Best Earbuds Under 2000: రూ.2,000 బడ్జెట్‌లో మంచి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కొందామని చూస్తున్నారా? ఒకప్పుడు ఈ ధరలో కేవలం సాధారణ ఇయర్‌ఫోన్స్ మాత్రమే దొరికేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), స్పేషియల్ ఆడియో, 40 నుంచి 70 గంటల వరకు వచ్చే సూపర్ బ్యాటరీ లైఫ్, డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ వంటి ప్రీమియం ఫీచర్లన్నీ రూ.2,000 లోపే లభిస్తున్నాయి. మార్కెట్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న బోట్, రియల్‌మీ, వివో, గోబోల్ట్, వన్‌ప్లస్ కంపెనీలకు చెందిన టాప్ 5 మోడళ్ల గురించి ఇప్పుడు తెలసుకుందాం.
సౌండ్ క్వాలిటీకి ప్రాధాన్యం ఇచ్చే వారికి బోట్ ఎయిర్‌డోప్స్ ప్రైమ్ 800D మంచి ఛాయిస్. ఇందులో 11mm డ్రైవర్లు, డాల్బీ ఆడియో మద్దతు ఉంది. గేమింగ్ కోసం 45ms లో-లేటెన్సీ మోడ్ ఇచ్చారు. దీని కేస్‌తో కలిపి దాదాపు 45 గంటల ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. జస్ట్ 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 4 గంటల పాటు వాడుకోవచ్చు. దీని ధర రూ.1,999 గా ఉంది.
సౌండ్‌తో పాటు నాయిస్ క్యాన్సిలేషన్ కావాలనుకునే వారికి రియల్‌మీ బడ్స్ T310 బాగా సెట్ అవుతుంది. ఇందులో 12.4mm డైనమిక్ బేస్ డ్రైవర్లు, 46dB హైబ్రిడ్ ANC ఫీచర్ ఉన్నాయి. కాలింగ్ కోసం ప్రతీ ఇయర్‌బడ్‌లో మూడు మైక్రోఫోన్లు ఇచ్చారు. ANC ఆఫ్ చేస్తే కేస్‌తో కలిపి 40 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. దీని ధర రూ.1,888.
Also Read: సబ్‌స్క్రిప్షన్ ఖర్చులకు చెక్ పెట్టే 4 బెస్ట్ యాప్స్.. నెలకు ఎంత ఆదా చేయవచ్చో తెలుసా?
చాలా తేలికగా, రోజంతా సౌకర్యవంతంగా ఉండే ఇయర్‌ఫోన్స్ కోసం చూస్తుంటే వివో TWS 3e ఉత్తమమైనది. 11mm సౌండ్ యూనిట్‌తో పాటు గాలి శబ్దాన్ని తగ్గించే ఏఐ నాయిస్ రిడక్షన్ ఇందులో ఉంది. ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. కేస్‌తో కలిపి మొత్తం 42 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. దీని ధర రూ.1,899.
బ్యాటరీ లైఫ్ అతిపెద్ద ప్రాధాన్యత అయితే గోబౌల్ట్ టెనెట్ మంచి ఎంపిక. ఈ ఇయర్‌ఫోన్స్ కేస్‌తో కలిపి ఏకంగా 75 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తాయి. ఇందులో 13mm డైనమిక్ డ్రైవర్లు, 4 మైక్రోఫోన్ల ENC, ప్రత్యేకమైన గేమింగ్ మోడ్ ఉన్నాయి. రఫ్ అండ్ టఫ్ వాడకానికి ఇది చాలా బాగుంటుంది. దీని ధర కేవలం రూ.1,499.
ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, మంచి ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3r పర్‌ఫెక్ట్. 12.4mm టైటానియం కోటెడ్ డ్రైవర్లు, 3D ఆడియో సపోర్ట్ దీని సొంతం. కేస్‌తో కలిపి 54 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. తుఫాను బేస్, స్పష్టమైన వాయిస్ క్లారిటీ కావాలనుకునే వారు రూ.1,799 కి లభించే ఈ బడ్స్‌ను హ్యాపీగా కొనుగోలు చేయవచ్చు.
Also Read: వాట్సప్‌లో క్రేజీ అప్‌డేట్.. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను కూడా ఇక్కడికి రప్పించొచ్చు, ఎలాగో తెలుసా?