Google Chrome : ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్స్ ఉపయోగించే వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్. ఈ యాప్ అప్పుడప్పుడు స్లో అయిపోతూ ఉంటుంది. అసలు క్రోమ్ ఎందుకు స్లో అవుతుంది. క్రోమ్ లో ఉండే ఏ ఫీచర్స్ ను మారిస్తే స్పీడ్ గా పని చేస్తుందో తెలుసుకుందాం.
Google Chrome ప్రపంచవ్యాప్తంగా 64.68% వినియోగదారు ఉపయోగిస్తున్న టాప్ బ్రౌజింగ్ యాప్. అంటే ఈ వెబ్ బ్రౌజర్‌ను ప్రపంచ జనాభాలో సగానికి పైగా యూజర్స్ ఉపయోగిస్తున్నారు. వీటిలో కంప్యూటర్ నుండి మొబైల్ వినియోగదారులు కూడా ఉన్నారు. అయితే కొన్నిసార్లు ఇది చాలా నెమ్మదిగా పని చేస్తుంది. దీంతో యూజర్స్ చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా గూగుల్ క్రోమ్ స్లో కావటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోవడం, కుకీస్ క్లాష్ అవ్వటం, ట్యాబ్స్ ను క్లోజ్ చేయకపోవడం, ఎక్కువగా యాడ్స్ రావడం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సమస్యను ఎలా పరిష్కరించాలంటే.
Google Updates –టెక్ దిగ్గజం గూగుల్.. తన బ్రౌజింగ్ యాప్ గూగుల్ క్రోమ్ లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను విడుదల చేస్తుంది. ఈ అప్‌డేట్‌లతోనే Chrome సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అవుతుంది. దీంతో ఈ ప్లాట్‌ఫారమ్ స్పీడ్ గా పని చేస్తుంది. అలాగే, కొత్త సెక్యూరిటీ లేయర్ కూడా అందుబాటులోకి వస్తుంది. అందుకే Chromeను అప్‌డేట్ చేయడం మర్చిపోవద్దు. ఇలా చేయడంతో బ్రౌజర్ వేగంగా పని చేస్తుంది. డేటా కూడా సేఫ్ గా ఉంటుంది.
Cookies and Cache – Google Chromeలో ఏదైనా శోధించినప్పుడు, దానికి సంబంధించిన తాత్కాలిక ఫైల్‌లు కంప్యూటర్‌లో స్టోర్ అయిపోతాయి. వీటినే కుక్కీలు లేదా కాష్ అంటారు. ఇవి ఎక్కువ అవుతున్న కొలదీ Chrome కొన్నిసార్లు చాలా నెమ్మదిగా మారుతుంది. బ్రౌజర్ వేగాన్ని పెంచడానికి, ఈ ఫైల్‌లను తొలగించండి. దీంతో బ్రౌజర్ సరిగ్గా పని చేస్తుంది. కంప్యూటర్, మొబైల్ వినియోగదారులకు ఈ టిప్ బెస్ట్ గా పనిచేస్తుంది.
Performance Feature – గూగుల్ క్రోమ్ తన ప్లాట్‌ఫారమ్ వేగాన్ని పెంచే ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీన్ని ఎనేబుల్ చేయటానకిి Google Chrome సెట్టింగ్‌లకు వెళ్లండి. స్పీడ్ ఆఫ్షన్ పై క్లిక్ చేసి ప్రీలోడ్ పేజీని ఆన్ చేయాలి. ఇది బ్రౌజర్‌లో సర్చ్ స్పీడ్ ను పెంచుతుంది. మెరుగైన బ్రౌజింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
Tabs – వినియోగదారులు తరచుగా Google Chromeలో చాలా ట్యాబ్‌లను ఓపెన్ చేస్తారు. ఇది ప్లాట్‌ఫారమ్ స్పీడ్ ను డిసైడ్ చేస్తుంది. ఈ బ్రౌజర్ వేగాన్ని పెంచడానికి, Chromeలో ఉపయోగించని ట్యాబ్‌లను క్లోజ్ చేయాలి దీంతో ఇది బ్రౌజింగ్ స్పీడ్ ను పెంచుతుంది.
Ad Blocker – ఈ రోజుల్లో దాదాపు ప్రతీ వెబ్‌సైట్‌లో యాడ్స్ కనిపిస్తున్నాయి. ఈ ప్రకటనలకు అదనపు సర్వర్‌లు, డౌన్‌లోడ్‌లు అవసరం. ఇది ఫైల్ సైజ్, వెబ్‌సైట్ మానిఫోల్డ్ లోడ్ టైమ్ ను పెంచుతుంది. అందుకే దీన్ని పరిష్కరించడానికి యూజర్స్ యాడ్ బ్లాకర్‌ని ఉపయోగించవచ్చు. ఇది ప్రకటనలను ఆపివేస్తుంది. దీనివల్ల ఎలాంటి అంతరాయం లేకుండా సులభంగా సర్చ్ చేసే ఛాన్స్ ఉంటుంది.