BigTV English

SpaceX direct-to-cell : శాటిలైట్ టూ ఫోన్.. స్పేస్-ఎక్స్ సంచలనం..

SpaceX direct-to-cell : శాటిలైట్ టూ ఫోన్.. స్పేస్-ఎక్స్ సంచలనం..

SpaceX direct-to-cell : స్పేస్-ఎక్స్‌గా సుపరిచితమైన స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ టెక్నాలజీస్ సంస్థ బుధవారం 21 స్టార్ లింక్ ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇందులో విశేషం ఏముందనే కదూ మీ అనుమానం? వీటిలో ఆరు శాటిలైట్లు మాత్రం ప్రత్యేకం. ‘డైరెక్ట్ టూ సెల్’(DTC) కమ్యూనికేషన్ల సామర్థ్యం ఉన్న ఉపగ్రహాలవి. వీటిని ప్రయోగించడం ఇదే తొలిసారి. స్టార్‌లింక్ టెర్మినల్ లేకుండానే యూజర్లు తమ మొబైల్ ఫోన్లను ఇక నేరుగా మొబైల్ నెట్‌వర్క్‌తో అనుసంధానం కావొచ్చు. భూమిపై మౌలికవసతులేవీ లేకుండానే స్టార్‌లింక్ శాటిలైట్లతో మొబైల్ ఫోన్లు లింక్ అవుతాయన్నమాట.


DTC ఫీచర్ ద్వారా యూజర్ల వాయిస్, టెక్ట్స్, డేటా సర్వీసులను ఎక్కడి నుంచైనా పొందే వీలుంటుంది. రిమోట్ ఏరియాలు, విపత్తుల వేళల్లోనూ నిరాటంకంగా కమ్యూనికేషన్‌ను కొనసాగించొచ్చు. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ సాయంతో వీటిని లో-ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. DTC స్టార్‌లింక్ శాటిలైట్లు అనేవి అత్యంతాధునికమైన మోడెమ్‌లు. అంతరిక్షంలో ఇవి సెల్‌ఫోన్ టవర్ల మాదిరిగా పనిచేస్తాయి. దీని వల్ల మొబైల్ ఫోన్లకు సిగ్నల్ అందదనే సమస్యే ఉండదు.

వాస్తవానికి DTC శాటిలైట్లను గత నెలలోనే ప్రయోగించాల్సి ఉంది. సాంకేతిక సమస్యలతో ఇన్ని రోజులు వాయిదాపడింది. DTC ఫీచర్ అనేది కమ్యూనికేషన్లలో గేమ్ ఛేంజర్ అని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. సెల్యులర్ డెడ్ జోన్ల సమస్య దీని వల్ల తొలగిపోతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు ఈ ఫీచర్ సాయంతో ఇకపై నిరంతరాయంగా యాక్సెస్ అందించవచ్చని ఆ కంపెనీ పేర్కొంది.


అంతకుముందు స్టార్‌లింక్ మొబైల్ సర్వీస్ పైలెట్ ప్రాజెక్టుకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(FCC) నుంచి స్పేస్-ఎక్స్ అనుమతి పొందింది. ఈ శాటిలైట్ల ద్వారా స్మార్ట్ ఫోన్లకు ఇంటర్నెట్ యాక్సెస్ అందిస్తుంది. ఇందుకోసం అమెరికాలోని టీ-మొబైల్ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునేందుకు ఆ సంస్థతో స్పేస్-ఎక్స్ నిరుడు ఆగస్టులో ఒప్పందం చేసుకుంది. ఈ తరహాలోనే ఇతర దేశాల్లోని ప్రొవైడర్లతోనూ ఒప్పందాలు కుదిరాయి.

కెనడాలో రోజర్స్, జపాన్‌లో కేడీడీఐ, ఆస్ట్రేలియాలో ఆప్టస్, న్యూజిలాండ్‌లో వన్ ఎన్‌జెడ్, స్విట్జర్లాండ్‌లో సాల్ట్, చిలీ, పెరు దేశాల్లో ఎంటెల్ ప్రొవైడర్ సంస్థలు వీటిలో ఉన్నాయి. రానున్న ఆరు నెలల్లో మరో 840 DTC సామర్థ్యం కలిగిన శాటిలైట్లను ప్రయోగించాలని స్పేస్-ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం స్పేస్-ఎక్స్‌కు చెందిన 5000 శాటిలైట్లు రోదసిలో ఇప్పటికే క్రియాశీలకంగా ఉన్నాయి.

https://twitter.com/i/broadcasts/1OwxWYmNbeeGQ?s=20

Tags

Related News

Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Big Stories

×