POCO C55: అతి చౌక ధరలోనే అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా?. అయితే మీకో గుడ్ న్యూస్ ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఫీచర్లతో అతి తక్కువ ధరలోనే మంచి ఫోన్ అందుబాటులో ఉంది.
దాదాపు రూ.14వేల ధరతో 6/128 జీబీ కలిగిన వేరియంట్‌ను మీరు ఊహించుకోలేని ధరలో సొంతం చేసుకోవచ్చు. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంది. అలాగే బ్యాటరీ, ప్రాసెసర్ పరంగా కూడా ఆ ఫోన్ మంచి వర్కింగ్ అనుభూతిని అందిస్తుంది. మరి ఆ ఫోన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో పోకో సి55 స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకోకి చెందిన సి55 (POCO C55) మోడల్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డిస్కౌంట్ పొందొచ్చు. దాదాపు రూ.14 వేల ధర ఉన్న ఈ మొబైల్‌ను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.
READ MORE: ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ సేల్ ప్రారంభం.. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.10వేలే
ధర:
పోకో సి 55 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీని మొదటి వేరియంట్ 4జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ ధర రూ. 11,999గా ఉంది. అలాగే దీని రెండో వేరియంట్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా కంపెనీ నిర్ణయించింది.
అయితే ఇప్పుడు దీని 4/64 జీబీ వేరియంట్‌ను రూ.11,999కి బదులుగా రూ.5,999లకే ఇంటికి తీసుకెళ్లొచ్చు. అలాగే దీని 6/128 జీబీ వేరియంట్‌ను రూ.13,999 ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.6,499కే సొంతం చేసుకోవచ్చు. అలాగే వీటిపై పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
పోకో సి55 స్మార్ట్‌ఫోన్‌పై యూపీఐ ట్రాన్సక్షన్‌పై అంటే రూ.1000 వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే సిటీ బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సక్షన్‌పై రూ.1500 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా పొందొచ్చు.
READ MORE: కొత్త స్మార్ట్‌ఫోన్‌పై బంపరాఫర్.. ఏకంగా రూ.9000 తగ్గింపు!
స్పెసిఫికేషన్స్:
పోకో సి55 స్మార్ట్ ఫోన్ 6.71 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఇది 1 GHz GPUతో శక్తివంతమైన MediaTek Helio G85 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. దీని ద్వారా వినియోగదారులు మంచి అనుభూతిని పొందగలుగుతారు. 6GB టర్బో ర్యామ్‌ను కలిగి ఉన్న ఈ ఫోన్ 11 GB వరకు RAMను విస్తరిస్తుంది.
అలాగే ప్యానెల్‌పై లెదర్ టైప్ ఆకృతి ఈ ఫోన్‌కు మరింత లుక్‌ని అందిస్తుంది. ఇది 50 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది. అంతేకాకుండా 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇది కలిగి ఉంద. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది వస్తుంది.