Magiczone pro 3 earbuds: ప్రస్తుత డిజిటల్ యుగంలో వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ప్రతి ఒక్కరి అవసరంగా మారిపోయాయి. మంచి ఫీచర్లు.. ఉన్న ఇయర్ బడ్స్ కొనాలంటే.. వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ కేవలం రూ. 500 బడ్జెట్‌లోనే అద్భుతమైన ఫీచర్లు, భారీ బ్యాటరీ బ్యాకప్‌తో కూడిన సరి కొత్త ఇయర్ బడ్స్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.అవే ‘MAGICZONE New Earbuds Pro 3’. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ గాడ్జెట్ గురించిన పూర్తి విశేషాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం!
ఈ ధరలో ఇయర్ బడ్స్ అంటే.. ఎలా ఉంటాయో అనే సందేహం చాలా మందికి రావడం సహజం. కానీ ఈ మోడల్ చూడటానికి చాలా స్టైలిష్‌గా , మోడర్న్ లగ్జరీ లుక్‌తో.. వస్తుంది. ఇది ఆకర్షణీయమైన ‘బీజ్’కలర్ ఆప్షన్‌లో లభిస్తుండటం యూత్, ప్రొఫెషనల్స్‌ను ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఇయర్ బడ్స్ చెవుల్లో పెట్టుకున్నప్పుడు సౌకర్యవంతంగా ఉండేలా ఎర్గోనామిక్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. అందుకే ఎంత సేపు పెట్టుకున్నా చెవులకు ఎలాంటి నొప్పి కలగదు. దీని కాంపాక్ట్ ఛార్జింగ్ కేస్ పాకెట్‌లో కూడా ఈజీగా సరిపోతుంది.
ఈ ఇయర్‌బడ్స్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఇందులో ఉన్న ‘4 మైక్ ENC’ టెక్నాలజీ. సాధారణంగా.. బడ్జెట్ ఇయర్ బడ్స్‌లో కాల్ మాట్లాడేటప్పుడు చుట్టు పక్కల శబ్దాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ ..ఇందులో ఉండే నాలుగు మైక్రోఫోన్లు, ఈఎన్‌సీ ఫీచర్ బయటి సౌండ్స్‌ను సమర్థవంతంగా అడ్డుకుని, అవతలి వారికి.. మీ గొంతును చాలా స్పష్టంగా వినిపించేలా చేస్తాయి. ఆఫీస్ కాల్స్ , ఆన్‌లైన్ మీటింగ్స్ మాట్లాడేవారికి ఇది చాలా ఉపయోగ పడుతుంది.
సౌండ్ ఇష్టపడే వారి కోసం ఈ ఇయర్ బడ్స్ హై-డెఫినిషన్ సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. పాటలు వినేటప్పుడు.. మంచి బేస్, క్లియర్ వోకల్స్ లభిస్తాయి. ఇక బ్యాటరీ.. విషయానికి వస్తే.. ఈ ధరలో నమ్మలేని ఏకంగా 48 గంటల భారీ బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందిస్తుంది. ఒక సారి పూర్తి ఛార్జ్ చేస్తే.. రోజంతా ఎలాంటి టెన్షన్ లేకుండా.. మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు. ఛార్జింగ్ కేస్ సాయంతో .. మల్టిపుల్ టైమ్స్ ఛార్జ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
Also Read: రూ.461కే డిజిటల్ డిస్‌ప్లే ఇయర్‌బడ్స్..మార్కెట్‌లో హల్ చల్ చేస్తున్న మోడల్
ఈ మోడల్ ఇయర్ బడ్స్ లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీతో వస్తాయి. ఇవి మీ స్మార్ట్ ఫోన్, ట్యాబ్ లేదా ల్యాప్‌టాప్‌తో క్షణాల్లో పేరింగ్ అయిపోతాయి. కనెక్షన్ డ్రాప్.. అయ్యే సమస్యలు లేకుండా స్టేబుల్ కనెక్టివిటీని అందిస్తాయి. మార్కెట్లో.. దీని ధర కేవలం రూ. 500 మాత్రమే ఉండటంతో సామాన్యులు సైతం ఈజీగా కొనొచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ మోడల్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి ప్రీమియం ఇయర్ బడ్స్ కొనలేమని ఆందోళన చెందాల్సిన పనిలేదు. కేవలం రూ. 500 బడ్జెట్‌లో లభిస్తున్న ఈ మోడల్ మీ మ్యూజిక్ ఫీల్ పూర్తిగా మారుస్తుంది. 4 మైక్ ENC, 48 గంటల బ్యాటరీ బ్యాకప్,స్టైలిష్ బీజ్ కలర్ లుక్ కోరుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మీ బడ్జెట్‌లో.. అద్భుతమైన ఫీచర్లు కావాలనుకుంటే.. ఈ ఇయర్‌బడ్స్‌ను నిరభ్యంతరంగా కొనొచ్చు!