Mohan Babu : ఒకప్పుడు సినిమాలతో వార్తల్లో నిలిచిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీ.. ఇప్పుడు గొడవలతో వార్తల్లో హైలెట్ అయ్యింది. తండ్రి కొడుకుల మధ్య ఎటువంటి గొడవలు జరిగాయో సరిగ్గా తెలియదు కానీ ఆస్తుల గురించి గొడవలే అని ప్రస్తుతం వినిపిస్తుంది.. మనోజ్ తన తండ్రి ఇంటి వద్దకు వెళ్లి చేసిన గొడవ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో మీడియా కవరేజ్ కోసం వెళ్లారు. ఈ క్రమంలో మోహన్ బాబు మీడియాపై దాడి చేసిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం దీనిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.. ఇక మోహన్ బాబు స్వల్ప అస్వస్థతకు గురైయ్యారని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఇక జర్నలిస్ట్ పై దాడి చేశాడని మోహన్ పై మర్డర్ అటెంప్ట్ కేసును పోలీసులు నమోదు చేశారు. అయితే తాజాగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్ బాబు ఆడియోను రిలీజ్ చేసాడు. ఆ రికార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
మోహన్ బాబు మాట్లాడుతూ..
తెలుగు ప్రజలకి నమస్కారం.. గత నాలుగు రోజులుగా జరుగుతున్నది అందరికీ తెలుసు.. సీఎం లకు కూడా తెలుసు అనుకుంటున్నాను.. నా హృదయంలో ఉండే ఆవేదన ఏంటంటే … కుంటుంబ సమస్యల్లో పర్మిషన్ లేకుండా ఇతరుల జోక్యం చేస్కోవచ్చా? ఆలోచించండి?.. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్న..పాపులర్ వ్యక్తుల విషయంలో ఉన్నవీలేనివీ చెబుతాంటారు.. అది అందరూ ఆలోచించాలి..ప్రజలకు అన్నీ తెలుసు.. ఎవరి పని వారు చేస్కుంటారు. మీడియా, సోషల్ మీడియాలో విజువల్స్ వస్తున్నాయి. రాత్రి నా కొడుకు మనోజ్ గేటు తోస్కుని ఇంట్లోకి వచ్చాడు..మీడియా సోదరులు.. నా ఇంటి ముందు నాలుగు రోజుల నుంచి ఉన్నారు. లైవ్ వ్యాన్స్ పెట్టుకుని ఉన్నారు. ముందే చెప్పాను మీడియాతో.. నా సమస్యను నేను పరిష్కరించుకుంటా అని చెప్పా కానీ వాళ్ళు వినలేదు.. రాజ్యసభ నుంచి క్లీన్ పర్సన్ గా వచ్చాను. కానీ నా గురించి మీడియా సోదరులు నెగిటివ్ గా చెబుతున్నారు.. రాత్రులు గేటు తోస్కుని, పర్మిషన్ లేకుండా రావడం ఏంటి?.. ఇది తప్పుకాదా.. మీరు చెప్పండి. అందరూ మీడియా సోదరులా? చేతిలో మైక్ పట్టుకుని, పగ ఉన్న వ్యక్తులు వచ్చారా? నాకు డౌటు ఉంది.. వాళ్లకు లోపలికి రావద్దు అని ఎంత చెప్పినా వినకుండా వచ్చారు…
అప్పటికి అందరికి మర్యాదగా నమష్కారం పెట్టాను. మైక్ తీస్కువచ్చి..నోట్లో పెట్టారు, కంటి కింద తగిలింది.. నా కన్ను పోయేది.. చీకట్లో ఘర్షణ జరిగింది, దెబ్బ తగిలింది అన్నారు.. అతనూ నాకు తమ్ముడే.. బాధగానే ఉంది నాకు.. అతని భార్య ఎంత బాధపడుతుందో.. పిల్లలు ఎంత బాధపడుతున్నారో ఆలోస్తున్నాను.. నేను సినిమాల్లో నటిస్తానే తప్ప.. నిజ జీవితంలో నటించలేను.. నీతిగా, ధర్మంగా బతకాలన్నది నా ధర్మం.. గేటు బయట నేను కొట్టి ఉంటే.. నాదే తప్పు.. అప్పుడు నన్ను అరెస్ట్ చేసినా తప్పులేదు. నాపై ఎన్ని కేసులు పెట్టినా నాకు ఇబ్బంది లేదు. నేనే పోలీసులకు లొంగిపోతాను.. కానీ నా ఇంట్లోకి వచ్చి నా ఏకాగ్రతను భగ్నం చేసారు. ఏదో రోజు న్యాయం జరుగుతుంది.. నా కొడుక్కి నాకు. మేము సర్దుబాటు చేస్కుంటాం.. మాకు బయటి వ్యక్తులు అవసరంలేదు. నేను కట్టు బట్టలతో చెన్నై వెళ్లాను.. కష్టపడ్డాను. తల్లి దండ్రుల ఆస్తులు నేను తీసుకోలేదు. ఇప్పుడు నాకు తోచిన దాంట్లో 25 శాతం ప్రీ సీటు ఇచ్చి అంత పెద్ద విద్యాసంస్థలు నడుపుతన్నాను. ప్రజా ప్రతినిధులారా.. అభిమానులారా?? ఆలోచించండి.. కొట్టింది తప్పే.. కానీ ఏ సందర్భంలో కొట్టాననేది ఆలోచించండి. ఇంట్లోకి వచ్చి దూరితే.. కోపం రాదా? చెప్పండి..
ఇప్పుడు మీకు టీవిలు ఉన్నాయి.. మాకు టీవీలు లేవు.. రేపు పెట్టొచ్చు. అది పెద్ద పని కాదు. అతనికి దెబ్బ తాకింది.. దానికి చింతిస్తున్నానని మోహన్ బాబు అన్నారు. అయితే అతను నిజంగా జర్నలిస్ట్ నా కాదా అనేది నాకు ఎలా తెలుస్తుంది? యే ఛానల్? టీవి9నా? అనేది నేను చూడలేదు. రజనీకాంత్.. చాలా సందర్భాలలో నాతో మాట్లాడారు.. భగవంతుడు చూస్తున్నాడు.. పోలీసులంటే ఇష్టం.. వారు నాకు ఇష్టం.. రక్షణ కల్పిస్తున్నారు. నా సంస్థల నుంచి వచ్చిన వారు బాగా సెటిల్ అయ్యారు. ఏకపక్ష నిర్ణయం ఏంటి? ప్రజలారా ఆలోచించండి?..నా ఇంటికి తలుపులు బద్దలు కొట్టి రావడం న్యాయమా? మీరే ఆలోచించండి… దీనిపై అసలు న్యాయం ఏంటో మీరే గమనించగలరు అని ఆ ఆడియో లో ఉంది.. ఆ ఆడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అందులో జర్నలిస్ట్ కు జరగడం బాధగా ఉంది అన్నాడు కానీ ఎక్కడ క్షమించమని అడగలేదు.. దీనిపై మరోసారి చర్చలు మొదలయ్యాయి.. ఇక మోహన్ బాబు మళ్లీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.. పోలీస్ కేసులు వెనక్కి తీసుకుంటారా? తండ్రి కొడుకులు కాంప్రమైజ్ అవుతారా? చూడాలి..
మైక్ తెచ్చి నా నోట్లో పెట్టారు…!
కొంచెం అయితే నా కన్ను పోయేది…!
మోహన్ బాబు మరో ఆడియో వైరల్ #ManchuMohanbabu #ManchuFamily #Bigtv pic.twitter.com/wfEehmLju2
— BIG TV Breaking News (@bigtvtelugu) December 12, 2024