Bharati Airtel : భారతీ ఎయిర్‌టెల్ (Bharati Airtel) యూజర్స్ కు గుడ్ న్యూస్ చెప్పేసింది. తాజాగా తీసుకొచ్చిన వాయిస్, ఎస్సెమ్మెస్ ఓన్లీ ప్లాన్ల ధరల్లో సవరణలు చేస్తూ మరింత తక్కువ ధరకే రీఛార్జ్ సదుపాయాన్ని అందిస్తుంది.
ప్రముఖ ప్రయివేట్ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్… తాజాగా తీసుకొచ్చిన వాయిస్, ఎస్సెమ్మెస్ ప్లాన్ల ధరలను మరోసారి సవరించింది. ఇటీవలే తీసుకొచ్చిన రెండు ప్లాన్ల ప్రయోజనాలను అందుబాటులో ఉంచుతూనే…. తగ్గింపు ధరలతో కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో పాత ప్లాన్లను వెబ్ సైట్ నుంచి తొలగించింది.
ఎయిర్‌టెల్ వాయిస్, ఎస్సెమ్మెస్ ఓన్లీ ప్లాన్లలో భాగంగా కొత్త ప్లాన్ ను రూ.469కే అందించింది. 84 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న ఈ ప్లాన్ లో అన్‌లిమిటెడ్ వాయిస్‌కాల్స్, 900 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. అయితే ఇవే ప్రయోజనాలతో ఇంతకుముందు ప్లాన్ ధర రూ.499గా ఉండటంతో ఈ ప్లాన్ పై రూ. 30 తగ్గించింది ఎయిర్టెల్.
ఇక ఎయిర్‌టెల్ మరో ప్లాన్ ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.1849. 365 రోజుల వ్యాలిడిటీతో వస్తోన్న ఈ ప్లాన్ లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఇక ఇదై ప్రయోజనాలతో ఇంతకు ముందు తీసుకొచ్చిన ప్లాన్ రూ. 1959 ప్లాన్ కంటే రూ.110 తక్కువగా ఉంది. ఇక ఈ రెండు ప్లాన్స్ పై మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్‌తో పాటు హలో ట్యూన్స్ వంటి అదనపు ప్రయోజనాలు సైతం పొందే ఛాన్స్ ఉంది.
ALSO READ : ఐక్యూ Z10 వచ్చేస్తుందోచ్.. 7500mAh బ్యాటరీ, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో!
ఇక ప్రముఖ టెలికాం సంస్థలన్నీ ఎప్పటికప్పుడు తమ రీఛార్జ్ ప్లాన్షన్ విపరీతంగా పెంచేస్తున్న నేపథ్యంలో టెలికామాదారిటీ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే ఇబ్బంది లేకుండా కేవలం వాయిస్ ఎస్ఎంఎస్ మాత్రమే ఉపయోగించే వారి కోసం ప్రత్యేక ప్లాన్స్ తీసుకురావాలని ఆదేశించింది ఈ క్రమంలోనే ఎయిర్టెల్ జియో వోడాఫోన్ ఐడియా ప్రత్యేక ప్లాన్షన్ అందుబాటులోకి తీసుకువచ్చాయి ఇక తాజాగా ఈ ప్లాన్స్ అందుబాటులోకి వచ్చిన లేకపోతే మరోసారి వీటి ద్వారా తగ్గించాలని ట్రాయ్ సూచించింది దీంతో ట్రాయ్ ఆదేశాల మేరకు ఎయిర్టెల్ తన ప్లాన్ ధరలను తగ్గించింది ఈ నేపథ్యంలోనే ఇతర టెలికం కంపెనీలైన జియో వోడాఫోన్ ఐడియా సైతం తన ప్రాన్స్ ను ధనలను తగ్గించే అవకాశం ఉందని ఇప్పుడు అలా అంచనా వేస్తున్నారు ఇక రాయి రాధా నిర్ణయంతో టెలికాం కంపెనీ రాదాయంపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నప్పటికీ యూజెస్ కు భారం తగ్గే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది
గత ఏడాది నుంచి ఇండియాలో ఉన్న ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలన్నీ తమ రీఛార్జ్ ప్లాన్స్ ను విపరీతంగా పెంచేశాయి. ముఖ్యంగా డేటా, అన్లిమిటెడ్ ప్లాన్స్ అవసరమయ్యే యూజర్స్ పై భారం ఎక్కువగా పడింది. ఏకంగా పెద్ద మొత్తంలో ప్రతీ రీఛార్జ్ ప్లాన్ పై ధరలు పెరగడంతో యూజర్స్ లబోదిబోమంటున్నారు. అంతేకాకుండా జియో, ఎయిర్టెల్ నుంచి భారీ మొత్తంలో యూజర్స్ వేరే నెట్వర్క్స్ కు పోర్ట్ అయిపోయారు. ఈ నే పథ్యంలో బిఎస్ఎన్ఎల్ కు కాస్త ఊరట లభించినట్టు అయింది. మరి ఇప్పుడు ట్రాయ్ ఆదేశాల మీదకు రీఛార్జ్ ప్లాన్స్ లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూడాలి.