BigTV English

Raayan: ఏంటి.. ధనుష్ సార్.. మీ మామ సినిమానే తిప్పి తిప్పి చూపించారు

Raayan: ఏంటి.. ధనుష్ సార్.. మీ మామ సినిమానే  తిప్పి తిప్పి చూపించారు

Raayan: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం రాయన్. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాసు జైరాం, అపర్ణ బాలమురళి, ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటించారు. మొదటి నుంచి ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణం ధనుష్ చాలా గ్యాప్ తరువాత డైరెక్టర్ గా మారడం.


అప్పుడెప్పుడో గతంలో పవర్ పాండి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ఇంతకాలానికి మరోసారి రాయన్ కు దర్శకత్వం వహించాడు. అదొక కారణమైతే.. రాయన్ ధనుష్ కు 50 వ సినిమా. ధనుష్ కు మైలు రాయిగా రాయన్ మారుతుందని అభిమానులు ఆశించారు. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు రాయన్ రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది.

రొటీన్ మాస్ డ్రామా అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ సినిమా చూస్తుంటే రజినీకాంత్ భాషా సినిమా గుర్తొస్తుంది అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇలాంటి సినిమాలు తెలుగువారికి కొత్తేమి కాదు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలు తెలుగువారికి కొత్తేమి కాదు. రాయన్ కూడా అంతే. కథ విషయానికొస్తే చాలా సింపుల్.. రాయన్ కు గొడవలు అంటే భయం.. అతని తమ్ముడు ముత్తు( సందీప్ కిషన్) కు గొడవాలంటే పిచ్చి. ఎక్కడ గొడవ అయినా అతడే ముందు ఉంటాడు. అలా ఒక గొడవలో మాఫియా డాన్ కొడుకును చంపేస్తారు. ఆ హత్య ముత్తు చేసాడని .. అతని తండ్రి చంపడానికి వస్తాడు. ఇక తమ్ముడును కాపాడుకోవడానికి రాయన్ గొడవల్లోకి ఎలా వచ్చాడు. అతని గతం ఏంటి.. ? చివరికి తమ్ముడును కాపాడుకున్నాడా..? అనేది కథ.


సేమ్ ఇదే కథ రజినీకాంత్ భాషా సినిమా గుర్తొస్తుంది చెప్పుకొస్తున్నారు. అందులో కూడా రజినీ గతం గురించి చెప్పకుండా కుటుంబంతో ఉంటాడు. తమ్ముడు కోసం మళ్లీ గొడవలకు దిగుతాడు. ఇందులో కూడా అదే చూపించారు. కానీ, కొద్దిగా గతంలో ఛేంజెస్ చేశారు. సినిమా అంతా కూడా హీరో ఎలివేషన్స్ తో నింపేశారు. లాజిక్స్ లేని సీన్స్ అయితే బోలెడు. మొదటి సినిమా పవర్ పాండి తో మంచి హిట్ అందుకున్న ధనుష్ ఇలాంటి ఒక రొటీన్ సినిమాను ఎలా తీసాడో అనే అనుమానం రాకుండా మానదు. మరి ఈ సినిమా కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూడాలంటే రేపటివరకు ఆగాల్సిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×