E-Paper
Advertisement

పదేళ్లలో క్యాన్సర్, అల్జీమర్స్ మాయం? ఏఐతో వ్యాధులకు చెక్!

పదేళ్లలో క్యాన్సర్, అల్జీమర్స్ మాయం? ఏఐతో వ్యాధులకు చెక్!
Advertisement

క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు, మానసిక సమస్యలు.. ఒక్కసారి వచ్చాయంటే వీటిని వదిలించుకోవడం చాలా కష్టం. వీటికి పదేళ్లలో చెక్ పెట్టొచ్చు అంటున్నారు టెక్‌ ఎక్స్‌పర్ట్స్. ఇవన్నీ అయ్యే పనులు కాదులేంటి అంటారా? కానీ అవుతుంది అంటున్నారు. మరో వందేళ్ల తర్వాతో, రెండొందల ఏళ్ల తర్వాతో కాదు… కేవలం పదేళ్లలోపే.. వీటన్నింటికి చెక్ పెట్టేయచ్చు అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్… అంటే ఏఐ సాయంతో వేల మనల్ని వేధిస్తున్న వ్యాధులకు చెక్ పెట్టొచ్చని ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ సంచలన స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు. మరి నిజంగానే ఏఐ ప్రపంచాన్ని మార్చేయబోతోందా? పదేళ్లలో ప్రాణాంతక వ్యాధులన్నీ ఇక మాయమవుతాయా? ఇందులో నిజమెంత? అసలు ఈ అంచనాల లెక్కలేంటీ?

100 ఏళ్లు పట్టే పనికి.. ఐదు, పదేళ్లు చాలట!

ఆంథ్రోపిక్.. ఏఐ వరల్డ్‌లో ఓ రెవల్యూషన్. ఈ సంస్థ సీఈవో డారియో అమోడెయ్ చేప్పిన మాటలు ఇప్పుడు టెక్, మెడికల్ రంగంలో ఓ హాట్ టాపిక్‌. ఏఐని సరిగ్గా ఉపయోగించగలిగితే… వచ్చే పదేళ్లలో క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు, మానసిక సమస్యల వంటి వ్యాధులను పూర్తిగా నిర్మూలించే స్థాయికి చేరుకోవచ్చని చెబుతున్నారు. అంతేకాదు నార్మల్‌గా వైద్య పరిశోధనల్లో 50 నుంచి 100 ఏళ్లు పట్టే పనిని ఏఐ హెల్ప్‌తో కేవలం ఐదు నుంచి పదేళ్లలో సాధించవచ్చని చెబుతున్నారు. అంటే… దశాబ్దాల పరిశోధనలు, వేలాది మంది శాస్త్రవేత్తల శ్రమతో సాధించాల్సిన ఫలితాలను ఏఐ చాలా ఫాస్ట్‌గా ఇచ్చేస్తుందని ఆయన చెబుతున్న మాట.

ఆయన జీవితంలో జరిగిన ఆ రెండు ఘటనలే నిదర్శనం

Advertisement

అమోడెయ్ కాన్ఫిడెన్స్‌కు రీజన్సేంటి? దీనికి ఆయన జీవితంలో జరిగిన రెండు సంఘటనలే కారణం. అమోడెయ్ తండ్రి హెపటైటిస్-సి వ్యాధితో మరణించారు. అయితే ఆయన చనిపోయిన కొద్దికాలానికే ఆ వ్యాధిని దాదాపు 95 శాతం నయం చేయగలిగే మందులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే అమోడెయ్ కూడా స్టార్టింగ్ స్టేజ్‌ క్యాన్సర్‌తో ఇబ్బంది పడ్డారు. దాని నుంచి బయటపడ్డారు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఆయన ఏమంటున్నాడు అంటే.. ఇప్పుడు మనకు ఈజీగా ట్రీట్‌ అవుతున్న ఈ వ్యాధులన్ని ఒకప్పుడు ప్రాణాంతకమైనవి అని చెబుతున్నాడు. సో.. పరిశోధనలు స్పీడ్‌గా అయితే.. ఇప్పుడు ప్రాణంతకంగా భావిస్తున్న వ్యాధులన్నింటికి ఫ్యూచర్‌లో ఈజీగా ట్రీట్ చేయచ్చు కదా అనేది ఆయన మాట.

ఏఐ ఎలా హెల్ప్ చేస్తుంది?

మన శరీరంలో వచ్చే వ్యాధులకు కారణాలు ఎన్నో ఉంటాయి. జన్యుపరమైన మార్పులు కావొచ్చు.. కణాల్లో జరిగే మార్పులు కావొచ్చు.. ప్రొటీన్ల పనితీరులో తేడాలు కావొచ్చు.. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్‌ కారణంగా మనకు వ్యాధులు వస్తాయి. వీటన్నింటినీ విశ్లేషించాల్సిన పని సైంటిస్టులది. నిజానికి ఈ పని చేయడానికి సైంటిస్టులకు చాలా టైమ్ పడుతుంది. ఇక్కడే ఏఐ హెల్ప్‌ తీసుకోవచ్చనే చర్చ మొదలైంది. చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న డేటాని చాలా ఫాస్ట్‌గా అనలైజ్ చేసి.. వ్యాధులకు కారణమయ్యే అంశాలను ఈజీగా ఐడెంటిఫై చేస్తుందని చెబుతున్నారు. అంటే కొత్త మెడిసిన్ తయారీకి అవసరమైన అణువులను గుర్తించడం, వాటి ప్రభావాన్ని అంచనా వేయడం, పరిశోధనల్లో ఉపయోగపడే కొత్త మార్గాలను సూచించడం… ఇలా అనేక పనుల్లో ఏఐ కీలక పాత్ర పోషించగలదు.

క్లాడ్ ఏఐతో.. అవన్నీ సాధ్యమా?

Advertisement

నిజం చెప్పాలంటే.. ఇప్పటికే ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ మెడికల్ రిసెర్చ్‌లో చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాదు… క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియలో పట్టే సమయాన్ని 30 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు అమోడెయ్. అంటే మందుల తయారీ నుంచి రీసెర్చ్‌ వరకు… వైద్య రంగంలో ఏఐ ఒక గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉందన్నమాట. అమోడెయ్ మాత్రమే కాదు… టెక్ ప్రపంచంలోని మరికొందరు దిగ్గజాలు కూడా ఏఐ వండర్స్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నారు. గూగుల్ డీప్‌మైండ్ సీఈవో డెమిస్ హస్సాబిస్ కూడా ఏఐ సాయంతో పదేళ్ల పరిశోధనలను కేవలం కొన్ని వారాల్లోనే పూర్తి చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఇక ఎలాన్ మస్క్‌ది కూడా ఇదే మాట.

ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే, అసలు కథ వేరే ఉంది

వినడానికి అంతా బాగానే ఉంది.. చాలా ఫాస్ట్‌గా ట్రయల్స్‌ పూర్తై మెడిసిన్ వచ్చేస్తుంది.. అనుకుంటున్నారా? కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇదంతా నాణానికి ఒకవైపు. ఇప్పుడు మరో వైపు చూద్దాం. ఫార్మా కంపెనీల పెద్దలు, మెడికల్ ఎక్స్‌పర్ట్స్‌ మాత్రం ఈ మాటలను కొట్టిపడేస్తున్నారు. వారి వాదనలోనూ బలమైన కారణాలున్నాయి. ఒక వ్యాధికి మందు కనిపెట్టడం ఒక ఎత్తయితే.. ఆ మందు మనుషులపై సురక్షితంగా పనిచేస్తుందని నిరూపించడం మరో ఎత్తు. ల్యాబ్‌లో అద్భుతంగా పనిచేసిన మందు.. మనుషుల శరీరంలోనూ అదే ఫలితాన్ని ఇస్తుందని చెప్పలేం. దానికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలి. సైడ్ ఎఫెక్ట్స్‌ను గుర్తించాలి. లాంగ్‌ రన్‌లో ఏదైనా ఇంపాక్ట్‌ క్రియెట్ అవుతుందో చూడాలి.. ఇవన్నీ చేశాకే వాటికి అనుమతులు ఇస్తారు.

ప్రక్రియ పూర్తవడానికి 10 నుంచి 12 ఏళ్లు?

ఈ మొత్తం ప్రక్రియకు కొన్నిసార్లు 10 నుంచి 12 ఏళ్లు కూడా పట్టవచ్చు అనేది వారి మాట. అందుకే ఏఐ రీసెర్చ్‌ను ఫాస్ట్‌గా చేసినా.. వాటిని మనుషులకు ఇచ్చే ట్రీట్‌మెంట్‌లో ఉపయోగించడానికి కావాల్సిన టైమ్‌ను పూర్తిగా తొలగించలేదని చెబుతున్నారు. అందుకే పదేళ్లలో అన్ని రోగాలు మాయమవుతాయనే ప్రచారం ప్రజల్లో అనవసర ఆశలను పెంచుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. టెక్ దిగ్గజాలేమో పదేళ్లలో సీన్ మొత్తం మారిపోతుంది అంటున్నారు.. మెడికల్ ఎక్స్‌పర్ట్స్‌ ఏమో.. టైమ్‌ తగ్గుతుందనే మాట వాస్తవమే కానీ.. పదేళ్లలో అన్నీ అయిపోవు అంటున్నారు. ఈ డిబెట్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Also Read: చంద్రుడి దూళితో ఇటుకలు.. సిమెంట్ అవసరం లేదట, ఎలా నిర్మిస్తారంటే?

కానీ వైద్య రంగంలో ఏఐ ఒక గేమ్‌ ఛేంజర్‌ అవ్వడం మాత్రం ఖాయం. వ్యాధులను ముందుగానే గుర్తించడం నుంచి కొత్త మందుల ఆవిష్కరణ వరకు… వైద్య పరిశోధనల వేగాన్ని పెంచడంలో ఏఐ కీలక పాత్ర పోషించే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మందును కనిపెట్టడం వేరు… ఆ మందుతో ప్రాణాలను కాపాడగలమని నిరూపించడం వేరు. అందుకే ఏఐ రాకతో ఆశలు పెంచుకోవచ్చు. కానీ క్యాన్సర్, అల్జీమర్స్ సహా అన్ని వ్యాధులూ పదేళ్లలో మాయమవుతాయని ఇప్పుడే నిర్ణయించలేం.

Tags

Related News

చంద్రుడి దూళితో ఇటుకలు.. సిమెంట్ అవసరం లేదట, ఎలా నిర్మిస్తారంటే?

భారీ స్క్రీన్ లవర్స్‌కు గుడ్ న్యూస్..Vu మాస్టర్‌పీస్ ఏఐ టీవీలు లాంచ్!

పాకెట్ మనీతోనే ప్రీమియం వాచ్ కొనేయండి!రూ.495కే ఊహించని ఫీచర్లతో స్మార్ట్‌వాచ్ లాంచ్!

ఈ వాక్యూమ్ క్లీనర్‌తో..కారు శుభ్రం చేయడం చాలా ఈజీ

రూ.500కే అదిరిపోయే ఫీచర్లు..MAGICZONE Pro 3 ఇయర్‌బడ్స్ రివ్యూ!

గోల్డెన్ ఛాన్స్.. రూ.11,000 లోపే 40 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్యాంక్ డిస్కౌంట్లతో మరింత తగ్గింపు!

ఇంకా పాత గీజరే వాడుతున్నారా? ఈ 5 సంకేతాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి, లేదంటే ప్రమాదం తప్పదు!

Big Stories

Advertisement
×