Viral Video: స్పెయిన్‌లో పెను ప్రమాదం తప్పింది. పాల్కాడి మల్లోర్కా విమానశ్రయంలో ఫ్లైట్ టేకాఫ్ అయ్యే సమయంలో ఫైర్ వార్నింగ్ లైట్ వెలిగింది. మాంచెస్టర్ వెళ్లాల్సిన ర్యాన్ ఎయిర్ బోయింగ్ 737 ఫ్లైట్ లో ఈ ఘటన జరిగింది. ఏదో జరిగిందనుకుని అధికారులు ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ పరిస్థితి విధించడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అత్యవసర డోర్ ఓపెన్ చేసి ప్రయాణికులు బయటకొచ్చారు. కాసేపు ప్రయాణికులు గందరగోళానికి లోనయ్యారు. ప్రాణం పోయినంతా టెన్షన్ పడ్డారు.
Passengers leap on WING to flee low-cost plane FIREBALL pic.twitter.com/oI1Dp7nnvG
— RT (@RT_com) July 5, 2025
రెక్కల మీద నుంచి ప్రయాణికులు కిందకు దూకేశారు. ప్రమాదంలో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో విమాన సిబ్బంది వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందజేశారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో ఫుటేజీలో.. ప్రయాణికులు భయంతో ఫ్లైట్ కిటికీల నుంచి బయటకు వచ్చి.. విమానం రెక్కలపై నుంచి భూమిపైకి దూకుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. విమానాశ్రయ సిబ్బందిలో ఒకరు వాకీ-టాకీలో ఈ విధంగా మాట్లాడారు. ‘విమానంలో అత్యవసర ద్వారాలు ఉన్నాయని తెలుసా? ప్రయాణికులు విమాన రెక్కలపై నుంచి దూకుతున్నారు. ఏదో జరుగుతోంది, ఫైర్‌ఫైటర్లు వస్తున్నారు,” అని సందిగ్ధంగా మాట్లాడిన మాటలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై స్థానిక అత్యవసర సేవలు వెంటనే స్పందించాయి. నాలుగు అంబులెన్స్ లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అలాగే, విమానాశ్రయ ఫైర్‌ఫైటర్లు, సివిల్ గార్డ్ కూడా సహాయం కోసం చేరుకున్నారు. గాయపడిన 18 మంది ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ALSO READ: Dolly Chaiwala: ఇతడి స్టైల్ మామూలుగా లేదుగా.. సోషల్ మీడియాలో మరో డాలీ చాయ్‌వాలా వైరల్
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై సంబంధించిన విమానయాన సంస్థ రియాక్ట్ అయింది. ఫైర్ అలర్ట్ ప్రకటించిన వెంటనే స్పందించామని తెలిపింది. ప్రయాణికులను టెర్మినల్ కు తరలించామని పేర్కొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ.. మిస్టేక్ లో అగ్ని ప్రమాద హెచ్చరిక లైట్ వెలిగింది.. దీంతో టేకాఫ్ వెంటనే నిలిపివేయాల్సి వచ్చందని విమానయాన సంస్థ వివరించింది.