడ్ లో సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ లాంటి సినిమాల్లో నటించింది. ఇవేమి చిన్న సినిమాలు కాదు.. చిన్న హీరోలు అంతకన్నా కాదు. అయినా కూడా అమ్మడికి అదృష్టం దక్కలేదు. మూడుచోట్లా పరాజయమే దక్కింది. ఎవరైతే ఆమెను గోల్డెన్ లెగ్ అన్నారో.. వారే ఆమెను ఐరెన్ లెగ్ అని ముద్రవేశారు.

ఇక ఇవన్నీ పట్టించుకోకుండా పూజా.. ఈ పరాజయాల నుంచి కొద్దిగా గ్యాప్ తీసుకొని కుటుంబంతో కలిసి మంచి సమయాన్ని గడిపింది. వెకేషన్స్, టూర్స్ అంటూ  ప్రపంచాన్ని చుట్టి వచ్చింది. ఇక ఈ ఏడాది నుంచి అమ్మడు తన సత్తా చూపించడానికి రీఎంట్రీ ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టినట్లు టాక్ నడుస్తుంది. ఇప్పటికే  స్టార్ హీరో సూర్య నటిస్తున్న రెట్రో సినిమాలో పూజా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.


Thandel: బుజ్జితల్లి వీడియో సాంగ్.. సాయిపల్లవి థియేటర్ లో కన్నీరు పెట్టించడం ఖాయం

ఇది కాకుండా ఈ చిన్నది నటిస్తున్న మరో బాలీవుడ్ సినిమా దేవా. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హీరోయిన్ గా  నటిస్తుంది. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ రాయ్ కపూర్ & ఉమేష్ KR బన్సాల్ నిర్మిస్తుండగా..బాబీ సంజయ్, హుస్సేన్ దలాల్ & అబ్బాస్ దలాల్, అర్షద్ సయ్యద్, సుమిత్ అరోరా కథను అందించారు. ఈ చిత్రంలో షాహిద్.. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా దేవా సినిమా నుంచి భాసద్ మచ్చ అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో షాహిద్, పూజా డ్యాన్స్ అదరగొట్టేశారు. ఒక పెళ్ళిలో ఈ సాంగ్ కు  హీరోహీరోయిన్లు డ్యాన్స్ వేస్తూ కనిపించారు. షాహిద్ స్టెప్పులు  ఒక ఎత్తు అయితే పూజా అందం మరో ఎత్తు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. దేవా సినిమాపైనే పూజా ఆశలన్నీ పెట్టుకుంది. మరి దేవా.. హిట్ కొట్టి పూజా ఆశలను తెలుస్తాడో లేక ప్లాప్ అందుకొని మళ్లీ ముంచేస్తాడో  చూడాలి. 

 

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×