E-Paper
Advertisement

మార్కెట్‌లో ట్రెండ్ అవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ వాషింగ్ మెషీన్స్ ఇవే..మీరూ ఓ లుక్కేయండి

మార్కెట్‌లో ట్రెండ్ అవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ వాషింగ్ మెషీన్స్ ఇవే..మీరూ ఓ లుక్కేయండి
Advertisement

Samsung washing machines: ప్రతిరోజూ మన బట్టలపై పడే మొండి మరకలను వదిలించడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతుంది. అయితే లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన సామ్‌సంగ్ వాషింగ్ మెషీన్లు ఈ సమస్యకు చక్కటి పరిష్కారం అందిస్తున్నాయి. బట్టల క్వాలిటీ ఏ మాత్రం దెబ్బతీయకుండా లోతుగా శుభ్రం చేసే సరి కొత్త మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డీప్ స్టెయిన్స్‌ను సులభంగా క్లీన్ చేసే టాప్ 5 సామ్‌సంగ్ వాషింగ్ మెషీన్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. Samsung 9 kg Front Load:

ఇది ఏఐ ఎకోబబుల్, హైజీన్ స్ట్రీమ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది బట్టలపై ఉన్న సూక్ష్మక్రిములు, బాక్టీరియాలతో.. పాటు మొండి మరకలను అత్యంత సమర్థవంతంగా తొలగిస్తుంది. దీనిలో డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ ఉండటం వల్ల శబ్దం చాలా తక్కువగా వస్తుంది. అంతే కాకుండా కరెంట్ కూడా ఆదా అవుతుంది.

Advertisement

ధర: సుమారు రూ.39,990

2.Samsung 12 kg Front Load:

పెద్ద ఫ్యామిలీల అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ మెషీన్ ఎక్కువ బట్టలను ఒకేసారి ఈజీగా ఉతకగలదు. ఇందులో ..ఉండే డ్రమ్ క్లీన్, స్పీడ్ ఫీచర్లు బట్టలను త్వరగా, శుభ్రంగా మారుస్తాయి. మొండి మరకలను వదిలించడంలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

Advertisement

ధర: సుమారు రూ.47,790

3.Samsung 8 Kg Top Load:

టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లను కోరుకునే.. వారి కోసం సామ్‌సంగ్ అందిస్తున్న ఈ మోడల్ ఏఐ వాష్, ఎకోబబుల్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది బట్టల రకాన్ని బట్టి వాషింగ్ సైకిల్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసుకుంటుంది. అంతే కాకుండా బట్టలపై పడిన మొండి మరకలను సునాయాసంగా క్లీన్ చేస్తుంది.

ధర: సుమారు రూ.25,000

4.Samsung 7 Kg Top Load:

మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇది సరైన ఆప్షన్ అని చెప్పొచ్చు. రస్ట్-ప్రూఫ్ బాడీ కలిగిన ఈ మెషీన్ చాలా కాలం పాటు పాడవకుండా ఉంటుంది. ఎకోబబుల్ టెక్నాలజీ సహాయంతో.. తక్కువ నీటితోనే బట్టలపై ఉన్న మరకలను లోతుగా ఇది శుభ్రం చేస్తుంది. ఆటో రీస్టార్ట్ ఫీచర్ దీని ప్రధాన ప్రత్యేకత.

ధర: సుమారు రూ.17,490

5. Samsung 10 Kg Top Load:

పెద్ద ఫ్యామిలీ భారీ అవసరాలను తీర్చడానికి ఈ 10 కేజీ మోడల్ చాలా అద్భుతంగా పని చేస్తుంది. హై ఎఫిషియన్సీ, టబ్ క్లీన్ ఫీచర్లతో ఇది తయారు చేయబడింది. బట్టలపై ఎంత కఠినమైన మరకలు ఉన్నప్పటికీ.. ఈ మెషీన్ ఈజీగా తొలగిస్తుంది. అలాగే బట్టల అసలు మెరుపు తగ్గకుండా కాపాడుతుంది.

ధర: సుమారు రూ.24,990

ఈ సామ్‌సంగ్ వాషింగ్ మెషీన్లు మీ బట్టలను ఎల్లప్పుడూ కొత్త వాటిలా, మెరిసేలా ఉంచుతాయి. మీ కుటుంబ సభ్యుల సంఖ్యను, అవసరాలను బట్టి సరైన మోడల్‌ను ఎంచుకోవడం ద్వారా బట్టల ఉతికే పనిని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు.

Related News

Meta Muse AIలో కొత్తగా స్పేసెస్ ఫీచర్.. మనకు నచ్చినట్టుగా కస్టమ్ ఫీడ్స్, గేమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు!

ఇంకో 3 రోజుల్లో ప్రపంచం అంతం? నవంబర్ 13 వెనుక 66 ఏళ్ల నాటి షాకింగ్ నిజం!

గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేయకపోతే మీ పాస్‌వర్డ్స్, పర్సనల్ డేటా గోవిందా!

వృద్ధులకు భారీ ఊరట.. బ్యాంకుకు వెళ్లకుండానే ‘లైఫ్ సర్టిఫికెట్’ సమర్పించే సూపర్ ఛాన్స్!

మీ ఐఫోన్‌లో కూడా Decline బటన్ కనిపించడం లేదా? అసలు కారణం ఇదే!

రూ.2,000 లోపే 75 గంటల బ్యాటరీ.. బోట్, వన్‌ప్లస్‌తో సహా టాప్-5 ఇయర్‌బడ్స్ ఇవే!

వాట్సప్‌లో క్రేజీ అప్‌డేట్.. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను కూడా ఇక్కడికి రప్పించొచ్చు, ఎలాగో తెలుసా?

Big Stories

Advertisement
×