BigTV English

Commercial Wife: ‘డబ్బులిస్తేనే శృంగారం’.. భార్య డిమాండ్.. కోర్టుకెక్కిన భర్త!

Commercial Wife: ‘డబ్బులిస్తేనే శృంగారం’.. భార్య డిమాండ్.. కోర్టుకెక్కిన భర్త!

Commercial Wife| టెక్నాలజీ రంగంలో ప్రపంచంలోనే టాప్ దేశం తైవాన్. కానీ ఆ దేశంలో మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. ఉదాహరణకు ఇటీవలే అక్కడి కోర్టులో ఓ విచిత్ర కేసు వచ్చింది. ఇద్దరు పిల్లలున్న ఓ వ్యక్తి తనకు భార్య వేధింపుల నుండి కాపాడమని కోర్టుని వేడుకున్నాడు. ఆమె తనతో శృంగారం చేసేందుకు, కనీసం మాట్లాడేందుకు కూడా డబ్బులు అడుగుతోందని. అలాంటి భార్య నుంచి విముక్తి కోసం విడాకులు ప్రసాదించమని భోరున విలపించాడు. కానీ అతని భార్య మాత్రం విడాకులు కుదరదని వాదించింది.


వివరాల్లోకి వెళితే.. 2014లో హావొ అనే వ్యక్తి జుయాన్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన మూడేళ్లలో వారిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే హావో బరువు పెరిగిపోవడంతో అతడిని జుయాన్ ఇష్టపడేది కాదు. దీంతో హావో ఆమె వద్దకు వెళితే నిరాకరించేది. చివరికి నెలకు ఒకసారి మాత్రమే అని చెప్పింది. ఆ కాస్త కూడా రెండేళ్ల తరువాత 2019లో పూర్తిగా మానేసింది. ఇక తనకు అతనితో శృంగారం చేయడం కుదరదని చెప్పింది. ఈ కారణంగా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. అయితే హావో కూడా తన భార్యకు ఇంతకుముందులా అడిగినంత డబ్బులివ్వడం మానేశాడు.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..


దీంతో జుయాన్ ఒక ఐడియా వేసింది. తనతో శృంగారం చేసిన ప్రతీసారి 15 డాలర్లు( దాదాపు రూ.2500) చెల్లించాలని చెప్పింది. దీనికి ఇష్టం లేకపోయినా హావో ఒప్పుకున్నాడు. కానీ జుయాన్ అంతటితో ఆగలేదు. హావోతో మాట్లాడడం మానేసింది. కేవలం ఫోన్ లో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసేది. పిల్లలను సరిగా పట్టించుకునేది కాదు. వంట చేయడం మానేసింది. ఇంట్లో తనతో ఏం మాట్లాడాలన్నా ప్రతీసారి 15 డాలర్లు చెల్లించాలని కండీషన్ పెట్టింది. లేదా ప్రతిరోజు భోజనంతోపాటు అన్నీకావాలంటే ప్రతి రోజు 60 డాలర్లు చెల్లించాలని షరతులు విధించింది.

Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్

ఇదంతా భరించలేక హావో తన బంధువులను, ఆమె తల్లిదండ్రులను ఇంటికి పిలిపించి సమస్య వివరించాడు. అప్పుడు జుయాన్ తన భర్త చాలా లావుగా ఉన్నడని.. అతను బరువు తగ్గితేనే శృంగారం చేస్తానని బహిరంగంగానే చెప్పింది. వారిద్దరి విషయంలో బంధువులు కూడా ఏమీ చేయలేక వెళ్లిపోయారు. ఇక తన వల్ల కాదని హావో తన భార్య నుంచి విడాకులు కోసం కోర్టుకెక్కాడు. అయితే జుయాన్ మాత్రం విడాకులకు ఒప్పుకోలేదు.

Also Read: ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్

ఇద్దరి వాదనలు విన్న కోర్టు.. హావో మానసికంగా బాధను అర్థం చేసుకొని విడాకులు మంజూరు చేసింది.

Related News

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Big Stories

×