E-Paper
Advertisement

భారీ స్క్రీన్ లవర్స్‌కు గుడ్ న్యూస్..Vu మాస్టర్‌పీస్ ఏఐ టీవీలు లాంచ్!

భారీ స్క్రీన్ లవర్స్‌కు గుడ్ న్యూస్..Vu మాస్టర్‌పీస్ ఏఐ టీవీలు లాంచ్!
Advertisement

vu masterpiece aeye tv series: ప్రముఖ టెలివిజన్ బ్రాండ్ ‘వు'(Vu) మార్కెట్లో సరి కొత్త సంచలనానికి తెరతీసింది. టెక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకునేలా ‘మాస్టర్‌పీస్ ఏఐ’ టీవీ సిరీస్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఏకంగా 55 అంగుళాల నుంచి ప్రారంభమై 115 అంగుళాల భారీ స్క్రీన్ సైజు వరకు ఈ సిరీస్ లభిస్తుంది. ప్రత్యేకమైన ఆర్జీబీ మినీఎల్‌ఈడీ డిస్‌ప్లే, ఏఐ-ఆధారిత ఐ-కంఫర్ట్ టెక్నాలజీతో వస్తున్న ..ఈ సరి కొత్త ప్రీమియం స్మార్ట్ టీవీల పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం!

పూర్తి ఫీచర్లు:

డిస్‌ప్లే, ఏఐ ఐ-కంఫర్ట్ టెక్నాలజీ:

ఈ కొత్త సిరీస్‌లో అత్యంత ముఖ్యమైన హైలైట్ ఏంటంటే ఇందులో ఆర్జీబీ మినీఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఉపయోగించారు. ఇది 100% BT.2020 కలర్ కవరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ టీవీలలో.. ప్రత్యేకమైన ‘ఏఐ ఐ-కంఫర్ట్’ టెక్నాలజీని వాడారు. గదిలోని వెలుతురును బట్టి, విజువల్స్ తగినట్లుగా పిక్చర్ క్వాలిటీని ఈ టీవీ స్వయంగా సర్దుబాటు చేసుకుంటుంది. రాత్రి సమయాల్లో.. కంటికి ఇబ్బంది కలగకుండా.. ఆటోమేటిక్‌గా వార్మర్ టోన్స్‌కు మారుతుంది. దీని వల్ల ఎంత సేపు టీవీ చూసినా.. కళ్లపై ఒత్తిడి పడదు.

స్క్రీన్ సైజులు, ధరల వివరాలు:

Advertisement

55 అంగుళాల మోడల్: రూ. 75,000

65 అంగుళాల మోడల్: రూ. 95,000

Advertisement

75 అంగుళాల మోడల్: రూ. 1,30,000

85 అంగుళాల మోడల్: రూ. 1,75,000

98 అంగుళాల మోడల్: రూ. 2,95,000

115 అంగుళాల భారీ మోడల్: రూ. 13,00,000

ఈ టీవీల అమ్మకాలు దేశవ్యాప్తంగా ప్రముఖ రిటైల్ స్టోర్లు , ఆన్‌లైన్ ఫ్లాట్ ఫామ్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

పవర్ ఫుల్ సౌండ్,హార్డ్‌వేర్ ఫీచర్లు:

కేవలం పిక్చర్ క్వాలిటీనే కాకుండా.. సౌండ్ విషయంలోనూ ఈ టీవీలు అదరగొడుతున్నాయి. 55 నుంచి 98 అంగుళాల మోడళ్లలో 110W అవుట్‌ పుట్ కలిగిన స్పీకర్ సిస్టమ్ ఉండగా.. టాప్-ఎండ్ అయిన 115 అంగుళాల భారీ మోడల్‌లో.. ఏకంగా 240W పవర్ ఫుల్ అవుట్‌ పుట్ కలిగిన 10-డ్రైవర్ ఆడియో సిస్టమ్‌ను అందించారు. ఇవి డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో ఇంట్లోనే థియేటర్ లాంటి సరౌండ్ సౌండ్ అందిస్తాయి. సాఫ్ట్‌వేర్ పరంగా ఇవి గూగుల్ టీవీ ఎస్‌పై పని చేస్తాయి. జెమిని ఏఐ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. అదనంగా 3GB RAM,32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది.

భారీ స్క్రీన్ సైజులు,లేటెస్ట్ ఆర్జీబీ మినీఎల్‌ఈడీ టెక్నాలజీ, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే ఏఐ ఐ-కంఫర్ట్ ఫీచర్లతో.. వస్తున్న Vu మాస్టర్‌పీస్ ఏఐ టీవీ సిరీస్ ప్రీమియం మార్కెట్లో.. సరి కొత్త బెంచ్‌మార్క్ సృష్టిస్తోంది. మీరు మీ ఇంట్లోనే లగ్జరీ థియేటర్ ఫీల్ పొందాలనుకుంటే ఈ సరికొత్త సిరీస్ ఒక చక్కటి ఎంపికగా నిలుస్తుంది!

Related News

పాకెట్ మనీతోనే ప్రీమియం వాచ్ కొనేయండి!రూ.495కే ఊహించని ఫీచర్లతో స్మార్ట్‌వాచ్ లాంచ్!

ఈ వాక్యూమ్ క్లీనర్‌తో..కారు శుభ్రం చేయడం చాలా ఈజీ

రూ.500కే అదిరిపోయే ఫీచర్లు..MAGICZONE Pro 3 ఇయర్‌బడ్స్ రివ్యూ!

గోల్డెన్ ఛాన్స్.. రూ.11,000 లోపే 40 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్యాంక్ డిస్కౌంట్లతో మరింత తగ్గింపు!

ఇంకా పాత గీజరే వాడుతున్నారా? ఈ 5 సంకేతాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి, లేదంటే ప్రమాదం తప్పదు!

రూ.461కే డిజిటల్ డిస్‌ప్లే ఇయర్‌బడ్స్..మార్కెట్‌లో హల్ చల్ చేస్తున్న మోడల్

Airtel సూపర్ ప్లాన్.. రోజూ 2.5GB డేటా, కాల్స్, అమెజాన్ ప్రైమ్, 18+ ఓటీటీలు ఫ్రీ.. ఇంకా మరెన్నో!

Big Stories

Advertisement
×