SmartPhones Soon Launch| ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని భావిస్తున్నవారికి గుడ్ న్యూస్. మార్చి 2025లోనే అనేక కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. ఇంకా విడుదల కాని ఈ స్మార్ట్ ఫోన్లలో కొత్త కొత్త ఫీచర్స్ ఉంటాయని ఇప్పటికే ఆయా ఫోన్ల కంపెనీలు ప్రకటించాయి. మొబైల్ ప్రపంచంలో ఈ సంవత్సరం మార్చి మొదటి వారంలో ఒక పెద్ద ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని “మొబైల్ వరల్డ్ కాంగ్రెస్” అని పిలుస్తారు. ఈ ఈవెంట్‌లో అనేక కంపెనీలు తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ప్రదర్శించనున్నాయి. ఈ మార్చి నెలలో రియల్‌మీ, వివో, షావోమీ, నథింగ్, శాంసంగ్, హానర్, ఐక్యూ వంటి కంపెనీలు తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంతో పాటు ఇతర మార్కెట్‌లలో కూడా లాంచ్ చేయనున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీలు లాంచ్ చేయబోయే స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.
1. Nothing Phone 3a
లాంచ్ తేదీ: మార్చి 4, 2025
ఫీచర్స్:
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 చిప్‌సెట్ , 6.8-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 12GB RAM, 50MP + 50MP + 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, టెలిఫోటో లెన్స్
2. Nothing Phone 3a Pro
లాంచ్ తేదీ: మార్చి 4, 2025 (అంచనా)
ఫీచర్స్:
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 చిప్‌సెట్ , 12GB RAM – 256GB స్టోరేజ్, 50MP రియర్ కెమెరా 50MP సెల్ఫీ కెమెరా, పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, AI ఫీచర్లు అదనం.
Also Read: తక్కువ ధరలో ఏఐ ఫీచర్లు గల స్మార్ట్ ఫోన్లు ఇవే..
3. Vivo T4x 5G
లాంచ్ తేదీ: మార్చి 2025 (అంచనా)
ఫీచర్స్:
6.68-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే (120Hz రిఫ్రెష్ రేట్), మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, 8GB RAM, 6500mAh బ్యాటరీ (44W ఫాస్ట్ ఛార్జింగ్), 50MP ప్రధాన కెమెరా
4. Xiaomi 15
లాంచ్ తేదీ: మార్చి 2025 (అంచనా)
ఫీచర్స్:
6.36-అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 16GB RAM (భారతదేశంలో), 50MP + 50MP + 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా,
5400mAh బ్యాటరీ (90W వైర్డ్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్).
5. Realme 14 Pro Lite
లాంచ్ తేదీ: మార్చి 2025 (అంచనా)
ఫీచర్స్:
6.7-అంగుళాల కర్వ్డ్ OLED డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్, 8GB RAM, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా, 5200mAh బ్యాటరీ, ధర: రూ. 25,000 (అంచనా)
6. Honor X9c
లాంచ్ తేదీ: మార్చి 2025 (అంచనా)
ఫీచర్స్:
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 చిప్‌సెట్, 12GB RAM, 108MP ప్రధాన కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా, 6600mAh బ్యాటరీ (66W ఫాస్ట్ ఛార్జింగ్),
7. Tecno Pova Curve 5G
లాంచ్ తేదీ: మార్చి 2025 (అంచనా)
ఫీచర్స్:
120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మీడియాటెక్ ప్రాసెసర్, 8GB RAM
8. iQOO Neo 10R
లాంచ్ తేదీ: మార్చి 11, 2025
ఫీచర్స్:
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్, 12GB RAMతో పాటు 256GB స్టోరేజ్, 6400mAh బ్యాటరీ (80W ఫాస్ట్ ఛార్జింగ్), 6000mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ (గేమింగ్ కోసం)
9. Samsung Galaxy M16
లాంచ్ తేదీ: మార్చి 2025 (అంచనా)
ఫీచర్స్:
120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 50MP ప్రధాన కెమెరా, 5000mAh బ్యాటరీ.
ఈ నెలలోనే లాంచ్ కానున్న.. ఈ ఫోన్‌లు అధునాతన ఫీచర్లు, పవర్ ఫుల్ పర్‌ఫార్మెన్స్ తోపాటు ఆకర్షణీయమైన డిజైన్‌లతో వస్తున్నాయి. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే, ఈ ఫోన్‌లను పరిగణించండి. ఈ ఫోన్‌లు భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతాయో త్వరలోనే తెలుస్తుంది.