BigTV English

Samsung Galaxy Fit3: సామ్‌సంగ్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్ అదుర్స్.. ధర ఎంతంటే..?

Samsung Galaxy Fit3: సామ్‌సంగ్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్ అదుర్స్.. ధర ఎంతంటే..?


Samsung Galaxy Fit3: ప్రస్తుత కాలంలో అనేక రకాలైన ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. టెక్నాలజీలో మార్పుల కారణంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు చాలా కంపెనీలుఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఫోకస్ పెట్టాయి. అందులో స్మార్ట్‌ వాచెస్, ల్యాప్‌టాప్స్ ఇలా ఎన్నో పరికరాలతో మార్కెట్‌లోకి వచ్చి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ప్రముఖ టెక్ సంస్థ సామ్‌సంగ్.. అద్భుతమైన స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ‘సామ్‌సంగ్ గెలాక్సీ ఫిట్3’ పేరుతో సరికొత్త ఫిట్‌నెస్ ట్రాకర్‌ని లాంచ్ చేసింది. ఇందులో అడ్వాన్స్‌డ్ హెల్త్ మానిటరింగ్ ఫీచర్స్‌తో పాటు మరెన్నో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.


ఈ స్మార్ట్‌వాచ్ 1.6 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫాల్ డిటెక్షన్, ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లను ఈ వాచ్ కలిగి ఉంది. ఈ వాచ్‌లో 208 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 5ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

READ MORE: 50MP కెమెరా, 11GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.6,499లకే.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!

అలాగే ఐపీ 68 రేటెడ్ డస్ట్ రెసిస్టెన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా ఈ ఫిట్‌నెస్ ట్రాకింగ్ డివైజ్‌లో 16mb ర్యామ్, 256mb స్టోరేజ్ ఉంటుంది. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఫీచర్‌ను కూడా ఇది కలిగి ఉంటుంది. ఇందులో 100 కు పైగా వర్కౌట్ టైప్స్, స్నోరింగ్ డిటెక్షన్, హెల్త్ రేట్ – స్ట్రెస్ లెవల్స్ మానిటర్, అడ్వాన్స్‌డ్ స్లీప్ మానిటరింగ్ టూల్స్ ఉన్నాయి.

అంతేకాకుండా పర్సనలైజ్‌డ్ స్లీప్ కోచింగ్ ఫీచర్‌ను కూడా ఇది కలిగి ఉంది. ఎన్హాన్స్‌డ్ స్లీప్ క్వాలిటీకి ఇది పనిచేస్తుంది. ఇక ఈ సామ్‌సంగ్ గెలాక్సీ ఫిట్3 మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. గ్రే, పింక్ గోల్డ్, సిల్వర్ వంటి కలర్‌లతో వచ్చింది.

READ MORE: ’48గంటల బ్యాటరీతో నడిచే ఇయర్ బడ్స్.. ధర కూడా తక్కువే’

కాగా దీని ధర రూ.4,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే లిమిటెడ్ టైమ్ ఆఫర్ కింద రూ.500 క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఈ వాచ్‌ను సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుక్కోవచ్చు.

Tags

Related News

Moon Dust Bricks: చంద్రుడిపై ఇల్లు కట్టేందుకు ఇటుకలు సిద్ధం.. ‘మూన్ డస్ట్ బ్రిక్స్’ మెషిన్ సిద్ధం చేసిన చైనా సైంటిస్ట్

iQOO Z10 4G: 6,000mAh బ్యాటరీతో వచ్చిన కొత్త iQOO Z10 4G.. ఫీచర్లు ఏంటో చూడండి!

Realme P4 5G: గేమింగ్ ప్రేమికుల కలల ఫోన్ వచ్చేస్తోంది.. దీని ఫీచర్స్ ఒక్కొక్కటి అదుర్స్..!

Smartphone market: సూపర్ షాట్ కొట్టిన స్మార్ట్ ఫోన్ ఏది? ఈ జాబితాలో మీ ఫోన్ ర్యాంక్ ఎంత?

Zoom Meeting: జూమ్ మీటింగ్‌లో టీచర్లు మాట్లాడుతుండగా… అశ్లీల వీడియోలు ప్లే చేశారు, చివరకు?

Vivo V60: మార్కెట్ లోకి కొత్త ఫోన్.. హై రేంజ్ ఫీచర్స్ తో.. ఈ మొబైల్ వెరీ స్పెషల్!

Big Stories

×