Samsung Galaxy S25 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్ సాంగ్.. త్వరలోనే Samsung Galaxy S25 సిరీస్ ను తీసుకురాబోతుంది. ఇక వచ్చే నెలలో రాబోతున్న ఈ సిరీస్ కు సంబంధించిన ధరలు సైతం ప్రస్తుతం లీక్ అయ్యాయి. గెలాక్సీ ఎస్24 సిరీస్ ధరలోనే ఈ సిరీస్ కూడా ఉంటుందని తాజా లీక్స్ చెబుతున్నాయి.
Samsung Galaxy S25 సిరీస్‌కి సంబంధించిన లీక్‌లు, రూమర్‌లు చాలా కాలంగా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సిరీస్ లో Samsung Galaxy S25, Samsung Galaxy S25 Plus, Samsung Galaxy S25 Ultraతో సహా మూడు ఫోన్‌లను తీసుకువస్తుంది. ఇక ఇప్పటికే ఫీచర్స్ లీక్ అవ్వగా.. తాజాగా ధర సైతం వినియోగదారులను అలరిస్తుంది. ప్రముఖ మ్యాగ్ జైన్ WinFuture ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం రాబోయే ఫోన్‌లు Samsung Galaxy S24 సిరీస్ మోడల్‌ల ధరలకు సమానంగా ఉంటాయని తెలుస్తుంది.
ఈ నివేదిక ప్రకారం, ఈ ఫోన్స్ స్వీడన్, జర్మనీలో వాటి ముందు మెుబైల్స్ ధరలకు సమానంగా ఉండనున్నాయి. అంతే కాకుండా ఇతర దేశాల్లో సైతం శాంసంగ్ ధరల్లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తుంది.
అయితే ఈ మెుబైల్స్ జర్మనీలో లాంచ్ చేసినట్లయితే EUR 899కి Galaxy S25 128GB వేరియంట్, EUR 1149కి Galaxy S25+ 256GB వేరియంట్, EUR 1809కి Galaxy S25 Ultra 256GB వేరియంట్ ను కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Samsung Galaxy S25 సిరీస్ ధర –
సాంసంగ్ ఎస్ 25 సిరీస్ లో మొబైల్స్ దాని ముందు సిరీస్ తో పోలిస్తే సమాన ధరలు ఉన్నప్పటికీ శాంసంగ్ గెలాక్సీ 25 అల్ట్రా మాత్రం రూ.9000 ఎక్కువ ధర ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే శాంసంగ్ నుంచి ఈ సిరీస్ ధరలపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికార ప్రకటన రానప్పటికీ టెక్ వర్గాలు మాత్రం ఈ ధరలను అంచనా వేస్తున్నాయి. Samsung తన ఫ్లాగ్‌షిప్ లో Samsung Galaxy S25 సిరీస్ ను 2025 జనవరిలో ప్రారంభించటానికి సిద్ధమవుతుంది.
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే… Samsung Galaxy S25 Ultra 6.86-అంగుళాల AMOLED డిస్‌ప్లే, హై – ఎండ్ వేరియంట్‌లో 16GB RAMతో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో రాబోతుంది. ఇది 200MP ప్రైమరీ షూటర్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5X జూమ్ 50MP టెలిఫోటో షూటర్, 3X జూమ్‌తో 10MP టెలిఫోటో షూటర్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
ఈ సిరీస్ లో S25+, S25 అల్ట్రా, కొత్త స్లిమ్ మోడల్స్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక Samsung Galaxy S25, Galaxy S25+ మోడల్స్ కలర్ వేరియంట్స్ సైతం అత్యద్భుతంగా ఉన్నాయి. ఈ మోడల్స్ ఐదు కలర్ ఆప్షన్లలో రాబోతున్నట్లు తెలుస్తుంది. నలుపు, ఆకుపచ్చ, ఊదా, నీలం, తెలుపు/వెండి రంగులలో అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తుంది. Galaxy S24, S24+ మెుబైల్స్ అంబర్ ఎల్లో, కోబాల్ట్ వైలెట్, మార్బుల్ గ్రే, ఒనిక్స్ బ్లాక్ కలర్స్ లో అందుబాటులోకి రాబోతున్నాయి.
ALSO READ : యూట్యూబ్ దద్దరిల్లే ఫీచర్.. ఇకపై ఏ భాష కటెంట్ అయినా మీ భాషలోనే వినొచ్చు