BigTV English
Advertisement

Tecno Pop 9 5G: వాసివాడి తస్సాదియ్య.. రూ.9,499 లకే సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్, డోంట్ మిస్ బ్రదరూ!

Tecno Pop 9 5G: వాసివాడి తస్సాదియ్య.. రూ.9,499 లకే సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్, డోంట్ మిస్ బ్రదరూ!

Tecno Pop 9 5G Launched: టెక్ బ్రాండ్ టెక్నో కంపెనీ తన హవా చూపిస్తోంది. దేశీయ మార్కెట్‌లో కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సామాన్యుల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ ధరలోనే ఫోన్లను రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే తన లైనప్‌లో ఉన్న చాలా మోడళ్లను మార్కెట్‌లో పరిచయం చేసింది. ఇక ఇప్పుడు మరో ఫోన్‌ను తాజాగా భారతదేశంలో విడుదల చేసింది. తన లైనప్‌లో ఉన్న Tecno Pop 9 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో దేశంలో లాంచ్ అయిన Tecno Pop 8కి ఇది సక్సెసర్‌గా వచ్చింది.


ఈ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ వెనుక కెమెరా అందించారు. ఇది NFC మద్దతుతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. అక్టోబర్ ప్రారంభంలో ఈ ఫోన్‌ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

Tecno Pop 9 5G Specifications


Tecno Pop 9 5G స్మార్ట్‌ఫోన్ డ్యూయల్-సిమ్ (నానో+నానో)తో వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో unspecified LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇక ప్రాసెసర్ విషయానికొస్తే.. MediaTek డైమెన్సిటీ 6300 SoCని పొందుతుంది. 4GB RAM + 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే.. Tecno Pop 9 5G స్మార్ట్‌ఫోన్ 48 మెగాపిక్సెల్ Sony IMX582 వెనుక కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. అదే సమయంలో LED ఫ్లాష్‌తో వస్తుంది. ఇది 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అమర్చబడింది.

Also Read:  అప్పు తీసుకుని అయినా ఒప్పో కొనేయాల్సిందే మావా.. 5జీ ఫోన్ మరీ ఇంత చీపా!

ఇక ఈ హ్యాండ్‌సెట్‌లో డాల్బీ అట్మోస్‌తో కూడిన డ్యూయల్ స్పీకర్‌లు ఉన్నాయి. Tecno Pop 9 5G బ్యాటరీ విషయానికొస్తే.. ఇది 18W వైర్డు ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఫోన్ ఇన్‌ఫ్రారెడ్ (IR) ట్రాన్స్‌మిటర్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. దీంతో పాటు మరెన్నో అధునాతన స్పెసిఫికేషన్లు ఇందులో అందించబడ్డాయి.

Tecno Pop 9 5G Price

భారతదేశంలో లాంచ్ అయిన Tecno Pop 9 5G స్మార్ట్‌ఫోన్ ధర విషయానికొస్తే.. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ 9,499 ధరను కలిగి ఉంది. అదే సమయంలో ఈ ఫోన్ 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 9,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్‌లో ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంది.

అక్టోబర్ 7 న ఫస్ట్ టైం సేల్‌కు రానుంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రకారం.. వినియోగదారులు రూ.499 టోకెన్ అమౌంట్‌తో మొబైల్‌ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. దీని ద్వారా కొనుగోలు సమయంలో అమెజాన్ పే బ్యాలెన్స్‌గా తిరిగి క్రెడిట్ అవుతుంది. Tecno Pop 9 5G మూడు కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది. అందులో అరోరా క్లౌడ్, అజూర్ స్కై, మిడ్‌నైట్ షాడో వంటివి ఉన్నాయి.

Related News

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేయండి

Moto G Stylus 5G: స్టైలస్‌తో స్టైలిష్‌గా.. మోటరోలా మోటో జి స్టైలస్ 5జి స్పెషల్‌ ఫీచర్లు ఇవే

Nokia X 5G: మళ్లీ దుమ్మురేపేందుకు సిద్ధమైన నోకియా ఎక్స్ 5జి.. 6000mAh బ్యాటరీతో ఎంట్రీ..

Redmi K80 Pro 5G: అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న రెడ్మీ కె80 ప్రో అల్ట్రా 5జి.. ఇది నిజంగా గేమ్‌ ఛేంజర్‌ ఫోన్‌!

iQOO 13 Review: ఐక్యూ 13 టెక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. ఒక్క ఫోన్‌తో మొత్తం ట్రెండ్ మార్చేసింది

Big Stories

×