BigTV English

Rohit Sharma: రోహిత్ మతిమరుపు.. ఈ సారి ఫోన్ మర్చిపోయాడే ?

Rohit Sharma: రోహిత్ మతిమరుపు.. ఈ సారి ఫోన్ మర్చిపోయాడే ?

Rohit Sharma: మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. అందులో కొన్ని మంచి కోసం ఉపయోగపడితే.. మరికొన్ని చిక్కుల్లో పడేస్తాయి. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఇలాంటి ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అదే మతిమరుపు. రోహిత్ శర్మకు మరిచిపోయే వీక్నెస్ ఉందన్న విషయం చాలామంది క్రీడాభిమానులకు తెలిసిందే. అతడు తరచూ తన విలువైన వస్తువులను మరచిపోతూ ఉంటాడని గతంలో విరాట్ కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.


 

రోహిత్ లాగా వస్తువులను మరిచిపోయే వాళ్లను తాను ఇంతవరకు చూడలేదని అన్నాడు. తరచూ తన ఐప్యాడ్, ఫోన్, పర్స్ ఇలా ప్రతిదీ రోహిత్ శర్మ మరిచిపోతూ ఉంటాడని తెలిపాడు విరాట్ కోహ్లీ. ఈ మతిమరుపు వల్ల రోహిత్ శర్మ చాలాసార్లు ఇబ్బందులు పడ్డాడు. ఆసియా కప్ ముగిసిన తర్వాత కొలంబో నుండి ముంబై వెళుతున్న సమయంలో హోటల్ రూమ్ లోనే తన పాస్ పోర్ట్ మరిచిపోయాడు రోహిత్. ఆ తర్వాత ఎయిర్ పోర్ట్ వెళ్లేందుకు బస్సు ఎక్కిన తర్వాత కెప్టెన్ కి ఈ విషయం అర్థమైంది.


దీంతో హోటల్ స్టాఫ్ ని పిలిపించి పాస్ పోర్ట్ తెచ్చి ఇవ్వమని రిక్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత హోటల్ స్టాఫ్ పాస్పోర్ట్ తెచ్చి ఇచ్చేంతవరకు బస్సు డోర్ దగ్గరే కూర్చుండిపోయాడు. ఆ సమయంలో అతడి టీమ్ మేట్స్ గట్టిగా అరుస్తూ ఆటపట్టించారు. ఇక ఒకసారి మ్యాచ్ కి ముందు టాస్ వేసే సమయంలో కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకోవాలా..? బ్యాటింగ్ ఎంచుకోవాలా అనే విషయాన్ని కూడా మర్చిపోయాడు. పాకిస్తాన్ ప్లేయర్ ఇమామ్ ఉల్ – హక్ కూడా.. రోహిత్ తన విలువైన వస్తువులను మరిచిపోతాడని వివరించాడు.

రోహిత్ శర్మ నిద్ర లేవగానే తన షూస్, ఫోన్, బెల్ట్ కోసం చూస్తాడని.. ముందు రోజు తాను చేసిన ప్రతి దాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నిస్తాడని తెలిపాడు ఇమామ్. ఇలా కెరియర్ స్టార్టింగ్ నుండే ఈ మతిమరుపు సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో తన మతిమరుపు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశాడు. భారత జట్టు ఆటగాళ్లంతా మతిమరుపు విషయంలో తనను ఏడిపిస్తూ ఉంటారని.. కానీ ఇది తన హాబీ కాదన్నాడు. అయితే తన జీవితంలో మరిచిపోయిన అతిపెద్ద విషయం ఏంటని ప్రశ్నిస్తే.. చెప్పను అంటూ తప్పించుకున్నాడు. ఒకవేళ ఆ విషయాన్ని బయట పెడితే.. తన వైఫ్ చూస్తుందని.. కాబట్టి తాను మరిచిపోయింది ఏంటో రివీల్ చేయలేనని తెలిపాడు.

 

అయితే తాజాగా మరోసారి రోహిత్ శర్మ మతిమరుపుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జట్టు ఆటగాళ్లంతా బస్సులో ప్రయాణించేందుకు హోటల్లో నుండి కిందికి వచ్చి.. బస్సు లోకి ఎక్కుతున్న సమయంలో.. రోహిత్ శర్మ బస్ దిగి కిందికి వచ్చాడు. ఎందుకంటే హోటల్ లోనే తన ఫోన్ ని మరిచిపోయాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న మరో వ్యక్తికి చెప్పి ఆ ఫోన్ ని తీసుకురమ్మని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

PAK Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : స్మృతి మంధానకు ఘోర అవమానం… ఆ ఫోటోలు వైరల్ చేసి!

Abhimanyu Easwaran : 25 సెంచరీలు, 30 అర్థ శతకాలు చేసినా ఛాన్స్ దక్కడం లేదు…అభిమన్యు ఏం పాపం చేశాడు రా !

Inzamam-ul-Haq : అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్స్.. అందుకే దారుణంగా ఆడుతున్నాడు

Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జ‌డేజా..షెడ్యూల్ ఇదే

IND Vs AUS : ఆస్ట్రేలియాతో సిరీస్… టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్

Asia Cup 2025 : టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు…గంభీర్ పై సంజూ సీరియస్?

Big Stories

×