BigTV English

Naga Vamsi : భార్యతో గొడవ అయితే నెగిటివ్ రివ్యూలు… మరోసారి రెచ్చిపోయిన ప్రొడ్యూసర్

Naga Vamsi : భార్యతో గొడవ అయితే నెగిటివ్ రివ్యూలు… మరోసారి రెచ్చిపోయిన ప్రొడ్యూసర్

Naga Vamsi :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా సూర్యదేవర నాగవంశీ (Surya Devara Naga Vamsi)ఈ బ్యానర్ పై పలు చిత్రాలు నిర్మిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలే కాదు యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఇక అందులో భాగంగానే తాజాగా నాగవంశీ నిర్మాణంలో వచ్చిన చిత్రం మ్యాడ్ స్క్వేర్ (MAD 2). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి కొంతమంది నెగటివ్గా కామెంట్లు ఇవ్వడంతో తాజాగా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న నాగవంశీ నెగటివ్ రివ్యూలు ఇచ్చే వారిపై మరొకసారి రెచ్చిపోయారు.


మ్యాడ్ స్క్వేర్ నెగిటివ్ రివ్యూ పై మండిపడ్డ నాగ వంశీ

ప్రెస్ మీట్ లో పాల్గొన్న నాగ వంశీ మ్యాడ్ స్క్వేర్ కు ఇచ్చిన నెగటివ్ రివ్యూ పై మాట్లాడుతూ.. రివ్యూ అనేది సినిమా చూసిన తర్వాత పర్సనల్ గా ఇచ్చేది. ఎన్నికల లాగా అందరి దగ్గరకు వెళ్లి ఆప్షన్ తీసుకునేది కాదు.ఇంట్లో పెళ్ళాంతో గొడవపడి, సినిమా చూసి, ఆ తర్వాత ఆ కోపాన్ని రివ్యూ పై చూపిస్తున్నారు. ముఖ్యంగా రివ్యూలను ఎవరూ పట్టించుకోవద్దండి. సినిమా చూసిన తర్వాత మీ పర్సనల్ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. అంటూ ఆడియన్స్ ను వేడుకున్నారు నాగ వంశీ. ముఖ్యంగా మేము రివ్యూ రైటర్లను ఎప్పుడూ దూరం పెడతాము. కానీ వాళ్ళు మమ్మల్ని దూరం పెట్టడం లేదు.. అలా పెడితే మేము కూడా చాలా హ్యాపీగా ఉంటాము.. అంటూ నాగ వంశీ తెలిపారు. మొత్తానికైతే మరొకసారి పై నెగిటివ్ రివ్యూలు రావడంతో మండిపోయిన నాగ వంశీ తనదైన శైలిలో రివ్యూయర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.


మ్యాడ్ కంటే రెట్టింపు కలెక్షన్స్

మ్యాడ్ స్క్వేర్ సినిమా విషయానికి వస్తే.. 2023లో వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన మ్యాడ్ మూవీకి సీక్వెల్ కావడంతో విపరీతమైన హైప్ మధ్య సినిమా రిలీజ్ అయింది.ఇందులో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, లీడ్ రోల్ చేశారు. మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది. అటు రెండవ రోజు కూడా బాగానే కలెక్షన్స్ వసూలు చేసింది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.37.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా ఉగాది సందర్భంగా మరింత కలెక్షన్స్ వసూలు చేసింది. ఇకపోతే రెండో రోజుల్లోనే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించినట్లు సమాచారం ఆదివారం లెక్కలతోనే ప్రాఫిట్ జోన్ లోకి వస్తుందని అంచనాలు ఉండగా రెండేళ్ల క్రితం మ్యాడ్ మూవీ ఓవరాల్ గా రూ.24 కోట్ల కలెక్షన్లు దక్కించుకుంటే ఇప్పుడు ఈ సీక్వెల్ రెండో రోజుల్లోనే రూ.37 కోట్లకు మించి సాధించడంతో అందరూ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కళ్యాణ్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా. మురళీధర్ గౌడ్, రఘు బాబు, ప్రియాంక జవాల్కర్, సత్యం రాజేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Mega 157 Update : అనిల్ మంత్ర… సంక్రాంతికి చిరు మూవీ రఫ్ఫాడిపోతుంది అంతే…

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×