E-Paper
Advertisement

Instant Loan: ఇన్ స్టంట్ లోను తీసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

Instant Loan: ఇన్ స్టంట్ లోను తీసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
Advertisement

Instant Loan

Best Instant Personal Loan Apps: రుణం తీసుకోవాలంటే ఒకప్పుడు బ్యాంకులు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు డిజిటల్ రంగంలో ఆ బాధ తప్పింది. రుణం తీసుకోవడం సులువైపోయింది. అనుకున్నదే తడవుగా లోన్ లభిస్తుంది. సింగిల్ క్లిక్ తో ఎటువంటి డాక్యుమెంట్లూ తీసుకోకుండానే పని పూర్తవుతుంది. సులువుగా ఇన్ స్టంట్ రుణాలు లభిస్తుండడంతో ఇలాంటి లోన్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఒకవేళ మీరు కూడా ఇన్ స్టంట్ లోన్లు తీసుకోవాలనుకుంటున్నారా.. అంతకంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి.

Advertisement

ఎంచుకోండి ఇలా..

ఇన్ స్టంట్ రుణాలకోసం ఆన్ లైన్ లో వెతికితే ఎక్కువ సంఖ్యలో రుణాలు దర్శనమిస్తాయి. అందులో రుణాలకు సంబంధించిన నియమ నిభందనలు పాటిస్తున్న సంస్థను ఎంపిక చేసుకోండి. కస్టమర్ రివ్యూ, రేటింగ్ లు చూస్తే రుణదాత గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయి. సురక్షితమైన ఆన్ లైన్ లావాదేవీలు, న్యాయమైన రుణ పద్ధతులు ఉంటే అది మంచి రుణ ప్లాట్ ఫామ్ గా గుర్తించవచ్చు. అంతేకాదు నియమ, నిబంధనలు చదవడం చాలా ముఖ్యం.

Advertisement

వడ్డీ రేట్లు..
ఎలాంటి రుణానికైనా వడ్డీ రేట్లు చాలా కీలకం. తక్షణ రుణాలు పొందటం సులువైనప్పటికీ.. సాధారణ రుణాలతో పోలిస్తే ఇలాంటి రుణాలకు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు లేట్ పేమెంట్ ఫీజు, ఫ్రీ పేమెంట్ ఫీజు, ప్రాసెసింగ్ రుసుములు విధిస్తారు. ఈ రుసుములు ఎంత మొత్తంలో ఉండబోతున్నాయనేది ముందుగానే తెలుసుకోవాలి.

కస్టమర్ సపోర్ట్..
ఆర్ధిక లావాదేవీల విషయంలో  కస్టమర్ సపోర్ట్ మాత్రం కచ్ఛితంగా ఉండాలి. రుణం తీసుకున్నాక కొన్ని సార్లు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటిని ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవడానికి మెరగైన కస్టమర్ సపోర్ట్ కలిగిన రుణదాతల్ని ఎంచుకోండి. చాట్, ఫోన్ కాల్స్, ఇ-మెయిల్స్.. వంటి వివిధ సాధనాల ద్వారా తక్షణమే పరిష్కరించే సామర్ధ్యం ఉన్న ఫ్లాట్ ఫామ్ అయితే మరీ మంచిది.

రుణం అవసరం ఎంత..
అత్యవసర పరిస్థితుల్లో మనకు రుణం అవసరమవుతుంది. అలాంటప్పుడు ఎంత మొత్తంలో రుణం తీసుకోవాలనేది ముందుగానే నిర్ణయం తీసుకోండి. సులువుగా లోన్ ఇస్తున్నారని అవసరానికి మించి తీసుకుంటే తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. దీని కోసం నెలవారి ఆదాయం, ఆర్ధిక స్థిరత్వం వంటి విషయాలు ఓ సారీ సమీక్షించుకోండి. ఆ రుణం విషయంలో ముందడుగు వేయండి.

Related News

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

Big Stories

Advertisement
×