Samsung: ప్రముఖ సంస్థ సామ్‌సంగ్ టెక్ ప్రియుల కోసం క్రేజీ ఫోన్ తయారు చేస్తుంది. దీని స్పెషల్ ఏంటంటే రెండు వైపుల నుంచి ఉపయోగించడం. అవును మీరు విన్నది నిజమే. ఈ ప్రత్యేకమైన పరికరానికి US పేటెంట్, ట్రేడ్‌మార్క్ ఆఫీస్ నుంచి ఇప్పటికే ఆమోదం కూడా లభించింది. మరికొన్ని రోజుల్లో ఇది మార్కెట్లోకి రానుంది.
360-డిగ్రీల హింజ్‌తో విప్లవాత్మక డిజైన్
ఇప్పటి వరకు మార్కెట్‌లో ఉన్న ఫోల్డబుల్ ఫోన్లలో 180-డిగ్రీల హింజ్‌లు కనిపించాయి. అయితే, సామ్‌సంగ్ కొత్తగా అభివృద్ధి చేస్తున్న 360-డిగ్రీల హింజ్‌తో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మరో కొత్త అనుభూతిని అందించనుంది. ఇది లోపలికి, బయటికి మడిచే విధంగా డిజైన్ చేయబడింది. ఈ ప్రత్యేకత దీన్ని ఇతర ఫోల్డబుల్ ఫోన్‌లతో పోలిస్తే విభిన్నంగా నిలిపుతుందని చెప్పవచ్చు.
రెండు వైపుల నుంచి
టిప్‌స్టర్ @Xleaks7 సోషల్ మీడియాలో ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన పేటెంట్ చిత్రాన్ని పంచుకున్నారు. ఈ చిత్రాలు ఫోన్ ఫ్లెక్సిబుల్ డిజైన్‌ను చూపిస్తున్నాయి. వినియోగదారులు ఈ సరికొత్త మోడల్‌ను ఎలాంటి పరిమితులూ లేకుండా రెండు వైపుల నుంచి మడిచి ఉపయోగించుకోవచ్చు.
ఫోన్ వెనుక ఉన్న అత్యాధునిక సాంకేతికత
నివేదికల ప్రకారం, ఈ రాబోయే ఫోల్డబుల్ ఫోన్ అల్ట్రా-థిన్ గ్లాస్ (UTG) ఆధారంగా రూపొందించబడిన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది సామ్‌సంగ్ ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న తాజా సాంకేతిక పరిజ్ఞానం. ఈ డిస్‌ప్లేలో ఫ్లెక్సిబుల్ పాలిమర్ పొరలు, ప్రత్యేకమైన అంటుకునే స్వాభావాన్నికల్గి ఉంటాయి. ఇవి ఫోన్ నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి.
Read Also: Upcoming Smartphones April 2025: ఏప్రిల్లో రాబోయే …
ఫోల్డబుల్ మార్కెట్
కొత్తగా అభివృద్ధి చేసిన హింజ్ వ్యవస్థ రెండు వైపుల నుంచీ మడతపెట్టేందుకు అనుకూలంగా రూపొందించబడింది. దీని వల్ల వినియోగదారులు ఫోన్‌ను అనేక రకాలుగా మడిచి, ఉపయోగించుకోవచ్చు. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో, సామ్‌సంగ్ ఈ విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, సామ్‌సంగ్ తీసుకొస్తున్న ఈ కొత్త మోడల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
పోటీలో మరిన్ని బ్రాండ్లు
ఫోల్డబుల్ ఫోన్ సెగ్మెంట్‌లో సామ్‌సంగ్ ఒక ప్రముఖ బ్రాండ్. మరోవైపు ఇతర కంపెనీలు కూడా పోటీలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. హువావే ఇటీవలే పురా X ఫ్లిప్ ఫోన్‌ను ఆవిష్కరించింది. మరోవైపు ఆపిల్ కూడా ఈ పోటీలోకి రానున్నట్లు తెలుస్తోంది.
60 డిగ్రీల ఫోల్డబుల్ ఫోన్
శామ్‌సంగ్ 360 డిగ్రీల ఫోల్డబుల్ మోడల్‌తో పాటు, 60-డిగ్రీల కోణంలో మడవగల మరో మోడల్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ ఫోన్ వినియోగదారుల హ్యాండ్లింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేలా రూపొందించబడింది. వినియోగదారులు దీనిని టాబ్లెట్ మోడ్, టెంట్ మోడ్ లేదా ల్యాప్‌టాప్ మోడ్‌లో ఉపయోగించుకోవచ్చు.
అప్‌గ్రేడెడ్ ఫీచర్లు
ఫోల్డబుల్ ఫోన్‌లతో పాటు, శామ్‌సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కూడా మార్కెట్‌లో ప్రవేశించబోతోంది. ఈ ఫోన్ గత వెర్షన్ కంటే మెరుగైన కెమెరా, మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం, ఇది ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండనుంది.
-200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
-50 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా
-టెలిఫోటో కెమెరా