E-Paper
Advertisement

మీ ఐఫోన్‌లో కూడా Decline బటన్ కనిపించడం లేదా? అసలు కారణం ఇదే!

మీ ఐఫోన్‌లో కూడా Decline బటన్ కనిపించడం లేదా? అసలు కారణం ఇదే!
Advertisement

iPhone Decline Call: ఐఫోన్‌కు కాల్ వచ్చినప్పుడు కొన్నిసార్లు Slide to Answer అనే బార్ మాత్రమే కనిపిస్తుంది. కాల్‌ను కట్ చేయడానికి బటన్ లేకపోవడంతో చాలామంది ఫోన్‌లో ఏదైనా సమస్య ఉందేమో అనుకుంటారు. కానీ ఇది ఐఫోన్‌లో ఉండే సాధారణ సెట్టింగ్. ఫోన్ లాక్‌లో ఉందా, అన్‌లాక్‌లో ఉందా అనే దాని ఆధారంగా కాల్ స్క్రీన్ మారుతుంది. ఈ తేడా ఎందుకు ఉంటుందో, కాల్‌ను ఎలా తిరస్కరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

లాక్‌లో ఉన్నప్పుడు ఇలా చేయండి:

ఐఫోన్ లాక్‌లో ఉన్నప్పుడు కాల్ వస్తే.. సాధారణంగా సమాధానం చెప్పడానికి Slide to Answer బార్ కనిపిస్తుంది. ఇక్కడ Decline బటన్ కనిపించదు. అయితే కాల్‌ను కట్ చేయడానికి స్క్రీన్‌పై బటన్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఫోన్ పక్కన ఉండే సైడ్ బటన్‌ను త్వరగా రెండుసార్లు నొక్కితే కాల్ తిరస్కరించబడుతుంది. కాల్ వాయిస్ మెయిల్‌కు వెళ్తుంది. ఫోన్ అన్‌లాక్‌లో ఉన్నా ఈ పద్ధతి పనిచేస్తుంది.

ఒక్కసారి నొక్కితే ఏమవుతుంది?

Advertisement

సైడ్ బటన్‌ను ఒక్కసారి మాత్రమే నొక్కితే కాల్ కట్ కాదు. రింగ్‌టోన్, వైబ్రేషన్ మాత్రమే ఆగిపోతాయి. అవతలి వ్యక్తికి మాత్రం కాల్ కొనసాగుతూనే ఉంటుంది. వాయిస్ మెయిల్ అందుబాటులో ఉంటే అది స్పందించే వరకు కాల్ కొనసాగుతుంది. ఫోన్‌లోని వాల్యూమ్ బటన్లలో ఏదైనా నొక్కినా రింగ్‌టోన్ మాత్రమే సైలెంట్ అవుతుంది. కాబట్టి.. కాల్‌ను వెంటనే తిరస్కరించాలంటే సైడ్ బటన్‌ను రెండుసార్లు నొక్కాలి. మీటింగ్‌లో ఉన్నప్పుడు రింగ్ ఆపాలా, కాల్ కట్ చేయాలా అనేది ఈ తేడా తెలుసుకుంటే సులభంగా నిర్ణయించుకోవచ్చు.

Also Read: రూ.2,000 లోపే 75 గంటల బ్యాటరీ.. బోట్, వన్‌ప్లస్‌తో సహా టాప్-5 ఇయర్‌బడ్స్ ఇవే!

అన్‌లాక్‌లో కాల్ స్క్రీన్:

Advertisement

ఫోన్ వాడుతున్న సమయంలో కాల్ వస్తే చిన్న బ్యానర్ కనిపిస్తుంది. అందులో Accept, Decline బటన్లు ఉంటాయి. బ్యానర్‌ను పైకి స్వైప్ చేస్తే అది మాత్రమే కనిపించకుండా పోతుందే గానీ కాల్ తిరస్కరించబడదు. పూర్తి స్క్రీన్ కాల్ అలర్ట్ కావాలంటే సెట్టింగ్స్‌లో మార్చుకోవచ్చు. iOS 26లో Settingsలో Apps విభాగానికి వెళ్లి Phone, Incoming Calls ఎంపికల్లో Full Screen ఎంచుకోవాలి. కాల్‌కు సమాధానం ఇవ్వకుండా మెసేజ్ పంపే అవకాశం కూడా ఉంది. Message నొక్కి ముందుగా ఇచ్చిన జవాబును ఎంచుకోవచ్చు లేదా మీరే టైప్ చేయవచ్చు.

iOS 26లో కాల్ స్క్రీనింగ్:

iOS 26లో Call Screening ఫీచర్ తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను ముందుగా పరిశీలిస్తుంది. కాల్ చేసిన వ్యక్తిని పేరు, ఎందుకు ఫోన్ చేస్తున్నారో చెప్పమని అడుగుతుంది. ఆ మాటలు స్క్రీన్‌పై లైవ్‌గా కనిపిస్తాయి. వాటిని చూసి కాల్ ఎత్తాలా వద్దా అనేది మీరు నిర్ణయించవచ్చు. అయితే ఈ ఫీచర్ పని చేసే తీరు ప్రాంతం, సెట్టింగ్స్‌ను బట్టి మారవచ్చు. సమస్య ఎదురైతే iOS అప్‌డేట్ ఉందో చేయండి లేదంటే ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి.

Also Read: వాట్సప్‌లో క్రేజీ అప్‌డేట్.. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను కూడా ఇక్కడికి రప్పించొచ్చు, ఎలాగో తెలుసా?

Tags

Related News

వృద్ధులకు భారీ ఊరట.. బ్యాంకుకు వెళ్లకుండానే ‘లైఫ్ సర్టిఫికెట్’ సమర్పించే సూపర్ ఛాన్స్!

రూ.2,000 లోపే 75 గంటల బ్యాటరీ.. బోట్, వన్‌ప్లస్‌తో సహా టాప్-5 ఇయర్‌బడ్స్ ఇవే!

వాట్సప్‌లో క్రేజీ అప్‌డేట్.. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను కూడా ఇక్కడికి రప్పించొచ్చు, ఎలాగో తెలుసా?

సబ్‌స్క్రిప్షన్ ఖర్చులకు చెక్ పెట్టే 4 బెస్ట్ యాప్స్.. నెలకు ఎంత ఆదా చేయవచ్చో తెలుసా?

లైవ్ ట్రాన్స్‌లేషన్ నుంచి నావిగేషన్ వరకు.. జెంటిల్ మాన్ ఏఐ గ్లాసెస్ విశేషాలివే!

ఏసర్ స్మార్ట్‌చాయిస్ ఆస్పైర్ వన్ ల్యాప్‌టాప్..స్టూడెంట్స్ కోసం పర్ఫెక్ట్

స్టైలిష్ లుక్‌తో బోట్ క్రోమ్ హారిజాన్..డైలీ వాడకానికి బెస్ట్

Big Stories

Advertisement
×