E-Paper
Advertisement

బుల్లితెర జంట ఇంట్లో అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే?

బుల్లితెర జంట ఇంట్లో అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే?
Advertisement

TV Couples House:దీపావళి వేళ ప్రముఖ బుల్లితెర నటి ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీపావళి సంబరాల్లో మునిగితేలిన ఆ ఇంట్లో.. చివరికి విషాదఛాయలు నెలకొన్నాయి. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. ప్రముఖ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి (Divyanka Tripathi), ఆమె భర్త వివేక్ దహియా(Vivek Dahima)ల నివాసంలో తీవ్ర నిరాశ, ఆవేదన నిండాయి. ముంబై అందేరీ వెస్ట్ లోని రన్ వాల్ టవర్ 17వ అంతస్తులో నవంబర్ 7న రాత్రి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదం నుండి దివ్యాంక దంపతులు, తమ కవల పిల్లలతో సహా క్షేమంగా బయటపడ్డారు. కానీ వారి ఇంట్లో ఎన్నో ఏళ్లుగా ఒకరిగా మెలిగిన భవన సెక్యూరిటీ గార్డ్ ధన్ పత్ మహా (Dhanpath Maha) తో ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబంలో తీవ్ర ఆవేదన మిగిలింది. ప్రస్తుతం ఆయన వయసు 56 సంవత్సరాలు రావడం గమనార్హం.

మంటలు రగిలించిన ప్రమిద..

ముంబై ఫైర్ బ్రీగేడ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రన్ వాల్ టవర్ ‘సి’ వింగ్ లోని 1702 ఫ్లాట్లో శనివారం రాత్రి 9:50 గంటల ప్రాంతంలో మంటలు ప్రారంభమయ్యాయి. ఫ్లాట్ యజమాని శరత్ అగర్వాల్ దంపతులు దీపావళి పూజ పూర్తయ్యాక ప్రమిద వెలిగించి విందు కోసం బయటకు వెళ్లారు. అయితే ఇంట్లో ఉన్న వృద్ధులైన ఆయన తల్లిదండ్రులను సమయస్ఫూర్తితో పనిమనిషి లిఫ్ట్ ద్వారా కిందకు తీసుకొచ్చింది. హాలులో వెలుగుతున్న దియా నుంచే మంటలు వ్యాపించి అపార్ట్మెంట్ అంతటా కూడా దట్టమైన పొగ అలుముకుంది.

సెక్యూరిటీ గార్డ్ మరణం వెనుక అసలు కారణం?

Advertisement

అయితే మంటలు వ్యాపిస్తున్న సమయంలో భవనంలో విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ గార్డు మెట్లు మార్గానికి బదులుగా లిఫ్ట్ ఉపయోగించడంతో దట్టమైన పొగలో చిక్కుకుపోయారు. ఇక లిఫ్ట్ లాబిన్ లో స్పృహ తప్పిపోయి పడి ఉన్న ఆయనను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసి కోకిల బెన్ ఆసుపత్రికి , ఆ తర్వాత కూపర్ హాస్పిటల్కు తరలించారు. ఒక పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో సెక్యూరిటీ గార్డ్ ధన్ పత్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గత తొమ్మిదేళ్లుగా ఈ భవనంలో పనిచేస్తున్న ధన్ పత్ అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారని నివాసితులు కూడా గుర్తు చేసుకున్నారు.

సెక్యూరిటీ గార్డ్ మరణం పై నటీనటులు ఎమోషనల్ పోస్ట్..

ఇకపోతే ఈయన మరణించడంతో దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియా దంపతులు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. “కొన్ని నష్టాలు మిగిల్చే నిశ్శబ్దం ఎప్పటికీ కూడా వీడిపోదు. మా పిల్లలు పెరుగుతుంటే ఆయన చూస్తూ ఉంటారని, వారితో ఆడుకుంటారని , ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. అయితే అవన్నీ కలలుగానే మిగిలిపోతాయని మేము ఊహించలేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

ఇదే పోస్టులో ఈ కవల పిల్లలు పుట్టిన తర్వాత తొలిసారి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ధన్ పత్ అంకుల్ ఎంతో ప్రేమగా ఆశీర్వదించారు. ఇకపోతే అలాంటి కుటుంబంలో ఒకరిగా మెలిగిన సెక్యూరిటీ గార్డ్ మరణించడంతో నటీనటులు ఇద్దరూ కన్నీటి పర్యంతమవుతూ ఎమోషనల్ అవుతున్నారు.

also read:ప్రియా భవాని శంకర్ కాబోయే భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

కవల పిల్లలతో ప్రమాదం నుండి బయటపడ్డ దంపతులు..

ఇకపోతే ఈ ప్రమాదం జరిగిన సమయంలో తాము కూడా బయటకు వెళ్లాల్సి ఉందని, కానీ ఆలస్యం కావడంతో ఇంట్లోనే ఉన్నామని , దానివల్ల వెంటనే ప్రమాదాన్ని గ్రహించి పిల్లలు, ఇంట్లోని సిబ్బందితో సహా బయటపడ్డాము అంటూ తెలిపారు.

Related News

సీరియల్స్ కు తేజు గుడ్ బై.. ఆ ఒక్కటే కారణమా..?

Gundeninda GudiGantalu Today episode: బాలు మాటతో మీనా షాక్.. ప్రభాకు నిజం తెలుస్తుందా..? పాపం మనోజ్..

Podarillu Today Episode : కన్నా పై మహా సీరియస్.. ఇది కదా పండగ.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మదా పై ప్రేమ సీరియస్.. ఇంత మోసమా..? ఫుల్లుగా తాగొచ్చిన చందు..

Intinti Ramayanam Today Episode: రమ్యకు ఘోర అవమానం.. పార్వతి షాకింగ్ నిర్ణయం..? ఇదే ఫైనల్ ట్విస్ట్..

అయ్యో.. మనోజ్ కు అందుకే పిచ్చిపట్టిందా..? ఇదేం ట్విస్ట్ మావ..

Brahmamudi Serial Today Episode November 11th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐశ్వర్య అగ్రిమెంట్ పేపర్స్ పై ఇందు సంతకం చేస్తుందా..?  

Big Stories

Advertisement
×