BigTV English

Thandel Trailer: జోరుమీదున్న ‘తండేల్’.. ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది..

Thandel Trailer: జోరుమీదున్న ‘తండేల్’.. ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది..

Thandel Trailer: టాలీవుడ్‌లో చాలావరకు యంగ్ హీరోలు ఒక్క హిట్ దొరికితే చాలు అని ఎదురుచూస్తూ ఉన్నారు. చాలావరకు టైర్ 2 హీరోలకు సరైన హిట్ పడి చాలాకాలం అవుతోంది. అలా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో నాగచైతన్య కూడా ఒకడు. 2022లో విడుదలయిన ‘బంగార్రాజు’ తర్వాత నాగచైతన్యకు సరైన హిట్ లేదు. అయినా అది సోలో హీరో మూవీ కాదు. ‘బంగార్రాజు’ ఆ రేంజ్‌లో హిట్ అవ్వడానికి తన తండ్రి నాగార్జున కూడా కారణం. అందుకే ఇప్పుడు సోలో హీరోగా ‘తండేల్’తో ఎలాగైనా హిట్ కొట్టాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటికి వస్తుండగా తాజాగా దీని ట్రైలర్ గురించి కూడా అప్డేట్ వచ్చేసింది.


బ్యాక్ టు బ్యాక్

నాగచైతన్య హీరోగా అల్లు అరవింద్ నిర్మిస్తున్న ‘తండేల్’ (Thandel) మూవీ గతేడాది విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. పోనీ సంక్రాంతికి విడుదల చేద్దామంటే అప్పటికే పలు సీనియర్ హీరోలు సంక్రాంతి డేట్స్‌ను బ్లాక్ చేసేసుకున్నారు. అందుకే పెద్దగా పోటీ ఏమీ లేకుండా ఫిబ్రవరి 7న ‘తండేల్’ విడుదలను కన్ఫర్మ్ చేశారు. విడుదలకు ఇంకా కొన్నిరోజులే సమయం ఉండడంతో ప్రమోషన్స్ విషయంలో జోరుపెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు విడుదల కాగా.. ఆ పాటలతోనే మూవీపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్‌కు టైమ్ వచ్చేసింది.


మాస్ అవతార్

‘తండేల్’ మూవీకి సంబంధించిన టీజర్ చాలాకాలం క్రితమే విడుదలయ్యింది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కోసం మూవీ టీమ్ ముహూర్తం ఫిక్స్ చేసింది. జనవరి 28న ఈ మూవీ ట్రైలర్ విడుదల కానుందని అప్డేట్ అందించింది. ఈ ట్రైలర్ రిలీజ్ డేట్‌తో పాటు ఒక స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేసింది. అందులో నాగచైతన్య (Naga Chaitanya) చాలా అగ్రెసివ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. తన చేతిలో ఉన్న బకెట్‌కు పూర్తిగా రక్తం అంటుకొని ఉంది. అలా ఇప్పటివరకు ‘తండేల్’ నుండి వచ్చిన దాదాపు ప్రతీ అప్డేట్‌లో చైతూ ఫుల్ మాస్ అవతారంలోనే కనిపిస్తున్నాడు. ఇక సినిమాలో తను ఎలా ఉంటాడో అని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది.

Also Read: తప్పు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం.. షారుఖ్ ఖాన్‌కు రూ.9 కోట్లు కట్టాల్సిందే.!

హిట్ కాంబినేషన్

‘తండేల్’లో నాగచైతన్యకు జోడీగా సాయి పల్లవి (Sai Pallavi) నటించింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. అందుకే వీరిద్దరిని ఈ సినిమాలో క్యాస్ట్ చేసుకున్నాడు దర్శకుడు చందూ మోండేటి. ఇక చందు, చైతూ కాంబినేషన్‌లో కూడా ఇంతకు ముందు ‘ప్రేమమ్’ అనే మూవీ వచ్చి మంచి హిట్ అయ్యింది. అలా నాగచైతన్య ఈసారి తనకు కలిసొచ్చిన హీరోయిన్‌తో, హిట్ ఇచ్చిన దర్శకుడితో కలిసి వస్తున్నాడు. చైతూ కెరీర్‌లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘తండేల్’ ఎలాగైనా హిట్ అవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×