BigTV English

Car Sales in Feb 2025: ఫిబ్రవరి అమ్మకాల్లో మారుతి టాప్, ఆ కార్లకు గ్రహణం

Car Sales in Feb 2025: ఫిబ్రవరి అమ్మకాల్లో మారుతి టాప్, ఆ కార్లకు గ్రహణం

Car Sales in Feb 2025: ఓ వైపు స్టాక్ మార్కెట్ రోజురోజుకూ పతనమవుతోంది. దీంతో వివిధ కంపెనీల షేర్లు నేల చూపు చూస్తున్నాయి. గడిచిన ఐదునెలలుగా పతనం సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా ఫిబ్రవరి నెలలో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయా? ఏమైనా ప్రభావం చూపిందా? అనేదానిపై ఓ లుక్కేద్దాం.


ఫిబ్రవరిలో వాహనాల సేల్స్ మాటేంటి?

దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి కార్లకు మంచి డిమాండ్ ఉంది. పెద్ద కంపెనీలతో పోటీ పడుతూ మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఫిబ్రవరి అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది మారుతి సుజుకి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 1,60,791 కార్లను విక్రయించింది. దీనిద్వారా దేశీయ మార్కెట్లో అగ్రస్థానాన్ని సాధించింది ఆ కంపెనీ. గతేడాదితో పోల్చితే కేవలం 0.32 శాతం మాత్రమే పెరిగింది. సరిగ్గా ఏడాది కిందట ఫిబ్రవరిలో మారుతి సుజుకికి 1,60,271 కార్లను మాత్రమే విక్రయించింది.


మారుతీ సుజుకి కార్ల అమ్మకాలు నెల వారీ ప్రాతిపదికన పరిశీలిస్తే 7.38 శాతం క్షీణించింది. జనవరి 2025లో దేశీయ మార్కెట్లో మొత్తం 1,73,599 వినియోగదారులను పొందింది. అదే సమయంలో మారుతి కార్ల ఎగుమతులు గత నెలలో క్షీణించాయి.

మారుతి సుజుకి మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ మొత్తం 1,097 విక్రయాలు సాగాయి. వ్యాన్ సెగ్మెంట్లో మారుతి సుజుకి ఈకో మరోసారి 11,000 కార్లను విక్రయించి టాప్‌లో నిలిచింది. ఆటో, ఎస్-ప్రెస్సో వంటి మినీ సెగ్మెంట్ కార్లలో 10,226 మంది కొత్త కస్టమర్లు వచ్చారు. వీటితోపాటు బాలెనో, సెలెరియో, డిజైర్, స్విఫ్ట్ వంటి కాంపాక్ట్ సెగ్మెంట్ మోడళ్లను 72,000 కార్లు అమ్ముడుపోయాయి. యుటిలిటీ వెహికిల్ సెగ్మెంట్లో 65,000 మందికి పైగా మారుతిని కొనుగోలు చేశారు.

ALSO READ: గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు

మారుతి సుజుకి కార్ల కంపెనీ ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి 2025లో 25,021 వాహనాలను ఎగుమతి చేయగా, గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సంఖ్య 28,927 ఉంది. ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన చూస్తే 13.50 శాతం క్షీణించాయి. ఓవరాల్‌గా చూస్తే మారుతి కార్ల అమ్మకాలలో స్వల్ప పెరుగుదల కనిపించింది. కాకపోతే కొన్ని సెగ్మెంట్‌లలో అమ్మకాలు క్షీణించాయి.

3 శాతం క్షీణించిన హ్యుందాయ్ మోటార్స్

తదుపరి జాబితాలో హ్యుందాయ్ మోటార్ ఇండియా. ఈ కంపెనీ మొత్తం వాహనాల పంపిణీలను ఏడాది ప్రాతిపదికన పరిశీలిస్తే మూడు శాతం క్షీణించింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో 58,727 కార్ల విక్రయాలు సాగాయి. గతేడాది ఫిబ్రవరిలో 60,501 కార్లు విక్రయించింది.

19 శాతం వృద్ధి మహీంద్రా & మహీంద్రా

మహీంద్రా ఆటోమోటివ్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. దేశీయ విపణిలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 50,420 వాహనాలను విక్రయించింది. గతేడాది కేవలం 42,401 వాహనాలను మాత్రం విక్రయించింది. ఈ లెక్కన గతేడాదితో పోల్చితే 19 శాతం వృద్ధిని సాధించింది. ఇక జనవరి 2025తో పోలిస్తే వాహన తయారీ సంస్థ ఫిబ్రవరి 239 వాహనాలు తక్కవగా అమ్ముడుపోయాయి. అంటే 0.47 శాతం క్షీణతను నమోదు చేసింది.

9.43 శాతం క్షీణించిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ విషయానికొస్తే నాలుగో జాబితాలో నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొత్తం వాహన 46,435 వాహనాలను విక్రయించింది. గతేడాది పోల్చితే 9.43 శాతం క్షీణించింది.

23.89 శాతం వృద్ధితో కియా ఇండియా

కియా ఇండియా కార్లలో జోష్ కనిపించింది. ఈ ఏడాది ఫిబ్రవరి లో మొత్తం 25,026 వాహనాలు విక్రయించింది. సేల్స్ చార్ట్‌లో ఐదో స్థానంలో నిలిచింది. గతేడాదితో ఫిబ్రవరితో పోల్చితే 23.89 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×