E-Paper
Advertisement

ఇంకో 3 రోజుల్లో ప్రపంచం అంతం? నవంబర్ 13 వెనుక 66 ఏళ్ల నాటి షాకింగ్ నిజం!

ఇంకో 3 రోజుల్లో ప్రపంచం అంతం? నవంబర్ 13 వెనుక 66 ఏళ్ల నాటి షాకింగ్ నిజం!
Advertisement

Doomsday Prediction: ఇంకో మూడు రోజుల్లో ప్రపంచం అంతమైపోతుందా? మనుషుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి భూమిపై జీవించడానికి కూడా చోటు ఉండదా? సూర్యుడు నుంచి వచ్చే విపరీతమైన శక్తి భూమిని నాశనం చేయబోతుందా? నవంబర్ 13, 2026 ఈ తేదీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ తేదీని 1960 లోనే ఓ శాస్త్రీయ పరిశోధనలో ప్రస్తావించారు. 1964 లో కూడా మరో కథనం ఇదే తేదీని ప్రస్తావించింది. మరి నిజంగానే ఈ శుక్రవారం యుగాంతం రాబోతుందా ఆ పరిశోధనలో అసలు ఏం చెప్పారు ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో చూద్దాం.

‘డూమ్స్‌డే ఫ్రైడే’ ప్రచారంలో నిజమెంత?

Advertisement

ఈ కథకు మూలం 1960 నవంబర్ 4న అంతర్జాతీయ సైన్స్ జర్నల్ సైన్స్ లో ప్రచురితమైన ఒక పరిశోధన పత్రం. దీని పేరు డూమ్స్ డే ఫ్రైడే 13 నవంబర్ ఏడి 2026 ఆస్ట్రియన్ అమెరికన్ శాస్త్రవేత్త హింజ్వాన్ ఫోర్ స్టార్ పాట్రీషియా ఎం మోరా లారెన్స్ డబ్ల్యూ అమియట్ ఈ పరిశోధన చేశారు. అప్పట్లో ప్రపంచ జనాభా వేగంగా పెరుగుతున్న పరిస్థితులను పరిశీలించిన వీరు గత 2000 సంవత్సరాల్లో జనాభా పెరిగిన తీరును గణిత సూత్రాలతో విశ్లేషించారు. ఆ పెరుగుదల ఇదే వేగంతో ఇదే నమూనాలో నిరంతరంగా కొనసాగితే నవంబర్ 13, 2026 నాటికి ప్రపంచ జనాభా గణిత పరంగా అనంతానికి చేరుకుంటుందని లెక్కించారు.

లెక్కలు వేరైతే.. ఊహాగానాలు వేరు

Advertisement

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వాళ్ళు ప్రపంచం నాశనం అవుతుందని చెప్పలేదు. జనాభా అనంతంగా పెరుగుతుందని కూడా వాస్తవంగా నిర్ధారించలేదు. ఒక నిర్దిష్ట జనాభా పెరుగుదల నమూనాను భవిష్యత్తులోకి పొడగిస్తే వచ్చే గణిత ఫలితాన్ని మాత్రమే వివరించారు. అంటే ఇది ప్రపంచ వినాశనానికి సంబంధించిన జోస్యం కాదు జనాభా పెరుగుదలపై చేసిన గణితపరమైన ఒక అంచన. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. జనాభా పెరుగుదల అనేది కేవలం పుట్టుకల మీదే ఆధారపడి ఉండదు. మరణాల రేటు, ఆహార లభ్యత, వైద్య సదుపాయాలు, జీవన ప్రమాణాలు, కుటుంబ నియంత్రణ ఇలా అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. 1960 లో చేసిన లెక్కలో గతంలో కనిపించిన వేగవంతమైన జనాభా పెరుగుదల భవిష్యత్తులోనూ అలాగే కొనసాగుతుందని గణితపరమైన ఊహా ఉంది. కానీ వాస్తవ ప్రపంచంలో వనరులు పరిమితంగా ఉంటాయి. భూమి, నీరు, ఆహారం, నివాసం అన్ని ఒక హద్దు వరకే అందుబాటులో ఉంటాయి. అంతేకాదు కాలక్రమైన జనాల రేటు కూడా తగ్గుతోంది. చాలా దేశాల్లో కుటుంబాల పరిమాణం తగ్గుతోంది. అందుకే 1960 లో వేసిన లెక్కలు ప్రస్తుత పరిస్థితులకు సరిపోవడం లేదు.

ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం..

ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ 2024 నివేదిక ప్రకారం 2024 లో ప్రపంచ జనాభా సుమారు 820 కోట్లు 2080ల మధ్యనాటికి సుమారు 1030 కోట్లకు చేరే అవకాశం ఆ తర్వాత జనాభా క్రమంగా తగ్గే అవకాశం కూడా ఉంది. సంవత్సరానికి ప్రపంచ జనాభా సుమారు 1020 కోట్లకు చేరవచ్చని అంచన అంటే జనాభా అనంతంగా పెరగడం కాదు ఈ శతాబ్దంలోనే ఒక గరిష్ట స్థాయికి చేరిఆ తర్వాత తగ్గే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ఇది 1960 లో వేసిన గణిత అంచనకు పూర్తి భిన్నమైన పరిస్థితి. ఇప్పుడు ఈ చర్చలోకి వచ్చిన రెండో అంశం గురించి తెలుసుకుందాం. 1964 నవంబర్ 29న ఈజిప్ట్ లోని వతని అనే వార్తా పత్రికలో మిచెల్ టెక్లా రాసిన ఒక కథనం ప్రచురితమైంది. అందులో కూడా 2026 నవంబర్ 13వ తేదీ ప్రస్తావన రావడంతో ఇప్పుడు మళ్ళీ ఆ కథనం వైరల్ అవుతుంది. ఆ కథనాన్ని కొన్ని సోషల్ మీడియా పోస్టులు శాస్త్రీయ పరిశోధనగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా సూర్యుడి నుంచి అసాధరమైన శక్తి రావడం, భూమి అయస్కాంత క్షేత్రంలో మార్పులు రావడం, భూమిపై విద్వంసం జరగడం వంటి వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మిచల్ టెక్లా కథనం అనేది శాస్త్రీయ పరిశోధన పత్రం కాదు ఆయనను భూగర్భ శాస్త్రవేత్తగా పరిచయం చేయడానికి కూడా విశ్వసనీయ ఆధారాలు కూడా లేవు. కాబట్టి 1960 పరిశోధనకు 1964 వార్తా పత్రిక కథనానికి ఒకే రకమైన శాస్త్రీయ ప్రామాణికత ఉన్నట్లు అనుకోకూడదు.

సాటిలైట్ కమ్యూనికేషన్ లో అంతరాయాలు

సూర్యుడి నుంచి అప్పుడప్పుడు సౌర జ్వాలలు కరోనల్ మాస్ ఎజెక్షన్ వస్తుంటాయి. వీటి ప్రభావంతో భూమి అయస్కాంత క్షేత్రంలో మార్పులు కూడా రావచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందంటే సాటిలైట్ కమ్యూనికేషన్ లో అంతరాయాలు రావచ్చు. జిపిఎస్ సేవలపై ప్రభావితం అవ్వచ్చు. రేడియో కమ్యూనికేషన్ దెబ్బ తినొచ్చు. తీవ్రమైన భూ అయస్కాంత తుఫానుల సమయంలో విద్యుత్ గ్రిడ్లపై ప్రభావం పడొచ్చు. అయితే ఇవన్నీ సాంకేతిక వ్యవస్థలకు సంబంధించిన ప్రమాదాలు భూమి మొత్తం నాశనం అయపోతుందని దీని అర్థం కాదు అంటే సౌర తుఫానులు నిజమే వాటి ప్రభావాలు కూడా నిజమే కానీ నవంబర్ 13న ప్రపంచాన్ని నాశనం చేసేంత భారీ సౌర విస్ఫోటనం జరగబోతుందని నిరూపించే ఆధారాలు అయితే లేవు.

జనాభా విస్ఫోటనమా? సౌర విస్ఫోటనమా?

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అమెరికా వాతావరణ శాఖకు చెందిన ఎన్ఓఏఎస్ స్పేస్ వెదర్ ప్రెడిక్షన్ సెంటర్ నవంబర్ 9న విడుదల చేసిన తాజా 27 రోజుల అంతరిక్ష వాతావరణ అంచనాలో నవంబర్ 13 నుంచి 15 వరకు భూమి అయస్కాంత క్షేత్రం ఎక్కువగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. సౌర కార్యకలాపాలు సాధారణంగా తక్కువ స్థాయిలో ఉండొచ్చని కొన్ని రోజుల పాటు మోస్తర్ స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. అంటే నవంబర్ 13న భూమిని నాశనం చేసే స్థాయిలో ఏదైనా సౌర విస్ఫోటనం జరగబోతుందని ఎన్ఓఏఏ అంచన వేయలేదు. మొదటిది 1960 లో చేసిన పరిశోధన ప్రపంచం అంతం గురించి కాదు అది జనాభా పెరుగుదలపై చేసిన గణితపరమైన అంచనా మాత్రమే. రెండవది 1964 లో వచ్చిన కథనం ఒక వార్తా పత్రిక కథనం మాత్రమే. దానికి శాస్త్రీయ పరిశోధన స్థాయి లేదు. సూర్యుడి వల్ల ప్రపంచం నాశనం అవుతుందని నిరూపించే ఆధారాలు కూడా లేవు. ఇక మూడవది ఐక్యరాజ్య సమితి జనాభా అంచనాలు ఎన్ఓఏఏ అంతరిక్ష వాతావరణ అంచనాలు ప్రస్తుత పరిస్థితిపై స్పష్టత ఇస్తున్నాయి.

నవంబర్ 13 ప్రచారం ఎంతవరకు నిజం?

నవంబర్ 13న యుగాంతం వస్తుందని ఏ విశ్వసనీయ శాస్త్రీయ సంస్థ ప్రకటించలేదు. మొత్తానికి నవంబర్ 13న ప్రపంచం అంతమవుతుందనే ప్రచారానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. 66 ఏళ్ల క్రితం చేసిన ఒక గణిత అంచన 62 ఏళ్ల క్రితం వచ్చిన ఒక వార్త పత్రిక కథనం ఈ రెండింటిని కలిపి ఇప్పుడు యుగాంతం అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే శాస్త్రవేత్తలు చేసే ప్రతి అంచన నిజం కావాల్సిన అవసరం లేదు. ఒక పరిశోధనలో ఉన్న లెక్కను దాని అసలు సందర్భం నుంచి వేరు చేసి చూస్తే అది భయాన్ని కలిగించే ప్రచారంగా మారుతుంది. ప్రపంచం అంతమవుతుందనే భయంతో బతకడం కంటే మనం నివసిస్తున్న ప్రపంచాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టడం ముఖ్యం. యుగాంతం వస్తుందో రాదో తెలియదు గానీ పర్యావరణ విధ్వాంసం, వాతావరణ మార్పులు, యుద్ధాలు, కాలుష్యం లాంటి నిజమైన ముప్పులు మాత్రం మన కళ్ళ ముందే ఉన్నాయి.

Also Read: కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు.. నల్గొండలో మహిళా హోంగార్డును ఎలా చంపాడంటే..?

Tags

Related News

గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేయకపోతే మీ పాస్‌వర్డ్స్, పర్సనల్ డేటా గోవిందా!

వృద్ధులకు భారీ ఊరట.. బ్యాంకుకు వెళ్లకుండానే ‘లైఫ్ సర్టిఫికెట్’ సమర్పించే సూపర్ ఛాన్స్!

మీ ఐఫోన్‌లో కూడా Decline బటన్ కనిపించడం లేదా? అసలు కారణం ఇదే!

రూ.2,000 లోపే 75 గంటల బ్యాటరీ.. బోట్, వన్‌ప్లస్‌తో సహా టాప్-5 ఇయర్‌బడ్స్ ఇవే!

వాట్సప్‌లో క్రేజీ అప్‌డేట్.. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను కూడా ఇక్కడికి రప్పించొచ్చు, ఎలాగో తెలుసా?

సబ్‌స్క్రిప్షన్ ఖర్చులకు చెక్ పెట్టే 4 బెస్ట్ యాప్స్.. నెలకు ఎంత ఆదా చేయవచ్చో తెలుసా?

లైవ్ ట్రాన్స్‌లేషన్ నుంచి నావిగేషన్ వరకు.. జెంటిల్ మాన్ ఏఐ గ్లాసెస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×