BigTV English

Seed System:- రైతులకు సాయంగా సీడ్ సిస్టమ్.. ఆకలి బాధకు చెక్..!

Seed System:- రైతులకు సాయంగా సీడ్ సిస్టమ్.. ఆకలి బాధకు చెక్..!

Seed System:- మనుషులు పెరుగుతున్నకొద్దీ వారి ఆకలి అవసరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతున్న సమయంలో వారికి తగినంత ఆహారాన్ని అందించడం కష్టమని కొందరు శాస్త్రవేత్తలు ఇప్పటికే వాదనలు మొదలుపెట్టారు. కానీ వారికి భిన్నంగా మరికొందరు మాత్రం జనాభా ఎంత పెరిగినా కూడా ఆహారాన్ని అందించే అవకాశం ఉంటుందని అంటున్నారు. దానికోసం టెక్నాలజీ సాయం తీసుకోవాలని చెప్తున్నారు.


పంట బాగా పండాలి అంటే అందులో విత్తనాలు పాత్ర ఎంతో ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాకు సరిపడా ఆహారాన్ని అందించడం కోసం విత్తనాల తయారీలో మార్పులు చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. జీరో హంగర్ అనే ప్రాజెక్ట్ పేరుతో ప్రపంచంలో ఎవరూ ఆకలితో ఉండకూడదని వారు నిర్ణయించుకున్నారు. 2030 వరకు ఈ ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి కావాలని సన్నాహాలు మొదలుపెట్టారు. కానీ వాతావరణ మార్పులు అనేవి పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

ముందుగా అందరికీ ఆహారాన్ని అందించాలంటే.. పంటలు పండే దగ్గర నుండి అన్నింటిపై పరీక్షలు చేయడమే కరెక్ట్ అని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. పంట వేసిన దగ్గర నుండి ఆహారం చేతికి వచ్చే వరకు మొత్తం సిస్టమ్‌ను వారు కనిపెడుతూ ఉండాలని అన్నారు. దానికోసమే వారు విత్తనాలపై పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. విత్తనాల విషయంలో అన్ని రకాల ప్రయోగాలు చేయడానికి రైతులకు పూర్తి హక్కులు ఉండాలని శాస్త్రవేత్తలు తెలిపారు. అలా చేసినప్పుడు పంటలు మెరుగ్గా పండుతాయని అన్నారు.


అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రైతుల నిర్ణయం ప్రకారం పంటలు పండడం ముఖ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు. దానికి వారు తోడుగా నిలబడతమన్నారు. సీడ్ సిస్టమ్స్ పేరుతో విత్తనాల గురించి రైతులకు పూర్తిగా అవగాహన ఉండాలని వారు కొత్త కొత్త ప్రాజెక్ట్స్‌తో ముందుకొస్తున్నారు. సీడ్ సిస్టమ్ అంటే విత్తనాల తయారీ నుండి అది పంటలాగా వేసే వరకు జరిగే ప్రక్రియ. ఒక విత్తనానికి సంబంధించిన పూర్తి జీవితాన్ని సీడ్ సిస్టమ్ అని అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీడ్ సిస్టమ్ అనేది రైతుల పంటలను మెరుగుపరిచే ప్రక్రియ.

సీడ్ సిస్టమ్ అనేది రైతులకు సీడ్ సెక్యూరిటీని అందిస్తుంది. ఇప్పటికే వారు సీడ్ సిస్టమ్‌పై తగిన పరిశోధనలు చేశారని, అవి పంటలు బాగా పండిస్తాయని నిర్ధారణకు వచ్చిన తర్వాతే దీనిని రైతలు దగ్గరకు తీసుకువెళ్లాలని నిర్ణయించామని అన్నారు. ఈరోజుల్లో ప్రభుత్వాలతో పాటు ఎన్నో ప్రైవేట్ సంస్థలు కూడా పంటలను బాగా పండించడం కోసం అనేక రకాల టెక్నాలజీలతో ముందుకొస్తున్నారు. ఇది తెలిసిన విషయమే. అయితే అలాంటి వాటిలో సీడ్ సిస్టమ్ కూడా ఒక్కటి కానుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×