E-Paper
Advertisement

Hyderabad News: హైదరాబాద్‌లో దారుణం..అర్ధ రాత్రి కానిస్టేబుల్‌ని కత్తులతో పొడిచి చంపిన దుండగులు

Hyderabad News: హైదరాబాద్‌లో దారుణం..అర్ధ రాత్రి కానిస్టేబుల్‌ని కత్తులతో పొడిచి చంపిన దుండగులు
Advertisement

Hyderabad News: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి ఉప్పల్‌లోని చిలకానగర్‌ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ కానిస్టేబుల్‌ని దారుణంగా హత్య చేశారు. ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అసలేం జరిగింది.

హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో దారుణం

Advertisement

ఆదివారం రాత్రి హైదరాబాద్​ ఉప్పల్‌లోని చిలకానగర్‌ ప్రాంతంలో కానిస్టేబుల్‌ని అత్యంత దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. చెంగిచెర్లలో ఆర్టీసీ కాలనీలో ఉంటున్నాడు 39 ఏళ్ల సుధీర్ కుమార్. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఆయన విధులు నిర్వహిస్తున్నాడు.

ఆదివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో చిల్కానగర్‌లోని సాయిబాబా ఆలయం సమీపంలో కానిస్టేబుల్ ఉన్న సమయంలో సంతోష్ నాయక్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తనతో తెచ్చుకున్న కత్తితో పలుమార్లు సుధీర్​ కుమార్‌ను కత్తితో కడుపు, మెడ భాగాల్లో పొడిచి పొడిచి చంపి పగ తీర్చుకున్నాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు సుధీర్.

Advertisement

అర్ధరాత్రి కానిస్టేబుల్ సుధీర్ కుమార్ దారుణహత్య

ఘటన తర్వాత నిందితుడు అక్కడికి నుంచి పారిపోయాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఘటన గురించి స్థానికుల నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మృతుడు-నిందితుడు ఇద్దరూ స్నేహితులేనని తెలుస్తోంది.

ఈ హత్య వెనుక అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగినట్టు సమాచారం. నిందితుడు సంతోష్ నాయక్‌ ఒక్కడు వచ్చాడా? లేకుంటే ఆయనతో ఎవరైనా ఉన్నారా? అనేది తెలియాల్సివుంది. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.

ALSO READ: బైక్ ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్.. ప్రాణాలు కోల్పోయిన బైకర్..!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×