BigTV English

Samsung Galaxy S25 Ultra: ఇది మీరు చూడాలి.. సామ్‌సంగ్ కొత్త ఫోన్.. అంతకుమించి ఉంటుంది!

Samsung Galaxy S25 Ultra: ఇది మీరు చూడాలి.. సామ్‌సంగ్ కొత్త ఫోన్.. అంతకుమించి ఉంటుంది!

Samsung Galaxy S25 Ultra: టెక్ దిగ్గజ కంపెనీ సామ్‌సంగ్ పరిచయం అక్కర్లేదు. ఈ కంపెనీ నుంచి వచ్చే ఫోన్లకు మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. మధ్య తరగతి ప్రజలు మొబైల్ కొనాలంటే అందులో మొదటి ఆప్షన్‌గా సామ్‌సంగ్ ఉంటుంది. బడ్జెట్ నుంచి ప్రీమియం ఫోన్లు వరకు సామ్‌సంగ్ అందిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీ టెక్ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతోంది. మొబైల్ ప్రియులకు, టెక్నాలజీకి తగ్గట్టుగా నిరంతరం అప్‌డేట్ అవుతూ సామ్‌సంగ్ సరికొత్త ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొస్తుంటుంది.


ఈ క్రమంలోనే సామ్‌సంగ్ తాజాగా తన బ్రాండ్ నుంచి సామ్‌సంగ్ గెలాక్సీ S25 Ultraని పరిచయం చేయనుంది. ఈ డివైజ్‌కు సంబంధించి ఇప్పటి వరకు అనేక స్పెసిఫికేషన్‌లు వెల్లడయ్యాయి. ఇప్పుడు ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్‌తో పని చేస్తుందని తాజా నివేదిక పేర్కొంది. అలానే ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను చూడొచ్చు. ఈ ఫోన్ గురించి మరెన్నో వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: Poco M6 Plus 5G: బడ్జెట్ కింగ్.. పోకో నుంచి చీపెస్ట్ 5G ఫోన్.. ధర ఎంతంటే?


Samsung Galaxy S25 Ultra Specifications
లీకైన నివేదిక ప్రకారం ఈ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ Snapdragon 8 Gen 4 ప్రాసెసర్‌తో ఉంటుంది.  3x జూమ్ లెన్స్‌తో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఆప్టిక్స్ కోసం 5x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు గెలాక్సీ ఎస్24 అల్ట్రా మాదిరిగానే ఉంటాయని అనేక లీక్స్ వస్తున్నాయి. ఇది కాకుండా,హ్యాండ్‌సెట్ పవర్ కోసం కనీసం 4855mAh లేదా  5000mAh బ్యాటరీని కలిగి ఉండొచ్చు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింజ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ఫోన్‌లో ఎక్కువ పవర్ వినియోగించకుండా బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడానికి బ్రాండ్ ప్రాధాన్యత ఇస్తుంది. ఈ రాబోయే ఫోన్‌లో OPPO Find X7 Ultra వంటి 6,000mAh బ్యాటరీని అందించగలదని భావిస్తున్నారు. ఇది కాకుండా గెలాక్సీ S25 అల్ట్రా Android 15 ఆధారంగా స్టాండర్డ్ One UI 7 ఇంటర్‌ఫేస్‌తో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఫోన్ దాని ముందు మోడల్ S24 అల్ట్రా కంటే సన్నగా ఉంటుంది.

Also Read: Parle-G Success Story: పార్లే కంపెనీ ఎలా పుట్టింది.. స్వదేశీ ఉద్యమానికి దీనికి ఉన్న సంబంధం ఏమిటి..?

డిజైన్ పరంగా S25 అల్ట్రా మరింత కర్వ్‌డ్ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. ఇది S23 అల్ట్రా, S22 అల్ట్రా మాదిరిగానే కనిపిస్తుంది. ఫోన్ సైజులో పెద్దగా తేడా ఉండదు. బ్రాండ్ స్లిమ్‌నెస్ కోసం ఫోన్‌లోని కెమెరా సామర్థ్యాలను తగ్గించడం లేదని నివేదిక వెల్లడించింది. ఫోన్ లాంచ్ తేదీ ప్రకటించాక మరింత సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×