E-Paper
Advertisement

మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిన సేవలు, ఇబ్బందుల్లో లక్షలాది మంది

మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిన సేవలు, ఇబ్బందుల్లో లక్షలాది మంది
Advertisement

Technical Glitch: ప్రపంచంలో అతిపెద్ద టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్థలు తలెత్తాయి. ఫలితంగా రకరకాల సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య కారణంగా లక్షలాది మంది వినియోగదారులు తమ ఈ-మెయిల్స్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిన సేవలు

ప్రపంచవ్యాప్తంగా గురువారం మైక్రోసాఫ్ట్ సేవల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీని కారణంగా మైక్రోసాఫ్ట్-365, ఔట్‌లుక్, టీమ్స్ పని చేయకపోయాయి. ఫలితంగా లక్షలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో సైబర్ నేరగాళ్లు విరుచుకుపడ్డారేమోనని భయపడ్డారు.  ఆఫీసు పనుల కోసం సేవలను ఉపయోగించేవారికి సమస్యలు తప్పలేదు.

Advertisement

ఈ-మెయిల్స్ పంపడం, మెసేజ్‌లు చేయడం, వంటి ఆన్‌లైన్ సేవలు సాధ్యం కాలేదు. ఈ సమస్యను గుర్తించిన మైక్రోసాఫ్ట్, తమ టెక్నికల్ టీమ్‌లో లోపాన్ని సరిదిద్దే పనిలో పడింది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి డౌన్‌ డిటెక్టర్‌లో సుమారు 1,30,000 మంది వినియోగదారులను ప్రభావితం చేసినట్టు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. మైక్రోసాఫ్ట్ 365లో 47 వేలు నమోదు కాగా, టీమ్స్-కోపైలట్ అంతరాయాలను ఎదుర్కొన్నాయి. ప్రభావితమైన ఇతర సేవలలో వన్‌డ్రైవ్. షేర్‌పాయింట్ కూడా ఉన్నాయి.

ఇబ్బందుల్లో లక్షలాది మంది

కొన్ని సర్వర్లు అకస్మాత్తుగా అధిక భారాన్ని ఎదుర్కొన్నట్లు సదరు కంపెనీ తెలిపింది. అనేక సర్వర్లు ఆటోమేటిక్ హెల్త్ చెక్‌లో విఫలమైయ్యాయని, వాటంతట అవే షట్ డౌన్ అయ్యాయని పేర్కొంది. దీంతో ఉత్తర అమెరికాలో టీమ్స్ రంగంలోకి దిగి ఈ సమస్య పరిష్కరించబడింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మొదలైన ఈ వ్యవహారం సాయంత్రం 5 గంటలకు తిరిగి అందుబాటులోకి వచ్చింది. అప్పటికీ అవుట్‌లుక్/ఈ-మెయిల్ ఇంకా పని చేయలేదు.

Advertisement

ALSO READ: పదేళ్లలో క్యాన్సర్, అల్జీమర్స్ మాయం? ఏఐతో వ్యాధులకు చెక్!

మరోవైపు హ్యాకింగ్ లేదా సైబర్‌దాడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని మైక్రోసాఫ్ట్ క్లారిటీ ఇచ్చింది. కంపెనీ సిస్టమ్‌లో అంతర్గత సాంకేతిక లోపంగా ప్రస్తావించింది. మైక్రోసాఫ్ట్ మొత్తం ఉద్యోగుల సంఖ్యను సుమారు 2.1 శాతం మేరా తగ్గిస్తోంది. దాదాపు 4,800 మంది ఉద్యోగులు అన్నమాట. టెక్ పరిశ్రమ అంతటా ఉద్యోగాల కోతల మధ్య AI మౌలిక సదుపాయాల్లో భారీగా పెట్టుబడి పెట్టడం, వ్యాపార సామర్థ్యాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకుంది.

Related News

పదేళ్లలో క్యాన్సర్, అల్జీమర్స్ మాయం? ఏఐతో వ్యాధులకు చెక్!

చంద్రుడి దూళితో ఇటుకలు.. సిమెంట్ అవసరం లేదట, ఎలా నిర్మిస్తారంటే?

భారీ స్క్రీన్ లవర్స్‌కు గుడ్ న్యూస్..Vu మాస్టర్‌పీస్ ఏఐ టీవీలు లాంచ్!

పాకెట్ మనీతోనే ప్రీమియం వాచ్ కొనేయండి!రూ.495కే ఊహించని ఫీచర్లతో స్మార్ట్‌వాచ్ లాంచ్!

ఈ వాక్యూమ్ క్లీనర్‌తో..కారు శుభ్రం చేయడం చాలా ఈజీ

రూ.500కే అదిరిపోయే ఫీచర్లు..MAGICZONE Pro 3 ఇయర్‌బడ్స్ రివ్యూ!

గోల్డెన్ ఛాన్స్.. రూ.11,000 లోపే 40 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్యాంక్ డిస్కౌంట్లతో మరింత తగ్గింపు!

Big Stories

Advertisement
×