BigTV English

App support for stress:- మానసిక ఒత్తిడిని బయటపెట్టే యాప్.. ఒక్క క్లిక్‌తో.

App support for stress:- మానసిక ఒత్తిడిని బయటపెట్టే యాప్.. ఒక్క క్లిక్‌తో.

App support for stress:- శారీరిక సమస్యలను కనుక్కోవడానికి, ఎప్పటికప్పుడు కనిపెట్టడానికి ఎన్నో రకాల టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. కానీ మానసిక సమస్యల గురించి కనిపెట్టడానికి అంత అడ్వాన్స్ టెక్నాలజీలు ఏమీ లేవు. అందుకే స్కాట్లాండ్, చైనా శాస్త్రవేత్తలు కలిసి టెక్నాలజీతో మనుషులకు మానసిక సాయాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక స్నేహితుడిలాగా టెక్నాలజీ అనేది మనిషికి సాయంగా ఉండడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.


రోజుకు మనిషి ఎంత దూరం నడిచాడు, వారి శరీరంలో ఎంత క్యాలరీలు కరిగాయి, ఎన్ని అడుగులు వేశాడు, వారి శరీరంలో గ్లూకోజ్ శాతం ఎలా ఉంది, గుండె ఎలా కొట్టుకుంటుంది.. ఇలాంటి అన్ని విషయాలను గమనించడానికి పరికరాలు ఉన్నాయి. అందులో మనిషి మెదడులోని ఒత్తిడిని కనుక్కోవడానికి కూడా ఒక యాప్ తయారయ్యింది. ఇది తమతో పాటు, తమకు కావాల్సిన వారి ఒత్తిడి గురించి కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

‘ఇంటిమెసీ’ అనే ఒక స్మార్ట్‌ఫోన్ యాప్ మనిషి గుండె చప్పుడును ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉంటుంది. ఇది యూజర్ల హార్ట్ రేటును స్టడీ చేసి గ్రాఫిక్స్ రూపంలో వారికి చూపిస్తుంది. ఒకవేళ వారి హార్ట్ రేటు తగ్గిపోతే అది ఒత్తిడికి దారితీస్తుంది. అలాంటి సమయంలో వారి యాప్‌లో గ్రాఫికల్ అవతార్ అనేది నీటిలో మునిగిపోతున్నట్టు కనిపిస్తుంది. దీంతో వారు అలర్ట్ అవ్వచ్చు. అప్పుడే వారి సమాచారాన్ని ఫ్రెండ్స్ గ్రూప్‌లో షేర్ చేసి సహాయాన్ని కోరవచ్చు.


స్కాట్లాండ్, చైనా కలిసి తయారు చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ యాప్‌ను త్వరలోనే జెర్మనీలో కూడా ప్రజెంట్ చేయనున్నారు. ఒత్తిడి గురించి, మానసిక ఇబ్బందుల గురించి బయటికి చెప్పడం, ఇతరులతో షేర్ చేసుకోవడం.. చాలామంది ఇష్టపడరు. ఇంటిమెసి అనేది ఒకరు చెప్పకపోయినా కూడా వారికి దగ్గరైన వ్యక్తులకు వారి మెంటల్ హెల్త్ గురించి తెలిసేలా చేస్తుంది. అప్పుడు వారు అడగకపోయినా.. వారికి సహాయం అందుతుంది.

మానసిక సమస్యల గురించి బయటికి మాట్లాడలేకపోవడానికి అర్థం చేసుకొని ఇంటిమెసీ యాప్‌ను తయారు చేశామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ యాప్‌ను టెస్ట్ చేయడం కోసం శాస్త్రవేత్తలే దీనిని నాలుగు వారాలపాటు ఉపయోగించారు. టెస్ట్ తర్వాత వారు ఆశించిన రిజల్ట్స్ అందుకున్నామని తెలిపారు. త్వరలోనే దీనిని ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు అందుబాటులోకి వచ్చేలా చేస్తామని వారు అన్నారు. ఇంటిమెసీ గురించి విన్నవారు మానసిక సమస్య ఉన్నవారికి ఇది మంచి యాప్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

iPhone 17 iOS: ఐఫోన్ 17 యూజర్స్‌కు హెచ్చరిక.. వెంటనే ఆ పని చేయాలని చెప్పిన ఆపిల్

OPPO Mobile: ఫాస్ట్ చార్జింగ్, ఆకర్షణీయమైన డిజైన్.. డైలీ యూజ్ కోసం ప్రీమియం స్మార్ట్‌ఫోన్

Galaxy Ring Swell: శామ్‌సంగ్ గెలాక్సీ రింగ్‌తో డేంజర్.. వాచిపోయిన వేలితో ఆస్పత్రిపాలైన యూజర్

Credit Card Record: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ సేల్ ఎఫెక్ట్.. రూ.1.2లక్ష కోట్లు దాటేసిన క్రెడిట్ కార్డ్ షాపింగ్!

Realme Mobile: దసరా సంబరంలో రియల్‌మీ స్టైలిష్ టెక్ మాస్టర్‌పీస్.. డ్యూరబుల్ డిజైన్‌తో సూపర్ డీల్

Budget Bikes: అమ్మతోడు.. ఈ ఆఫర్లు తెలిస్తే ఇప్పుడే బైక్ షోరూంకి వెళ్లి కొనేస్తారు

Smart TV Offers: దసరాకి దుమ్ము రేపుతున్న ఆఫర్లు.. 70mm స్క్రీన్ కూడా ఈ టీవీల ముందు వేస్ట్ భయ్యా..

Flipkart Offers: ఫ్లిప్ కార్ట్ లాస్ట్ డేస్ డీల్స్ అప్‌డేట్.. టైం దాటితే ఆఫర్లు అయిపోతాయ్..

Big Stories

×