BigTV English
Advertisement

Hardeep Singh Puri : చమురు ధరలు తగ్గుతాయని వార్తలు.. కేంద్ర మంత్రి క్లారిటీ..

Hardeep Singh Puri on Fuel Price Reduction : చమురు ధరల తగ్గిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ స్పష్టత నిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ముందు చమురు ధరలను కేంద్రం తగ్గిస్తుందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. చమురు ధరల తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం అనేది పూర్తిగా ఊహాజనితమన్నారు. చమురు ధరల తగ్గింపుపై ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో ఎలాంటి చర్చలూ జరగలేదని మంత్రి స్పష్టత నిచ్చారు. ఓ వైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నాయి, మరో వైపు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తుందంటూ వార్తలు వచ్చాయని మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు.

Hardeep Singh Puri :  చమురు ధరలు తగ్గుతాయని వార్తలు.. కేంద్ర మంత్రి క్లారిటీ..

Hardeep Singh Puri on Fuel Price Reduction : చమురు ధరల తగ్గిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ స్పష్టత నిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ముందు చమురు ధరలను కేంద్రం తగ్గిస్తుందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. చమురు ధరల తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఊహాజనితమన్నారు. చమురు ధరల తగ్గింపుపై ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో ఎలాంటి చర్చలూ జరగలేదని మంత్రి స్పష్టత నిచ్చారు. ఓ వైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నాయి, మరో వైపు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తుందంటూ వార్తలు వచ్చాయని మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు.


లీటర్‌కు రూ.6 మేర తగ్గే అవకాశం ఉందని ప్రచారం జరిగిందని మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. ఒకప్పటితో పోలిస్తే చమురు ధరలు గరిష్ఠాల నుంచి భారీగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆ మేర వినియోగదారులకు ప్రయోజనాన్ని బదిలీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందంటూ వార్తలు వచ్చాయన్నారు. అయితే అలాంటిదేమీ లేదంటూ ఖండించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు ఒడుదొడుకుల కారణంగా అటు అభివృద్ధి చెందిన, పొరుగు దేశాల్లో సైతం ధరలు అమాంతం పెరిగాయని మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. భారత్‌లో మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

దక్షిణాసియా దేశాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 40-80 శాతం మేర పెరిగాయని మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు. పశ్చిమ దేశాల్లోనూ ధరలు పెరిగాయని చెప్పారు. అదే సమయంలో భారత్‌లో 2021 నవంబర్‌, 2022 మే నెలలో రెండు సార్లు చమురు ధరలు తగ్గాయని మంత్రి గుర్తు చేశారు. భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు, ఎల్పీజీ దిగుమతిదారుగా ఉందని మంత్రి పురీ చెప్పారు. రిఫైనరీ, ఆటోమొబైల్‌, ఎల్‌ఎన్‌జీ దిగుమతిలో మార్కెట్‌ పరంగా నాలుగో స్థానంలో ఉందన్నారు.


ప్రపంచ మార్కెట్‌లో ఎప్పడికప్పుడు చమురు ధరలు తీవ్రమైన ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయని మంత్రి హర్దీప్ సింగ్ పేర్కొన్నారు. అలాంటి స్థితిలో ఏ ప్రభుత్వానికి అయినా చమురు ధరలు తగ్గించడం కష్టంతో కూడుకున్న వ్యవహారమని మంత్రి తెలిపారు. అయితే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో చమురు ధరల తగ్గింపుపై ఎలాంటి సంప్రదింపులూ జరగలేదని చెప్పారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు లాభాలు ప్రకటించినప్పటికీ.. చమురు ధరలు గరిష్ఠంగా ఉన్న సమయంలో రిఫైనరీలు భారీ నష్టాలు చవిచూశాయన్న అంశాన్ని మంత్రి హర్దీప్ సింగ్ పురీ గుర్తుచేశారు.

Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×