BigTV English
Advertisement

Samsung Galaxy A16 5G : శాంసంగ్‌ మరో అరాచకం.. 2 వేరియంట్స్ లో తక్కువ ధరకే సూపర్ స్మార్ట్ ఫోన్స్ లాంఛ్

Samsung Galaxy A16 5G : శాంసంగ్‌ మరో అరాచకం.. 2 వేరియంట్స్ లో తక్కువ ధరకే సూపర్ స్మార్ట్ ఫోన్స్ లాంఛ్

Samsung Galaxy A16 5G : ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ తన వినియోగదారులను ఆక్టటుకునేందుకు ఎప్పటి కప్పుడు సరికొత్త ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తుంటుంది. తాజాగా మరో కొత్త స్మార్ట్​ ఫోన్​ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది.


ఈ మధ్య ‘ఏ’ సిరీస్‌లో ఫోన్లకు మంచి ఆదరణ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో ఫోన్‌ను ఆవిష్కరించింది శాంసంగ్​. శాంసంగ్‌ గెలాక్సీ ఏ16 5జీ పేరిట దీన్ని యూజర్స్​కు పరిచయం చేసింది. ఆరేళ్ల పాటు సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లతో ఈ ఫోన్​ను లాంఛ్​ చేసింది శాంసంగ్​.

ALSO READ : ఫ్లిప్కార్ట్ దివాళి సేల్.. ప్రారంభ తేదీ, డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ ఇవే!


రెండు వేరియంట్లలో – ధర ఎంతంటే? – ఈ శాంసంగ్‌ కొత్త స్మార్ట్ ఫోన్‌ రెండు వేరియంట్లలో యూజర్స్​కు అందుబాటులో ఉండనుంది. 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌ రూ.18,999కు అందుబాటులో ఉండనుంది. అదే 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌ అయితే రూ.20,999 కు సొంతం చేసుకోవచ్చు. మొత్తం మూడు రంగుల్లో ఇది దొరకనుంది. బ్లూ బ్లాక్‌, గోల్డ్‌, లైట్‌ గ్రీన్‌ రంగుల్లో దీన్ని తయారు చేసింది శాంసంగ్.

ఎక్కడ కొనచ్చంటే? – ప్రముఖ ఇ కామర్స్​ ప్లాట్​ఫామ్స్ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్​లో ఈ కొత్త స్మార్ట్ ఫోన్​ను కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్‌ వెబ్‌సైట్లతో పాటు ఇతర రిటైల్‌ దుకాణాల్లోనూ దీనిని కొనుగోలు చేసే వెసులు బాటు ఉంది. ఈ విషయాన్ని కంపెనీ తెలిపింది. అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌లు ఉన్నవారు, వీటిని ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 1000 రుపాయల వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

Samsung Galaxy A16 5G స్పెసిఫికేషన్స్​ – ఈ గెలాక్సీ కొత్త స్మార్ట్ ఫోన్​ 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ + అమోలెడ్‌ డిస్‌ ప్లేతో వచ్చింది. 90 Hz రిఫ్రెష్‌ రేటును కలిగి ఉంది. మీడియా టెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో ఇది నడుస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్‌ సపోర్ట్​తో 1 టీబీ వరకు స్టోరేజ్​ కెపాసిటినీ పెంచుకునే అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది.

కెమెరా ఫీచర్స్​-  కెమెరా ఫీచర్స్​ విషయానికొస్తే అద్భుతంగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్​లో 50 మెగా పిక్సల్​ ప్రధాన కెమెరాతో పాటు , 5 మెగా పిక్సల్​ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ సెన్సర్‌, 2 మెగా పిక్సల్​ మ్యాక్రో లెన్స్​ను అమర్చారు. అలానే ముందు వైపు సెల్ఫీలు, వీడియోల కోసం 13 మెగా పిక్సల్​ కెమెరాను ఇచ్చారు.

IP 54 రేటింగ్‌తో దీన్ని లాంఛ్ చేశారు. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్​లో శాంసంగ్‌ నాక్స్‌ వాల్డ్‌ సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉండటం విశేషం. ఈ విషయాన్ని కూడా శాంసంగ్​ కంపెనీనే తెలిపింది. ఇందులో ఉంజే ఎన్‌ఎఫ్‌సీ ద్వారా ట్యాప్‌ అండ్‌ పే సదుపాయం కూడా పొందొచ్చని కంపెనీ చెప్పుకొచ్చింది.

బ్యాటరీ విషయానికొస్తే 5,000 mAh బ్యాటరీ సామార్థ్యాన్ని ఇది కలిగి ఉంది. ఇంకా ఈ మొబైల్ 25 W ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుందని కంపెనీ తెలిపింది. సింగిల్‌ ఛార్జితోనే రెండున్నర రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌ వస్తుందని వెల్లడించింది.

Related News

Snapchat AI Search: ఏఐ ప్రపంచంలో కీలక ఒప్పందం.. స్నాప్‌చాట్‌లోకి పర్‌ప్లెక్సిటీ ఏఐ సెర్చ్‌!

Vivo 16GB RAM Phone Discount: వివో 16GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా గల పవర్‌ఫుల్ ఫోన్‌పై షాకింగ్ రూ.34,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే..

Smartwatch At Rs 1799: తక్కువ ధరలో టాప్‌ క్లాస్‌ లుక్‌.. రూ.8వేల స్మార్ట్‌వాచ్‌ జస్ట్ రూ1,799లకే

AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

2025 Yamaha RX 100: యమహా ఆర్ఎక్స్100 లెజెండ్‌ పవర్‌ఫుల్‌ రీ ఎంట్రీ.. ఇప్పుడు కొత్త స్టైల్‌తో..

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Big Stories

×