E-Paper
Advertisement

Samsung Galaxy F05 & M05: శాంసంగ్ నుంచి మరో రెండు ఫోన్లు.. ఈ సారి ఎలాంటి ఫీచర్లు ఉండబోతున్నాయో!

Samsung Galaxy F05 & M05: శాంసంగ్ నుంచి మరో రెండు ఫోన్లు.. ఈ సారి ఎలాంటి ఫీచర్లు ఉండబోతున్నాయో!
Advertisement

Samsung Launching Galaxy F05 and M05 Smartphones Soon: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అద్భుతమైన డిజైన్, అదిరిపోయే ఫీచర్లతో కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే చాలా మొబైళ్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన శాంసంగ్ త్వరలో మరో రెండు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. Samsung Galaxy F05, Samsung Galaxy M05 స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో పరిచయం చేయడానికి సిద్ధమైంది. ఈ రాబోయే రెండు ఫోన్‌లు ఇటీవల Wi-Fi అలయన్స్ సర్టిఫికేషన్‌లో దర్శనమిచ్చాయి. దీంతో వీటిని త్వరలోనే లాంచ్ చేయాలని భావిస్తున్నట్లు అర్థం అయింది. Samsung Galaxy F05, Samsung Galaxy M05 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Samsung Galaxy F05, M05 త్వరలోనే ఫోన్ ప్రియులకు అందుబాటులోకి రానున్నాయి. Samsung Galaxy F05, Galaxy M05 రెండూ డ్యూయల్-బ్యాండ్ Wi-Fi కనెక్టివిటీకి మద్దతు ఇస్తాయని Wi-Fi అలయన్స్ సర్టిఫికేషన్ వెల్లడించింది. అధికారిక లాంచ్‌కు ముందు ఈ ఫోన్‌లు సర్టిఫికేషన్‌లో జాబితా చేయబడ్డాయి. Galaxy F05 స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్ SM-E055F/DSతో గుర్తించబడింది. అదే సమయంలో Galaxy M05 స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్ SM-M055F/DSతో గుర్తించబడింది. ఈ రెండు ఫోన్‌లు DS అంటే డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్‌తో మార్కెట్లోకి రానున్నాయి. తద్వారా వినియోగదారులు ఒకే స్మార్ట్‌ఫోన్‌లో రెండు యాక్టివ్ లైన్‌లను పొందవచ్చు. ఇదితప్ప Galaxy F05, Galaxy M05కి సంబంధించి ఇతర సమాచారం ఏదీ వెల్లడికాలేదు.

Advertisement

అయితే దీని ముందు మోడల్.. Samsung Galaxy A05 స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Galaxy A05 6.7-అంగుళాల ఇన్ఫినిటీ-U డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది HD+ రిజల్యూషన్‌తో వస్తుంది. పనితీరు కోసం ఇందులో MediaTek Helio G85 ప్రాసెసర్‌ అందించబడింది. ఇది 6GB RAM + 128GB స్టోరేజ్‌తో వస్తుంది. వినియోగదారులు మైక్రో SD కార్డ్ సహాయంతో విస్తరించవచ్చు.

Also Read: కేవలం రూ.15 వేలలో అమోల్డ్ డిస్‌ప్లే ఫోన్ దొరకడం చాలా అరుదు.. ఇది మీ అదృష్టమే..!

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ బాక్స్ ఆధారంగా OneUI 5.1 కోర్‌లో పని చేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ క్యూ3 డెప్త్ కెమెరా ఉన్నాయి. అలాగే ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. దీన్ని శక్తివంతం చేయడానికి కంపెనీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందించింది. కనెక్టివిటీ ఆప్షన్లలో 4G, డ్యూయల్-బ్యాండ్ WiFi, బ్లూటూత్ 5.3, USB-C పోర్ట్ వంటివి ఉన్నాయి. అలాగే సేఫ్టీ కోసం ఇది ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కలిగి ఉంది.

Tags

Related News

కొత్త Air Purifier కొనేముందు తప్పక చూడాల్సిన 5 ముఖ్యమైన ఫీచర్లు ఇవే!

ఈ స్మార్ట్‌వాచ్ దెబ్బకు మార్కెట్ షేకవ్వాల్సిందే.. భారీ అప్‌గ్రేడ్‌తో Galaxy Watch 9!

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

Big Stories

Advertisement
×