E-Paper
Advertisement

Allu Arjun: ఫ్యాన్స్‌ కోసం అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్.. వారికి దూరంగా ఉండండి అంటూ రిక్వెస్ట్

Allu Arjun: ఫ్యాన్స్‌ కోసం అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్.. వారికి దూరంగా ఉండండి అంటూ రిక్వెస్ట్
Advertisement

Allu Arjun: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ఫ 2’ సినిమా విడుదలయినప్పటి నుండి దీనికి ఏదో ఒక విధంగా సమస్యలు వస్తూనే ఉన్నాయి. ‘పుష్ఫ 2’ ప్రీమియర్స్ సమయంలో సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనను చాలాకాలం వరకు ఇండస్ట్రీ మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా మర్చిపోలేరు. ఈ విషయంలో అల్లు అర్జున్‌దే తప్పు అని పోలీసులు సైతం తనను అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. ఆ తర్వాత తను వెంటనే బెయిల్ మీద బయటికి వచ్చేశాడు. తాజాగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ ఘటనపై స్పందిస్తూ వివరణ ఇచ్చాడు అల్లు అర్జున్. అంతే కాకుండా తాజాగా ఫ్యాన్స్ కోసం ఒక స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేశాడు.

పోస్ట్ వైరల్

Advertisement

ఇంటర్నెట్ మొత్తం చాలావరకు అల్లు అర్జున్‌పై నెగిటివిటీతో నిండిపోయింది. చాలామంది సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌దే తప్పు అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం బన్నీకి సపోర్ట్‌గా, కవచంగా నిలబడుతున్నారు. తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారిని పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఇది అల్లు అర్జున్ కంటపడినట్టుగా ఉంది. అందుకే తన ఫ్యాన్స్‌ను అలా చేయొద్దంటూ రిక్వెస్ట్ చేస్తూ పోస్ట్ షేర్ చేశాడు. మొత్తానికి కొన్నిరోజులుగా పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా అల్లు అర్జున్ (Allu Arjun) పేరు మాత్రం తరచుగా వార్తల్లోనే నిలుస్తోంది. తాజాగా తను చేసిన పోస్ట్ కూడా వెంటనే వైరల్ అయ్యింది.

Also Read: చట్టం దృష్టిలో అందరూ ఒకటే… అల్లు అర్జున్ కామెంట్స్ పై డీజీపీ రియాక్షన్..

Advertisement

చర్యలు తీసుకుంటాం

‘నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్నిరోజులుగా ఫేక్ ఐడి, ఫేక్ ప్రొఫైల్స్‌తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగిటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని నా ఫ్యాన్స్‌కు సూచిస్తున్నాను’ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా తన ఫ్యాన్స్ అంటూ ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నవారిపై యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు అల్లు అర్జున్. అంతే కాకుండా ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా ఎవరినీ కించపరిచేలా మాట్లాడకండి అంటూ సూచించాడు. వారి ఫీలింగ్స్‌ను బాధ్యతతో వ్యక్తపరచమని కోరాడు.

ఫ్యాన్స్ సపోర్ట్

అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ పోస్ట్‌కు తన ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ.. తమ ఫేవరెట్ హీరో మాట వింటుంది అంటూ మాటిస్తున్నారు. ఈ పోస్ట్‌ తన ఫ్యాన్స్ కామెంట్స్‌తో నిండిపోయింది. ఇప్పటికే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు తెగ వైరల్ అయ్యాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి మరణించడంలో తన తప్పు ఏమీ లేదని చెప్పుకొచ్చాడు ఈ హీరో. మొత్తానికి ఒకవైపు ‘పుష్ప 2’ వల్ల ఇంత జరుగుతున్నా సినిమా మాత్రం కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతోంది. ఇప్పటికే వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేసి దూసుకుపోతోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×